జగ్గయ్యపేట (కృష్ణా), న్యూస్‌లైన్ : జాతీయ రహదారిపై తిరుమలగిరి ఆర్చి సమీపంలో ఆది వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. సేకరించిన వివరాల ప్రకారం..
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
Oct 7 2013 4:10 AM | Updated on Aug 30 2018 3:56 PM
జగ్గయ్యపేట (కృష్ణా), న్యూస్‌లైన్ : జాతీయ రహదారిపై తిరుమలగిరి ఆర్చి సమీపంలో ఆది వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. సేకరించిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తుమ్మపూడికి చెందిన నర్రా రవి (35), వెంకటేశ్వరరావు స్నేహితులు. వీరిద్దరూ కలిసి జగ్గయ్యపేటలో ఉన్న మరో స్నేహితుడిని చూసేందుకు మోటార్‌సైకిల్‌పై వచ్చారు. స్వగ్రామం తిరిగి వెళ్తుండగా తిరుమలగిరి ఆర్చి సమీపంలో విజయవాడ వైపు వస్తున్న గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రవి అక్కడిక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావును 108లో విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. రవి మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు మృతదేహాన్ని విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై చిల్లకల్లు ఎస్‌ఐ అబ్దుల్‌నబి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement