సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. పెనుగంచిప్రోలులో ఆ నియోజకవర్గ టీడీపీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. బొల్లా వర్సెస్ శ్రీరామ్ రాజగోపాల్ వర్గాలుగా క్యాడర్ విడిపోయింది. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వ్యతిరేక వర్గం సమావేశమైంది.
పార్టీలో మాకు కనీసం మర్యాద ఇవ్వడం లేదంటూ బొల్లా రామకృష్ణ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం వర్గీయులుగా మా పై ముద్ర వేశారు. శ్రీరామ్ రాజగోపాల్‌కు అధిష్టానం టిక్కెట్ ప్రకటించిన తర్వాత ఇంత వరకూ మమ్మల్ని కలుపుకుపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘నేను టీడీపీ పార్టీ వ్యక్తినే కాదని శ్రీరామ్ రాజగోపాల్ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల గెలుపు కోసం లక్షలాది రూపాయలు వెచ్చించా. నేను అంత ఖర్చు చేశాను కాబట్టే టీడీపీ అభ్యర్ధులు గెలిచారు. టీడీపీ పార్టీ అందరిదీ...తాతయ్య సొత్తు కాదు. శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) నా పై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. లేకపోతే నా భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తా’’ అని బొల్లా రామకృష్ణ హెచ్చరించారు.
ఇదీ చదవండి: మోసాల బాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment