
వాసిరెడ్డి రామగోపాలకృష్ణమహేశ్వర ప్రసాద్, రాజ్యలక్ష్మమ్మ
సాక్షి, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట నియోజకవర్గంలో భార్యభర్తలు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. వారే మండలంలోని ముక్త్యాల గ్రామానికి చెందిన ముక్త్యాల రాజా, రాణి. 1972 ఎన్నికల్లో వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ (ముక్త్యాల రాజా) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేపాల బుచ్చిరామయ్య శ్రేష్ఠిపై గెలుపొందారు. 1974లో ఆయన మరణానంతరం భార్య వాసిరెడ్డి రాజ్యలక్ష్మమ్మ(ముక్త్యాల రాణి) కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పటిలోనే నియోజకవర్గ చరిత్రలో భార్యాభర్తలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత జగ్గయ్యపేటకు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment