pottipadu
-
మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం
సాక్షి, గన్నవరం : నిన్న కంచికచర్ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు పట్టుబడిన ఘటన మరకవ ముందే... ప్రయివేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తప్పతాగి బస్సులు నడుపుతూ ప్రయాణికుల జీవితాలతో ఆటలాడుతున్నారంటూ పోలీసులు తనిఖీలు ముమ్మురం చేసినా డ్రైవర్లకు ఏమాత్రం పట్టడం లేదు. నిన్న రాత్రి కృష్ణాజిల్లా పొట్టిపాడు టోల్గేట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వరుణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తాగి వాహనం నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. గుంటూరు నుంచి విశాఖ వెళుతున్న ఈ బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటున్న యాజమన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు బస్సుకి వేరే డ్రైవర్‌ను ఇచ్చి పంపించేశారు. -
హంద్రీ-నీవా పనులు అడ్డుకున్న రైతులు
వజ్రకరూరు: మండల పరి«ధిలోని పొట్టిపాడు గ్రామ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న హంద్రీ-నీవా కాలువ వెడల్పు పనులను పలువురు రైతులు అడ్డుకున్నారు. కాలువ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతుల పొలాల్లో హంద్రీ-నీవామట్టి పడటంతో రైతులు పనులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న హంద్రీ-నీవా డీఈలు జగన్మోహన్రెడ్డి, కిరణ్ తదితరులు అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. అనంతరం పరిసరప్రాంతంలో అధికారులు సర్వేకూడా చేయించారు. ఈ సందర్భంగా రైతులు రవికుమార్, ముత్యాలయ్య, నరసింహారెడ్డి, అంజినయ్య, రుద్రప్ప, తిమ్మప్ప, కరిబసి, సుంకన్న, లింగన్న తదితరులు అధికారులతో మాట్లాడుతూ కాలువ వెడల్పులో భాగంగా జేసీబీలతో మట్టిని తీసి వేస్తుండగా అది పక్కన ఉన్న పొలాల్లోకి పడుతోందన్నారు. పొలాల్లోకి మట్టితో పాటు పెద్దపెద్ద రాళ్లు కూడా పడుతుండటంతో పంటసాగుకు అడ్డంకిగా మారాయన్నారు. దీనిపై డీఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగుచర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడండి : ఎమ్మెల్యే విశ్వ ఆదేశం రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అధికారులకు ఆదేశించారు. పొలాల్లోకి మట్టి పడిన విషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి సంబంధిత అ«ధికారులతో ఫోన్లో మాట్లాడి రైతులకు ఇబ్బందులు చూడాలని ఆదేశించారు. -
నేడు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జలజాగరణ
అనంతపురం: వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నేటి నుంచి రెండురోజులపాటు జలజాగరణ కార్యక్రమం జరుగనుంది. ప్రభుత్వం మెడలు వంచైనా సరే హంద్రీనీవా పథకం ద్వారా చెరువులను నింపడంతో పాటు మొదటి దశ ప్రతిపాదిత అయకట్టుకు సాగునీటిని పోరాడి తెచ్చుకుందాం అని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. జలజాగరణ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులతోపాటు జిల్లా నాయకులు హాజరు కానున్నారు. జలజాగరణకు నియోజకవర్గంలోని అన్ని మండలాలతోపాటు జిల్లాలోని వివిధ మండలాలనుంచి రైతులు తరలిరానున్నారు. శుక్రవారం సాయంత్రం వైఎస్సార్సీపీ నాయకులు జలజాగరణ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. జలజాగరణను విజయవంతం చేయాలని కోరుతూ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి వారంరోజులుగా నియోజకవర్గంలోని వజ్రకరూరు, ఉరవకొండ, విడపనకల్లు, బెళుగుప్ప, కూడేరు మండలాల్లో విసృతంగా పర్యటించి రైతులు, మహిళలు, యువకులు తదితరులను కలుసుకుని జలజాగరణకు సంఘీభావం తెలపాలని కోరారు. తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణకు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, పీఏబీఆర్ నుంచి ఉరవకొండ నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీరు అందించే పైపు లైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న డిమాండ్లతో జలజాగరణకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బెళుగుప్ప మండలంలో 26,500 ఎకరాలకు సాగునీటిని మొదటిదశలోనే అందించాల్సి ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో అనంత కరువును శాశ్వతంగా నివారించాలన్న లక్ష్యంతో చంద్రబాబునాయుడు ఐదు టీఎంసీలతో తాగునీటి పథకంగా రెండుసార్లు శంఖుస్థాపన చేసి వదిలేసిన హంద్రీనీవా పథకాన్ని 40 టీఎంసీలకు పెంచారన్నారు. రెండుసార్లు జీడిపల్లి రిజర్వాయర్‌కు నీటిని కూడా తీసువచ్చారని గుర్తుచేశారు.