jaggaiahpet
-
జగ్గయ్యపేటలో తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
పచ్చ గూండాల అరాచకం.. అర్ధరాత్రి కర్రలతో దాడి
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో పచ్చ మూకలు రెచ్చిపోతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్డీఆర్ జిల్లాలో టీడీపీ గుండాలు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ నాయకుడితో సహా మరో ఇద్దరిపై కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలు కావడంతో వారిని జగయ్యపేట ఆసుపత్రికి తరలించారు.కాగా, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని నవాబుపేటలో టీడీపీ గూండాలు రెచ్చిపోయి దాడులు చేశారు. పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వైఎస్సార్సీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ నేత చింతా వెంకటేశ్వరరావు (@ బుల్లబ్బాయ్) సహా మరో ఐదుగురు దాడికి పాల్పడ్డారు. టిఫిన్ చేసేందుకు హోటల్ వద్దకు వెళ్లిన గింజుపల్లి శ్రీనివాసరావుపై ఒక్కసారిగా దాడి చేశారు. వారి వెంట తెచ్చుకున్న కర్రలతో శ్రీనివాసరావును తీవ్రంగా గాయపరిచారు.ఈ ఘటన సందర్భంగా హోటల్ వద్ద ఉన్న పలువురు టీడీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు ఆగకుండా కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన మరో ఇద్దరు గాయపడ్డారు. అంతటితో ఆగకుండా శ్రీనివాసరావు కారును కూడా ధ్వంసం చేశారు. అనంతరం, స్థానికులు గాయపడిన వారిని జగ్గయ్యపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావును మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించిన తెలుస్తోంది. అయితే, 2009లో శ్రీనివాసరావు తండ్రి వీరయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా టీడీపీ నేత చింతా వెంకటేశ్వరరావు ఉన్నారు. -
డయేరియా డేంజర్ బెల్స్
-
జగ్గయ్యపేట టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. పెనుగంచిప్రోలులో ఆ నియోజకవర్గ టీడీపీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. బొల్లా వర్సెస్ శ్రీరామ్ రాజగోపాల్ వర్గాలుగా క్యాడర్ విడిపోయింది. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వ్యతిరేక వర్గం సమావేశమైంది. పార్టీలో మాకు కనీసం మర్యాద ఇవ్వడం లేదంటూ బొల్లా రామకృష్ణ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం వర్గీయులుగా మా పై ముద్ర వేశారు. శ్రీరామ్ రాజగోపాల్‌కు అధిష్టానం టిక్కెట్ ప్రకటించిన తర్వాత ఇంత వరకూ మమ్మల్ని కలుపుకుపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను టీడీపీ పార్టీ వ్యక్తినే కాదని శ్రీరామ్ రాజగోపాల్ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల గెలుపు కోసం లక్షలాది రూపాయలు వెచ్చించా. నేను అంత ఖర్చు చేశాను కాబట్టే టీడీపీ అభ్యర్ధులు గెలిచారు. టీడీపీ పార్టీ అందరిదీ...తాతయ్య సొత్తు కాదు. శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) నా పై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. లేకపోతే నా భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తా’’ అని బొల్లా రామకృష్ణ హెచ్చరించారు. ఇదీ చదవండి: మోసాల బాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి: సీఎం జగన్ -
మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. ట్విస్ట్ ఏంటంటే
సాక్షి, పెనుగంచిప్రోలు(కృష్ణా): మొదటి భార్యకు తెలియకుండా మరొక యువతిని రెండో పెళ్లి చేసుకుంటున్న యువకుడిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మొదటి భార్య కథనం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన సీహెచ్.సరితను భువనగిరికి చెందిన చెర్కుపల్లి మధుబాబు 2016లో వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్తమామలు, ఆడపడచు వేధించడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆదివారం తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో మధుబాబు మరొక యువతిని రెండో వివాహం చేసుకుంటున్నాడని సరితకు తెలిసింది. ఆమె ఆధారాలతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు స్పందించి మధుబాబు వివాహాన్ని అడ్డుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: 15 ఏళ్ల క్రితం వివాహం. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని -
భార్యా భర్తల గొడవ.. బామ్మర్తి చేతిలో బావ హతం
తొర్రకుంటపాలెం(జగ్గయ్యపేట): బావమరిదితో జరిగిన ఘర్షణలో బావ మృతి చెందిన ఘటన గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన తాటి సురేష్ (40) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శ్యామలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటివల కొంత కాలం నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. పెద్దలు రాజీ చేశారు. ఈ క్రమంలో ఈ నెల 19న మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ జరగటంతో భార్య పుట్టింటికి వెళ్లింది. గురువారం రాత్రి 12 గంటల సమయంలో సురేష్ భార్య కోసం వెళ్లాడు. ఆ సమయంలో భార్య ఇంటిలో లేకపోవటంతో భార్య సోదరుడు గుడిశ కిషోర్‌కు సురేష్‌కు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కిషోర్ కత్తితో సురేష్‌పై దాడి చేశాడు. సురేష్ అక్కడికక్కడే పడిపోయాడు. స్థానికులు అతడిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేష్ మరణించాడు. నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని తండ్రి పరమేశ్వరరావు ఫిర్యాదు మేరకు సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కిషోర్ పరారీలో ఉన్నాడు. (చదవండి: ‘ఆమె’గా వల.. న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్) -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 30మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారందరినీ పడినవారిని చికిత్స నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ...క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు విశాఖ, ఒడిశాకు చెందినవారుగా గుర్తించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ... బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే దానిపై డ్రైవర్ దగ్గర కనీసం సమాచారం కూడా లేదన్నారు. ప్రయాణికుల పేర్లు, వివరాలు...కనీసం ఫోన్ నెంబర్లు కూడా లేవని అన్నారు. తమకు ప్రజల ప్రాణాలు ముఖ్యమని, నియమ నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. -
ఆంధ్రాలో చంపి.. తెలంగాణలో పాతి పెట్టారు
సాక్షి, జగ్గయ్యపేట: అనైతిక బంధం మోజులో పడిన ఆ తల్లి విచక్షణ మరిచిపోయింది. రక్తం పంచుకుపట్టిన బిడ్డనే ప్రియుడితో కలిసి కడతేర్చిందో మహిళ. ఈ దారుణ సంఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకును హతమార్చి, మృతదేహాన్ని మరో ప్రాంతంలో పూడ్చి పెట్టింది. వివరాల్లోకి వెళితే.. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లికి చెందిన ఉష రెండు నెలల క్రితం భర్తతో విడిపోయి ప్రియుడితో కలిసి ఉంటోంది. ఉష ఇద్దరి కుమారులు కూడా వారితోనే ఉంటున్నాడు. అయితే కొడుకు తమకు అడ్డంకిగా మారడంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. దీంతో ప్రియుడు శ్రీనుతో కలిసి చిన్న కొడుకును హతమార్చింది. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని తెలంగాణలోని కోదాడ వద్ద పూడ్చి పెట్టారు. అయితే వీరి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఉషతో పాటు శ్రీనును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరం చేసినట్లు అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. -
నేను పడ్డ బాధ భగవంతుడికే తెలియాలి..
