
రమేష్ (ఫైల్)
జవహర్‌నగర్: ఓ యువతిని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న ఆర్మీ ఉద్యోగిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ భిక్షపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక మదర్ థెరిస్సా కాలనీకి చెందిన సుర్భమ్ రమేష్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి భార్య, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టిన అతను తనను రెండో పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఓ యువతి జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడు రమేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.