
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 30మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారందరినీ పడినవారిని చికిత్స నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ...క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు విశాఖ, ఒడిశాకు చెందినవారుగా గుర్తించారు.
ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ... బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే దానిపై డ్రైవర్ దగ్గర కనీసం సమాచారం కూడా లేదన్నారు. ప్రయాణికుల పేర్లు, వివరాలు...కనీసం ఫోన్ నెంబర్లు కూడా లేవని అన్నారు. తమకు ప్రజల ప్రాణాలు ముఖ్యమని, నియమ నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment