భార్యకు ‘కన్యాదానం’ చేయనున్న భర్త! | Man Files For Divorce to Allow His Wife to Marry Her Boyfriend In Bhopal | Sakshi
Sakshi News home page

భార్యకు ‘కన్యాదానం’ చేయనున్న భర్త!

Published Tue, Nov 26 2019 3:29 PM | Last Updated on Tue, Nov 26 2019 3:52 PM

Man Files For Divorce to Allow His Wife to Marry Her Boyfriend In Bhopal - Sakshi

మీకు హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో ఐశ్వర్య రాయ్, అజయ్ దేవ్‌గణ్, సల్మాన్ ఖాన్‌లు నటించారు. అందులో మొదట సల్మాన్, ఐశ్వర్యలు ప్రేమించుకుంటారు. కానీ, ఐశ్వర్య తండ్రి సల్మాన్‌తో కాకుండా.. అజయ్ దేవ్‌గణ్‌తో వివాహం జరిపిస్తాడు. పెళ్లి తర్వాత సల్మాన్ గురించి తెలుసుకున్న అజయ్.. ఐశ్వర్యను సల్మాన్‌కిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ, తన సంతోషాన్నే కోరుకుంటున్న భర్త ప్రేమను అర్థం చేసుకొని సల్మాన్‌ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకుండా భర్త అజయ్‌తోనే ఉంటుంది. ఇదంతా రీల్ స్టోరీ. 1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులో వచ్చిన కన్యాదానం సినిమాలో కూడా దాదాపు ఇదే తరహా లవ్‌ స్టోరీ రిపీట్‌ అవుతుంది. శ్రీకాంత్‌-రచనలకు పెళ్లైతే, రచనను ప్రేమించిన ఉపేంద్రకు ఇచ్చి వివాహం చేస్తాడు శ్రీకాంత్‌.. ఈ సినిమాల గురిం‍చి ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? ఎందుకంటే సరిగ్గా ఇలాంటి కథే నిజజీవితంలో జరిగింది కాబట్టి.

భోపాల్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మహేష్‌తో..ఫ్యాషన్‌ డిజైనర్‌ సంగీతకి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇప్పుడీ దంపతులు విడాకులు కావాలంటూ ఫ్యామిలీ కోర్టును సంప్రదించారు. విడాకులు ఎందుకో తెలుసా.. తన భార్య సంగీతను ఆమె ప్రేమించిన వ్యక్తితో వివాహం చేయాలని మహేష్ అనుకోవడమే దీనికి కారణం. పెళ్లికి ముందు సంగీత ఒక వ్యక్తిని ప్రేమించింది. వారి ప్రేమకు ఆమె తండ్రి ఒప్పుకోలేదు. అందుకే సంగీతను వెంటనే మహేష్‌కిచ్చి పెళ్లి చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సంగీతకు ఒక విషయం తెలిసింది. ఆమె ప్రేమించిన వ్యక్తి.. ఆమె మీద ఉన్న ప్రేమతో ఇప్పటికీ ఎవరినీ వివాహం చేసుకోలేదని.

అది తెలిసిన సంగీత.. తన భర్తకు విడాకులిచ్చి.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. దీనికి మొదట మహేశ్‌ అంగీకరించకపోయినా.. తన భార్య సంతోషం కోసం ఒప్పుకున్నాడు. అయితే ఇద్దరు పిల్లల సంరక్షణను తనే చూసుకుంటానని చెప్పాడు. దీనికి భార్య సంగీత కూడా అంగీకరించింది. అంతేకాకుండా సంగీతకు ఎప్పుడు పిల్లల్ని చూడాలని అనిపించినా వెంటనే ఇంటికి వచ్చి చూడొచ్చని కూడా చెప్పాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. అయితే ఇరువురి అంగీకారం ఉ‍న్నందున కోర్టు.. వీరికి విడాకులు మంజూరు చేస్తుందని వారి తరపు కౌన్సిలర్ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement