
సాక్షి, గన్నవరం : నిన్న కంచికచర్ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు పట్టుబడిన ఘటన మరకవ ముందే... ప్రయివేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తప్పతాగి బస్సులు నడుపుతూ ప్రయాణికుల జీవితాలతో ఆటలాడుతున్నారంటూ పోలీసులు తనిఖీలు ముమ్మురం చేసినా డ్రైవర్లకు ఏమాత్రం పట్టడం లేదు. నిన్న రాత్రి కృష్ణాజిల్లా పొట్టిపాడు టోల్‌గేట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వరుణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తాగి వాహనం నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. గుంటూరు నుంచి విశాఖ వెళుతున్న ఈ బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటున్న యాజమన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు బస్సుకి వేరే డ్రైవర్‌ను ఇచ్చి పంపించేశారు.
Comments
Please login to add a commentAdd a comment