![Buzz Created That Suma Gifts Diamond Necklace To Singer Sunitha - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/11/suma-gift.jpg.webp?itok=uaB6pug_)
సాక్షి, హైదరాబాద్: తనకు సంప్రదాయాలు ఇష్టం, పెద్దలంటే గౌరవం అంటూ తరచు చెప్పుకునే ప్రముఖ గాయని సునీత తన పెళ్లితో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ వేళలో నీవు అంటూ తెలుగు సినీ నేపథ్య గాయనిగా అడుగుపెట్టిన ఆమె తన మృదు మధురమైన గానంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ ఎందరో నటీమణులకు గాత్ర దానం చేసిన మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నేను నేటి మహళను అని చాటి చెప్పారు. (ఈ హ్యాపీనెస్ ఏమిటి? ఎట్లా ఇట్లా అయితే?: కత్తి మహేష్ )
వ్యాపార వేత్త రామ్ వీరపనేనితో తనకెంతో ఇష్ట దైవం శ్రీరాముని సన్నిధిలో(శంషాబాద్ సమీపంలో అమ్మపల్లి సీతారామ చంద్రస్వామి ఆలయంలో) జనవరి 9న సరికొత్త జీవితానికి ఏడడుగులు వేశారు. ఈ సందర్భంగా సునీత, రామ్‌దంపతులకు అనేక ప్రముఖులు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర‍్బంగా సునీతకు అత్యంత ఆత్మీయులైన ప్రముఖ యాంకర్లు ఝాన్సీ, సుమ సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే యాంకర్ సుమ సునీతకు సుమ ఓ సర్‌ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఖరీదైన వజ్రాల నెక్లెస్‌ను తన ప్రియమైన ప్రాణ స్నేహితురాలికి సుమ కానుకగా ఇచ్చినట్లు సోషల్‌మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. (ఘనంగా ప్రముఖ సింగర్ సునీత వివాహ వేడుక )
Comments
Please login to add a commentAdd a comment