
సాక్షి, విజయవాడ: అగ్నిప్రమాద సంఘటనలో మృత్యువు అంచు వరకూ వెళ్లి ప్రాణాలతో బయటపడిన కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఓ బాధితుడు ఇంకా తేరుకోలేదు. ప్రమాదం నుంచి బయటపడేందుకు తాము పడ్డ బాధ భగవంతుడికే తెలుసునని సీహెచ్ పవన్‌సాయి కిషన్ తెలిపారు. తాను ప్రాణాలతో ఉన్నానంటే ఫైర్, పోలీసు సిబ్బంది చలువేనని అతడు పేర్కొన్నారు. ‘స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో నేనొక బాధితుడిని. నా రూమ్ నెంబర్ 304. ఆ సమయంలో నేనే చాలా ఇబ్బంది పడ్డాను. ఎటువెళ్లాలో అర్థం కాలేదు. దట్టమైన పొగ నల్లగా కమ్ముకుంది. అంతట మంటలు వ్యాపించాయి. (విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం)
ఎటువెళ్లాలో తెలియని ప్రాణాపాయ స్థితిలో కిటికీలు పగుల గొట్టుకుని కారిడార్‌లోకి వచ్చి కాపాడండి అంటూ అరిచాను. తేరుకుని పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాను. వారు తక్షణమే స్పందించి కాపాడారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం. మా బాధ ఎంతో వర్ణనాతీతం. ఎంతో ఇబ్బంది పడ్డాం. మేం పడ్డ బాధ భగవంతుడికి తెలియాలి. కనీస సౌకర్యాలు లేని స్వర్ణా ప్యాలెస్‌ను ఏ విధంగా కోవిడ్ సెంటర్‌కు ఇచ్చారు. రమేష్ హాస్పిటల్ వారు తగు వైద్య సౌకర్యం కల్పించాలి.’ అని డిమాండ్ చేశారు. (అగ్నిప్రమాదంలో సామినేని సన్నిహితుడు మృతి)
Comments
Please login to add a commentAdd a comment