సాక్షి, విజయవాడ: అగ్నిప్రమాద సంఘటనలో మృత్యువు అంచు వరకూ వెళ్లి ప్రాణాలతో బయటపడిన కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఓ బాధితుడు ఇంకా తేరుకోలేదు. ప్రమాదం నుంచి బయటపడేందుకు తాము పడ్డ బాధ భగవంతుడికే తెలుసునని సీహెచ్ పవన్‌సాయి కిషన్ తెలిపారు. తాను ప్రాణాలతో ఉన్నానంటే ఫైర్, పోలీసు సిబ్బంది చలువేనని అతడు పేర్కొన్నారు. ‘స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో నేనొక బాధితుడిని. నా రూమ్ నెంబర్ 304. ఆ సమయంలో నేనే చాలా ఇబ్బంది పడ్డాను. ఎటువెళ్లాలో అర్థం కాలేదు. దట్టమైన పొగ నల్లగా కమ్ముకుంది. అంతట మంటలు వ్యాపించాయి. (విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం) ఎటువెళ్లాలో తెలియని ప్రాణాపాయ స్థితిలో కిటికీలు పగుల గొట్టుకుని కారిడార్లోకి వచ్చి కాపాడండి అంటూ అరిచాను. తేరుకుని పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాను. వారు తక్షణమే స్పందించి కాపాడారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం. మా బాధ ఎంతో వర్ణనాతీతం. ఎంతో ఇబ్బంది పడ్డాం. మేం పడ్డ బాధ భగవంతుడికి తెలియాలి. కనీస సౌకర్యాలు లేని స్వర్ణా ప్యాలెస్‌ను ఏ విధంగా కోవిడ్ సెంటర్‌కు ఇచ్చారు. రమేష్ హాస్పిటల్ వారు తగు వైద్య సౌకర్యం కల్పించాలి.’ అని డిమాండ్ చేశారు. (అగ్నిప్రమాదంలో సామినేని సన్నిహితుడు మృతి) -
బ్రదర్ అనిల్‌కుమార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
-
యాంకర్ హేమంత్ కారుకు ప్రమాదం
సాక్షి, విజయవాడ : ప్రముఖ టీవీ యాంకర్, నటుడు, ఆర్జే హేమంత్ కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి అతడు సురక్షితంగా బయటపడ్డాడు. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్డు వద్ద హేమంత్ కారు ఓ గేదెను ఢీ కొట్టింది. దీంతో కారు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఆ సమయంలో అతడే కారు డ్రైవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా విజయవాడలో ‘మహర్షి’ సక్సెస్ మీట్ కార్యక్రమం పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం
సాక్షి, గన్నవరం : నిన్న కంచికచర్ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు పట్టుబడిన ఘటన మరకవ ముందే... ప్రయివేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తప్పతాగి బస్సులు నడుపుతూ ప్రయాణికుల జీవితాలతో ఆటలాడుతున్నారంటూ పోలీసులు తనిఖీలు ముమ్మురం చేసినా డ్రైవర్లకు ఏమాత్రం పట్టడం లేదు. నిన్న రాత్రి కృష్ణాజిల్లా పొట్టిపాడు టోల్గేట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వరుణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తాగి వాహనం నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. గుంటూరు నుంచి విశాఖ వెళుతున్న ఈ బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటున్న యాజమన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు బస్సుకి వేరే డ్రైవర్‌ను ఇచ్చి పంపించేశారు. -
భార్య..భర్త @ ఎమ్మెల్యే
సాక్షి, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట నియోజకవర్గంలో భార్యభర్తలు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. వారే మండలంలోని ముక్త్యాల గ్రామానికి చెందిన ముక్త్యాల రాజా, రాణి. 1972 ఎన్నికల్లో వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ (ముక్త్యాల రాజా) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేపాల బుచ్చిరామయ్య శ్రేష్ఠిపై గెలుపొందారు. 1974లో ఆయన మరణానంతరం భార్య వాసిరెడ్డి రాజ్యలక్ష్మమ్మ(ముక్త్యాల రాణి) కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పటిలోనే నియోజకవర్గ చరిత్రలో భార్యాభర్తలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత జగ్గయ్యపేటకు దక్కింది. -
పోలీసులకు నాన్‌బెయిలబుల్ వారంట్
సాక్షి, జగ్గయ్యపేట: జగ్గయ్యపేట సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్‌కు స్థానిక కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. సాంబశివరావు అనే వ్యక్తిని నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని వీరిపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు సీఐ లచ్చునాయక్, ఎస్సై ప్రియకుమార్, కానిస్టేబుల్ హరిబాబుకు ఈ వారంట్ జారీ అయింది. సమన్లు జారీ చేసినా కోర్టుకు హాజరుకాకపోవడంతో వీరికి న్యాయమూర్తి నాన్‌బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేశారు. -
న్యాయమే గెలిచింది: సామినేని
సాక్షి, కృష్ణా: జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో న్యాయమే గెలిచిందని వైఎస్ఆర్సీపీ నేత సామినేని ఉదయబాను అన్నారు. ఎన్నికలను వాయిదా వేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీ చాలా కుట్రలు చేసిందని తెలిపారు. తమ పార్టీ సభ్యులను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ కొత్త డ్రామాలకు తెరలేపిందన్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్ ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శనివారం ఉదయం ఇంటూరి రాజగోపాల్‌లో మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. -
జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ గా రాజగోపాల్
-
జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ గా రాజగోపాల్
సాక్షి, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్ ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శనివారం ఉదయం ఇంటూరి రాజగోపాల్‌లో మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 27 మంది కౌన్సిలర్లలో వైఎస్ఆర్సీపీకి 16, టీడీపీకి 10, ఇతరులు ఒకటి ఉన్నారు. చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. అయితే ఎన్నిక వాయిదాకు ససేమిరా అనడంతో టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కోరం ఉండటంతో ఇంటూరి రాజగోపాల్ ప్రమాణం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యంతో ఛైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడిన విషయం తెలిసిందే. ఓ వైపు ప్రలోభాలు, మరోవైపు బెదిరింపులకు టీడీపీ పాల్పడినా...వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. మున్సిపల్ ఛైర్మన్‌గా రాజగోపాల్ ప్రమాణ స్వీకారం -
జగ్గయ్యపేటలో మరో కుట్రకు తెరలేపిన టీడీపీ
సాక్షి, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడటంతో టీడీపీ మరో కుట్రకు తెరలేపింది. ప్రలోభాలకు లొంగని వైఎస్ఆర్ సీపీ నేతల బెదిరింపులతో అదుపులోకి తెచ్చుకునేందుకు యత్నిస్తోంది. తమకు మద్దతు ఇవ్వకుంటే కేసులు తిరగదోడతామంటూ లీకులు ఇస్తోంది. పార్టీ ఫిరాయించి మద్దతిస్తే కేసులు మాఫీ చేస్తామని టీడీపీ సంకేతాలు పంపిస్తోంది. తాము చెప్పినట్లు వినకుంటే నలుగురు కౌన్సిరల్లను అరెస్ట్ చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక టీడీపీ నేతల హైడ్రామా నేపథ్యంలో జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎన్నిక వాయిదాపై రిటర్నింగ్ అధికారి హరీశ్ మాట్లాడుతూ.....‘కౌన్సిల్లో చోటుచేసుకున్న పరిణామాలను ఈసీ దృష్టికి తీసుకెళ్తాం. ఈ రోజు కోరం ఉన్నా ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేదు. సర్దిచెప్పినా కొంతమంది సభ్యులు వినిపించుకోలేదు. రేపు ఉదయం ఎన్నిక నిర్వహిస్తాం.’ అని తెలిపారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ నేత సామినేని ఉదయభాను మాట్లాడుతూ... మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారంలో కావాలనే టీడీపీ నేతలు రాద్ధాంతం చేశారని అన్నారు. టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారిపై ఒత్తిడి తెచ్చి ఎన్నిక వాయిదా వేయించారని ఆయన ఆరోపించారు. కోరం ఉన్నా వాయిదా వేయడంలోని మతలబు ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నెల రోజుల నుంచి ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తున్నా... తమ కౌన్సిలర్లు లొంగలేదన్నారు. అందుకే టీడీపీ నేతలు విధ్వంసం చేశారని మండిపడ్డారు. తమ పార్టీ కౌన్సిలర్లకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. కాగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ వైఎస్ఆర్ సీపీ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న సామినేని ఉదయభాను సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల అరాచకం.. వైఎస్ఆర్సీపీకి మెజార్టి సభ్యులు ఉండటంతో ఎలాగైనా మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకోవాలని టీడీపీ నేతలు అరాచకానికి ఒడిగట్టారు. అధికారులు, ప్రతిపక్ష సభ్యులపై దౌర్జన్యం ప్రదర్శిస్తూ మున్సిపల్ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. ఇద్దరు టీడీపీ మహిళ నాయకులను కౌన్సిలర్‌గా చూపిస్తూ మున్సిపల్ హాలులోకి టీడీపీ నేతలు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతల అసలు రంగు బయటపడటంతో కౌన్సిల్ హాలులోని టేబుళ్లను పడేశారు. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఎన్నికల మెమోరండం పేపర్లను చించిపారేశారు. అలాగే మున్సిపల్ ఆఫీసు ముందు పార్క్ చేసిన బైక్‌ను టీడీపీ నేతలు పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ తతంగం అంతా సీసీ ఫుటేజ్‌లో రికార్డవడంతో తమ కౌన్సిలర్లు ఇద్దరు మాయమయ్యారంటూ ఎన్నిక వాయిదా వేయాలని పట్టుపట్టారు. ఈ గందరగోళంలో అధికారులు చైర్మన్ ఎన్నిక కాసేపు వాయిదా వేసినప్పటికి వ్యవహారం సద్దుమణగపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఛైర్మన్ ఎన్నికల వాయిదా వేయడంపై వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలతో మా కౌన్సిలర్లను టీడీపీ నేతలు కొనాలని చూశారని...కుదరకపోవడంతో ఎన్నిక వాయిదా వేయించారని మండిపడ్డారు. రేపు ఉదయం 11 గంటలకు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. -
జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
సాక్షి, జగ్గయ్యపేట : తీవ్ర ఉద్రిక్తతల నడుమ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చెర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించేందుకు టీడీపీ నేతలు ఈరోజు ఉదయం నుంచి కుట్ర పన్నారు. పైపెచ్చు టీడీపీ కౌన్సిలర్లను వైఎస్ఆర్ సీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యల నేతృత్వంలో హైడ్రామాకు తెరలేపి చైర్మన్ ఎన్నిక హాల్లో బారికేడ్లను తొలగించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు. మెజార్టీ లేకపోవడంతో ఓడిపోతామనే భయంతో ఎన్నిక నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలు కౌన్సిల్ హాల్లోని టేబుళ్లను ఎత్తిపడేశారు. ఎన్నిక జరపాలంటూ వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన మెమోరాండంను చించివేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నించినా టీడీపీ నేతలు బరితెగించి విధ్వంసానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక రిటర్నింగ్ అధికారి...ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటన చేశారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు కార్యాలయం ఎదుట బైక్‌ను తగులబెట్టారు. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ నేతల తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మండిపడ్డారు. ప్రలోభాలతో తమ కౌన్సిలర్లను కొనాలని చూశారని, ఫలించకపోవడంతో ఎన్నిక వాయిదా వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మొత్తం 27 కౌన్సిలర్ స్థానాలకు వైఎస్ఆర్ సీపీ 16 కైవసం చేసుకోగా, టీడీపీ 10 స్థానాలకే పరిమితమైంది. -
జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రేపటికి ఎన్నిక వాయిదా
-
జగ్గయ్యపేటలో పట్టపగలు చోరీ
జగ్గయ్యపేట : ఇంటికి తాళం వేసి గుడికి వెళ్లి వచ్చేలోపు దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో ఉడాయించారు. ఈ ఘటన జగ్గయ్యపేట పట్టణంలోని సీతారాంపురంలో బుధవారం జరిగింది. కాలనిలోని జి. వెంకటేశ్వర్లు విజయడైరీలో పని చేస్తున్నాడు. ఈ రోజు బుధవారం కావడంతో ఇంటికీ తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బాబా గుడికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. దాంతో వెంకటేశ్వర్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. రూ. 4 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీ అయినట్లు బాధితుడు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు. నెలరోజుల వ్యవధిలో పట్టణంలో ఇలాంటి చోరీలు 10కి పైగా జరిగిన పోలీసులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మోసం చేసిన ప్రియుడికి రమణి గుణపాఠం
జగ్గయ్యపేట: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ప్రియుడిపై ఓ ప్రియురాలు కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని బంగారుపేటకు చెందిన చల్లా రాము కేసీపీ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన గుంజా గాయత్రి అలియాస్ రమణితో ఐదు నెలల క్రితం రాముకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో గత గురువారం(14వ తేదీ) రాముకు వివాహమైంది. విషయం తెలుసుకున్న రమణి సోమవారం రాముకు ఫోన్ చేసింది. పెళ్లి కానుక ఇస్తానని, పద్మావతి చెక్‌పోస్టు వద్దకు రమ్మని చెప్పింది. రాము అక్కడకు చేరుకున్న అనంతరం ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై జయంతిపురం గ్రామం మీదుగా వేదాద్రి అటవీ ప్రాంతంలోని నిర్జన ప్రదేశానికి వెళ్లారు. నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానంటూ రమణి చున్నితో రాము కళ్లకు గంతలు కట్టింది. అప్పటికే ఆమె వెంట తెచ్చుకున్న కత్తితో రాము మెడపై పొడిచి పరారైంది. ఈ పరిణామంతో కంగుతున్న రాము పేట ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకున్నాడు. అనంతరం దాడి విషయం కుటుంబ సభ్యులకు తెలుపగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. మంగళవారం తెల్లవారు జామున పోలీసులు రమణిని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, అందుకే కత్తితో పొడిచినట్లు ఆమె అంగీకరించడంతో సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాయపడ్డ రాము విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
ఊడిపోయిన బస్సు చక్రాలు, డ్రైవర్ అప్రమత్తం
-
ఊడిపోయిన బస్సు చక్రాలు, డ్రైవర్ అప్రమత్తం
విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేట వద్ద విద్యార్థులను తీసుకువెళ్తున్న చైతన్య టెక్నో స్కూలు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. దాంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై సెడన్ బ్రేక్ వేసి బస్సును నిలిపివేశాడు. 48 మంది విద్యార్థులను డ్రైవర్ బస్సులో నుంచి కిందకి దింపివేశాడు. అనంతరం ఆ ఘటనపై పోలీసులకు, స్కూలు యాజమాన్యానికి సమాచారం అందించాడు. స్కూల్ యాజమాన్యం, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. 48 మంది విద్యార్థులను మరో వాహనంలో స్కూలు కు తరలించారు. రహదారిపై నిలిచిన బస్సును స్థానికుల సహాయంతో పోలీసులు పక్కకు మళ్లించారు. -
కిరణ్ ది షోలే జైలర్ లాంటి పరిస్థితేనా?
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢీలా పడిపోయారా? సమైక్యవాదిగా ముద్ర పడితే ప్రజలు తండోపతండాలుగా వచ్చేస్తారని అనుకున్న కిరణ్ కుమార్ రెడ్డికి నిరాశ ఎదురైంది. మొన్నటి శ్రీకాకుళం రోడ్ షో అయినా, శుక్రవారం నాటి జగ్గయ్యపేట రోడ్ షో అయినా జనాన్ని ఆకర్షించలేకపోయింది. జగ్గయ్యపేటలో లగడపాటి రాజగోపాల్ కి చాలా ప్రభావం ఉంది. ఇది ఆయన ఎంపీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం. పైగా ఆయన మాజీ సీఎం స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకి ప్రధాన సలహాదారు కూడా. లగడపాటి ఎంత ప్రయత్నించినా జనం రోడ్ షో పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. జనాలు రాకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రసంగాన్ని హడావిడిగా ముగించేశారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయిల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఎంపీ సాయిప్రతాప్ లు కూడా తెలుగుదేశం వైపు పక్కచూపులు చూస్తున్నారు. వీరిద్దరూ కిరణ్ పార్టీకి ఉపాధ్యక్షులు. షోలేలో జైలర్ అన్నట్టు 'సగం మంది కుడివైపు, సగం మంది ఎడమ వైపు, మిగిలినవారు నా వెంట రండి' అన్నట్టుంది కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి!