యాంకర్‌ హేమంత్‌ కారుకు ప్రమాదం | RJ Hemanth car hit to Buffalo | Sakshi
Sakshi News home page

యాంకర్‌ హేమంత్‌ కారుకు ప్రమాదం

Published Sun, May 19 2019 8:02 AM | Last Updated on Sun, May 19 2019 3:22 PM

RJ Hemanth car hit to Buffalo - Sakshi

సాక్షి, విజయవాడ : ప్రముఖ టీవీ యాంకర్‌, నటుడు, ఆర్జే హేమంత్‌ కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి అతడు సురక్షితంగా బయటపడ్డాడు. జగ్గయ్యపేట మండలం షేర్‌ మహమ్మద్‌ పేట క్రాస్‌ రోడ్డు వద్ద హేమంత్‌ కారు ఓ గేదెను ఢీ  కొట్టింది. దీంతో కారు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఆ సమయంలో అతడే కారు డ్రైవ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా విజయవాడలో ‘మహర్షి’ సక్సెస్‌ మీట్‌ కార్యక్రమం పూర్తి చేసుకుని హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement