
దర్శకుడు శివ సోదరుడు, పాపులర్ నటుడు బాలా ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. ఎలిజబెత్ ఉదయన్ అనే వైద్యురాలిని సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఓనం పండుగనాటి నుంచే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రూమర్లకు ఫుల్‌స్టాప్ పెడ్తూ తన భార్యను అభిమానులకు పరిచయం చేశాడీ నటుడు. రిసెప్షన్‌లో తన భార్యతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా బాలా 2010లో ప్లేబ్యాక్ సింగర్ అమృత సురేశ్‌ను పెళ్లాడాడు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2019లో విడిపోయారు. వీరికి అవంతిక అనే కూతురు కూడా ఉంది. ఇక బాలా సినిమాల విషయానికి వస్తే అతడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'అన్నాత్తే' చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment