kanyadaan
-
ఆడపిల్ల తండ్రి అంటే ఏమిటో? తెలుసా!..
ఆదికావ్యమైన మన రామాయణాన్ని ఆదర్శ జీవనానికి ప్రమాణంగా భావిస్తాం. అందులోని పాత్రలు.. ఓ వ్యక్తి బంధాలకు ఎలాంటి విలువ ఇవ్వాలి, ఏవిధంగా నడుచుకోవాలి, కుటుంబాన్ని ఎలా చక్క పెట్టాలో చెబుతాయి. నిజానికి దాన్ని ఓ కథలా వినేస్తాం గానీ దాన్ని అనుసరించే యత్నం గానీ కనీసం వాటిని గుర్తుపెట్టుకుని అనర్థదాయకమైన పనుల చేయకుండా మసులుకోవడం గానీ చేయం. ఈనాడు ఆడిపిల్లల కోసం ఎన్ని చట్టాలు వచ్చిన ఇంకా చిన్న చూపే, అడుగడుగున వివక్షత. అందులోనూ ఆడపిల్ల తండ్రికి అస్సలు విలువే ఉండదు. ఇప్పటికి ఆడపిల్ల పుట్టిందంటే చంపేసే తల్లిదండ్రులు ఉంటున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. మరొకందరూ ప్రబుద్దులు ఇద్దరు ఆడపిల్లల కంటే చాలు.. భార్యని పిల్లలను వదిలేసి పరారవ్వడం లేదా అదనంగా కట్నం తీసుకురావాలని డిమాండ్ చేయడం వంటి ఉదంతాలు చూస్తున్నాం. గానీ మన రామాయాణ గాథలో ఆడపిల్ల తండ్రి గొప్పతనం, అతని ప్రాముఖ్యత గురించి దశరథ మహారాజు ఎంత చక్కగానో విపులీకరించాడు. అందులో సీతరాముల కళ్యాణ సర్గ చదివితే ..మన కళ్లముందు ఒక్కసారిగా సీతారాముల కళ్యాణం కళ్లముందు మెదులుతుంది. గానీ ఆ వివాహతంతులో వైవాహిక జీవితం, ఆడపిల్లవారు గొప్పతనం గురించి చక్కగా వివరించాడు ఆదికవి వాల్మీకి. ఇక ఆ సర్గలో..దశరథ మహారజు తన నలుగురు కొడుకులను తీసుకుని వివాహ శోభాయాత్రకు కదిలి వస్తూ..జనకమహారాజు ద్వారం వద్ద వేచి ఉన్నాడు. అప్పుడు జనకమహారాజు వారి వివాహా శోభాయాత్రకు సాధరపూర్వకంగా స్వాగతం పలుకుతుండగా.. వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి జనకమహారాజుకి పాదాభివందనం చేశాడు. అప్పుడూ జనకమహారాజు దశరథ మహారాజు భుజం తట్టి పైకిలేపి సంతోషంతో కౌగలించుకున్నాడు. ఈ ఘట్టం ఆడపిల్ల తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం గురించి అద్భుతంగా తెలియజేసింది. ఇక ఆ ఘట్టంలో.. రాజా మీరు పెద్దవారు, పైగా వరుని పక్షం వారు, ఇలా నాకు పాదాభివందనం చేయడం ఏమిటి? గంగానది వెనక్కి ప్రవహించడం లేదు కదా! అంటూ సంభ్రమాశ్చర్యాలతో ప్రశ్నిస్తాడు జనకమహారాజు. దీంతో దశరథుడు మహారాజా మీరు దాతలు..కన్యను దానం చేస్తున్నారు. మా అబ్బాయికి పిల్లనివ్వమని మీతో సంబంధం కోరుకుంటున్న యాచకులం. మీతో సంబంధం ద్వారా నా కొడుక్కి కన్యను పొందాలనుకుంటున్నా!.. గనుక ఇప్పుడూ ఎవరూ గొప్పో చెప్పండి అని అడుగుతాడు దశరథ మహారాజు. ఆ మాటలకు ఒక్కసారిగా జనకమహారాజు కళ్లల్లోంచి ఆనందబాష్పాలు వచ్చాయి. అంతేగాదు ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో..వాళ్ళు భాగ్యవంతులు. ప్రతీ కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు అని సగర్వంగా చెబుతాడు జనకమహారాజు. నేటి పెళ్లిళ్లలో జరగుతున్నది ఏంటి?.. ఇంకా వివాహం జరగకమునుపే ఇలా సంబంధం కుదుర్చుకున్నామో! లేదో ఇక ఆడపిల్లవారిపై యజామాయిషి మొదలైపోతుంది. పోనియిలే మగపెళ్లివారు కదా అలానే ఉంటారు కదా! అని సరిపెట్టుకుంటే.. ఇక వాళ్ల గొంతెమ్మ కోరికలకు హద్దు, అదుపు ఉండవు. అది వివాహామేనా అన్నట్లు ఉంటుంది ఆ తంతు. ఓపక్క తమకు మర్యాదలు తక్కువయ్యాయని, మా అబ్బాయికి ఇది పెట్టాలని, ఆడపడచు లాంఛనంగా అది కావాలంటూ అరుపులు కేకలు. వాస్తవానికి ఇవి మన సనాతన ధర్మంలో లేని ఆర్భాటాలు. ఆడపిల్ల తండ్రి అంటే.. తలవంచుకుని మగపెళ్లివారి మాటలు పడేవాడని అర్థం కాదు. కన్యను దానం చేస్తున్న దాత. ఆ వేదికపై హక్కు ఆయనదే. ఆ రోజు వేదికపై జరిగేదానికి అధికారం అయనదని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి, కన్యాదాత మీద పడి అరవడానికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది?. దానం ఇస్తున్నవాడిని ఇంకా.. ఇంకా.. కట్నాలు, కానుకలు, లాంఛనాలు అవీ ఇవీ అడగచ్చు అని ఎవరు చెప్పారు మీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా?!. కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే. పైగా వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న తన ఇంటి లక్ష్మిని పంపిస్తున్నాడు కన్యాదాత. కాబట్టి అతన్ని గౌరవించగలిగే మర్యాద మీ వద్ద లేకపోతే గమ్మని కూర్చొండి. అంతేగానీ అతడిని తిట్టడం, విస్తుక్కోవడం వంటివి చేసే హక్కు మీకు లేదు. వివాహ తంతులో సీతారాముల్లా ఉండండి! అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామ కళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో అందరికి అవగతమవుతుంది. మన సనాత ధర్మాన్ని గౌరవిస్తే ఇలాంటి దారుణాలకు దిగకండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఓ స్త్రీ ప్రమేయం లేకుండా మనుగడ సాగించగలమా! లేదా అన్నది ప్రశ్నించుకుని మసులుకోండి. (చదవండి: ఓ చిన్న రేకుల షెడ్‌కి..ఏకంగా లక్ష రూపాయాల కరెంట్ బిల్లు) -
ఆ రెండు లేకుండానే పెళ్లి: ఎందుకో చెప్పిన దియా
ముంబై: బాలీవుడ్ నటీ దియా మిర్జా ముంబై వ్యాపారవేత్త వైభవ్ రేఖీని ఈ నెల 15న పెళ్లాడిని సంగతి తెలిసిందే. అయితే పురోహితురాలి చేతిలో తన వివాహ వేడుకను జరుపుకుని నయా ట్రెండ్‌ను సెట్ చేశారామె. అంతేగాక తన పెళ్లిలో ముఖ్యమైన రెండు తంతులు లేకుండానే పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహా వేడుకల్లో జీలకర్ర బెల్లం, ఏడడుగులు, తలంబ్రాలు, తాళి, కన్యాదానం, అప్పగింతలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఇక కన్యాదానం, అప్పగింతలు అనేవి పెళ్లిలో ముఖ్యమైన భాగాలు కదా. అయితే దియా మాత్రం ఈ రెండు తంతులు లేకుండానే తన వివాహం జరుపుకున్నారు. కావాలనే తన పెళ్లిలో అవి లేకుండా చూసుకున్నారు. అయితే ఈ విషయం తెలియక చాలా మంది పెళ్లిలో అవి లేవెంటని అయోమయంలో పడ్డారంట. తాజాగా దియా దీనిపై స్పందిస్తూ తన పెళ్లిలో అవి లేకపోవడానికి గల కారణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మహిళలు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం. పుట్టుక కొత్తది. అందుకే పాత విషయాలను కొత్తగా నిర్వచించే ప్రయత్నం చేశాను. పెళ్లిలో అతి ముఖ్యమైన రెండు తంతులు కన్యాదానం, అప్పగింతలు. అవి రెండు నా పెళ్లిలో లేవు. నా దృష్టిలో ఆడ మగ ఇద్దరూ సమానమే. వారి మధ్య తేడాను నిర్వచించే ఈ రెండు తంతులను నా పెళ్లిలో వద్దనుకున్నాను. మార్పు అనేది మన ఎంపికతోనే మొదలవుతుంది’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఇక పర్యావరణ వేత్త అయిన దియా తన పెళ్లిలో అస్సలు ప్లాస్టిక్ వాడలేదని వెల్లడించారు. 19 ఏళ్లుగా రోజూ పొద్దున్నే తాను సమయం గడిపే తోటలోనే నిరాడంబరంగా పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) అయితే ఈ పెళ్లిలో ప్లాస్టిక్ అస్సలు వాడలేదని, పర్యావరణ హితంగానే తన పెళ్లి జరిగిందన్నారు. సహజసిద్ధమైన జీవవిచ్ఛిన్న సామగ్రినే అలంకరణకు వాడామని స్పష్టం చేశారు. ఇక మహిళా పూజారి తమ పెళ్లి జరిపించించడంపై మాట్లాడుతూ.. తన పెళ్లిలో ఇది మరోక సర్ప్రైజ్ అన్నారు. వేద సంప్రదాయం ప్రకారమే పురోహితురాలు తన వివాహ వేడుకను నిర్వహించిందని చెప్పారు. అయితే పెళ్లికి వెళ్లే ముందు వరకు ఓ మహిళ తన పెళ్లి చేయిస్తుందన్న విషయం తెలియదన్నారు. ఆమె తన చిన్ననాటి స్నేహితురాలైన అనన్య ఏర్పాటు చేశారని, ఆమె ఎవరో కాదు అనన్య వాల్ల ఆంటీ షీలా అని చెప్పారు. తన పెళ్లికీ ఆమెను పంపించి అనన్య మంచి కానుక ఇచ్చిందన్నారు. అంతకు మించి గొప్ప గౌరవం ఏముంటుందంటూ దియా ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: రెండో వివాహం.. ట్రెండ్ సెట్ చేసిన నటి) (ప్రియుడితో నటి రెండో పెళ్లి.. ఫోటోలు వైరల్) -
అనాథకు హోం మినిస్టర్ ‘కన్యాదానం’
ముంబై: తెలుగు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది ఆడపిల్ల అనాథగా పుట్టకూడదు అని. ఆడపిల్ల అనే కాదు అసలు అనాథలుగా పుట్టాలని ఎవరు కోరుకోరు. ఎంత పేదరికం అనుభవించినా సరే తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి బతకాలని కోరుకుంటారు. మరి ముఖ్యంగా వివాహ సమయంలో నా అనే వారు వెంటలేకపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ క్రమంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఓ వికలాంగ అనాథ యువతి వివాహ వేడుకకు హాజరు కావడమే కాక సదరు యువతి తరఫున కన్యాదాన కార్యక్రమం జరిపించారు. దాంతో అనిల్ దంపతులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు జనాలు. మీరు చేసిన పని ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది అంటూ అభినందిస్తున్నారు. అలానే వరుడి తరఫున తండ్రి బాద్యతలు నిర్వహించిన నాగ్‌పూర్ కలెక్టర్ దంపతులపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. (చదవండి: పేగుబంధం 'అన్వేషణ') వివరాలు.. ఆదివారం నాగ్‌పూర్ జిల్లాలోని ఒక అనాథ ఆశ్రమంలో చెవిటి యువతి(23) వివాహం మరో అనాథ యువకుడి(27)తో జరిగింది. ఈ వేడుకకు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ దంపతులు హాజరయ్యారు. ఈ క్రమంలో వధువు తరఫున కన్యాదానం చేశారు హోం మంత్రి దంపతులు. ఇక నాగ్‌పూర్ కలెక్టర్ రవీంద్ర ఠాక్రే వరుడి తరఫున తండ్రి బాధ్యతలు నిర్వహించారు. ఓ ప్రజాప్రతినిధి, ప్రభుత్వ అధికారి పెళ్లి పెద్దలుగా వ్యవహరించి వివాహ తంతు జరిపించడంతో ఆ యువ జంట ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరో విశేషం ఏంటంటే ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, అధికారులతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరయ్యి.. నూతన వధువరులను ఆశీర్వదించారు. ఇక సదరు యువతిని 23 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు నాగ్‌పూర్‌లోని రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్లారు. ఈ నేపథ్యంలో అమరావతి జిల్లాలోని ఓ అనాథాశ్రమం నిర్వహాకులు ఆమెని తీసుకెళ్లి పెంచి పెద్ద చేశారు. ఇక వరుడుని కూడా రెండేళ్ల వయసులో థానే జిల్లాలోని డొంబివాలి టౌన్షిప్లో వదిలేసి వేళ్లారు అతడి తల్లిదండ్రులు. -
భార్యకు ‘కన్యాదానం’ చేయనున్న భర్త!
మీకు హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో ఐశ్వర్య రాయ్, అజయ్ దేవ్‌గణ్, సల్మాన్ ఖాన్లు నటించారు. అందులో మొదట సల్మాన్, ఐశ్వర్యలు ప్రేమించుకుంటారు. కానీ, ఐశ్వర్య తండ్రి సల్మాన్‌తో కాకుండా.. అజయ్ దేవ్‌గణ్‌తో వివాహం జరిపిస్తాడు. పెళ్లి తర్వాత సల్మాన్ గురించి తెలుసుకున్న అజయ్.. ఐశ్వర్యను సల్మాన్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ, తన సంతోషాన్నే కోరుకుంటున్న భర్త ప్రేమను అర్థం చేసుకొని సల్మాన్‌ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకుండా భర్త అజయ్‌తోనే ఉంటుంది. ఇదంతా రీల్ స్టోరీ. 1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో వచ్చిన కన్యాదానం సినిమాలో కూడా దాదాపు ఇదే తరహా లవ్ స్టోరీ రిపీట్ అవుతుంది. శ్రీకాంత్-రచనలకు పెళ్లైతే, రచనను ప్రేమించిన ఉపేంద్రకు ఇచ్చి వివాహం చేస్తాడు శ్రీకాంత్.. ఈ సినిమాల గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? ఎందుకంటే సరిగ్గా ఇలాంటి కథే నిజజీవితంలో జరిగింది కాబట్టి. భోపాల్‌కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహేష్‌తో..ఫ్యాషన్ డిజైనర్ సంగీతకి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇప్పుడీ దంపతులు విడాకులు కావాలంటూ ఫ్యామిలీ కోర్టును సంప్రదించారు. విడాకులు ఎందుకో తెలుసా.. తన భార్య సంగీతను ఆమె ప్రేమించిన వ్యక్తితో వివాహం చేయాలని మహేష్ అనుకోవడమే దీనికి కారణం. పెళ్లికి ముందు సంగీత ఒక వ్యక్తిని ప్రేమించింది. వారి ప్రేమకు ఆమె తండ్రి ఒప్పుకోలేదు. అందుకే సంగీతను వెంటనే మహేష్‌కిచ్చి పెళ్లి చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సంగీతకు ఒక విషయం తెలిసింది. ఆమె ప్రేమించిన వ్యక్తి.. ఆమె మీద ఉన్న ప్రేమతో ఇప్పటికీ ఎవరినీ వివాహం చేసుకోలేదని. అది తెలిసిన సంగీత.. తన భర్తకు విడాకులిచ్చి.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. దీనికి మొదట మహేశ్ అంగీకరించకపోయినా.. తన భార్య సంతోషం కోసం ఒప్పుకున్నాడు. అయితే ఇద్దరు పిల్లల సంరక్షణను తనే చూసుకుంటానని చెప్పాడు. దీనికి భార్య సంగీత కూడా అంగీకరించింది. అంతేకాకుండా సంగీతకు ఎప్పుడు పిల్లల్ని చూడాలని అనిపించినా వెంటనే ఇంటికి వచ్చి చూడొచ్చని కూడా చెప్పాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. అయితే ఇరువురి అంగీకారం ఉన్నందున కోర్టు.. వీరికి విడాకులు మంజూరు చేస్తుందని వారి తరపు కౌన్సిలర్ తెలిపారు. -
కన్యాదానం చేయనన్న తండ్రి..!
పెళ్లి అనగానే.. కన్యాదానం, అప్పగింతలు, కన్నీళ్లు. ఎక్కడైనా ఇవే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే తండ్రి మాత్రం చస్తే కన్యాదానం చేయనన్నాడు. ఇది చూసి వెంటనే ఎంత కసాయి తండ్రి అని మాత్రం అనుకోకండి. కన్యాదానం చేయననడానికి ఆ తండ్రి చెప్పిన కారణం వింటే మీరు కూడా అతన్ని మెచ్చుకుంటారు. అస్మిత అనే నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ పెళ్లి తంతు విశేషాలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. ‘ఈ పెళ్లికి నేను కూడా హాజరయ్యాను. మహిళా పురోహితులు ఈ వేడుకను జరిపారు. అంతేకాక పెళ్లి కూతుర్ని తల్లి పేరుతో పరిచయం చేశారు. ఆ తర్వాతే తండ్రి పేరు చెప్పారు. అన్నింటికంటే విశేషం ఏంటంటే.. పెళ్లి కుమార్తె తండ్రి తాను కన్యాదానం చేయనన్నాడు. ‘నా కుమార్తె ఆస్తి కాదు దానం చేయడానికి’ అని అతను చెప్పిన మాటలు నన్ను చాలా ఆలోచింపజేశాయి’ అంటూ ట్వీట్ చేశారు అస్మిత. ఈ పోస్ట్‌ను ఇప్పటికే 2300 మంది లైక్ చేయగా.. ‘మీ ప్రగతిశీల భావజాలానికి హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. I'm at a wedding with female pandits. They introduce the bride as the daughter of (mom first!!!). The bride's dad gave a speech saying he wasn't doing kanyadaan because his daughter wasn't property to give away. 🔥🔥🔥 I'm so impressed. pic.twitter.com/JXqHdbap9D — Asmita (@asmitaghosh18) February 4, 2019 -
కన్యాదానం... కాదు సమంజసం
వస్తువును దానం చేస్తారు... కన్యను దానం చేయడం ఏమిటి? స్త్రీ ప్రాణం లేని వస్తువా దానం చేయడానికి? దానం పొందిన వస్తువు మీద సర్వహక్కులు దానగ్రహీతకు ఉంటాయి. స్త్రీ మీద సర్వహక్కులు ఆమెను పెళ్లాడిన పురుషుడు కలిగి ఉన్నాడని చెప్పడానికి సంకేతంగా ఈ తంతును వివాహంలో పెట్టారా? పెళ్లిలో స్త్రీ, పురుషులు ఇరువురు సమానమే. పరస్పర సహకారంతో వారు ముందుకు సాగాలి. కాని మగవాడిని అధికంగా స్త్రీని అల్పంగా చేసే కన్యాదానం పద్ధతి సరికాదని అంటున్నారు కలకత్తాకు చెందిన పురోహితురాలు నందిని భౌమిక్. కలకత్తా నగరంలో నందిని భౌమిక్ పౌరోహిత్యం నిర్వహిస్తున్నారు. సాధారణంగా పౌరహిత్యం మగవారి చేతుల్లో ఉంటుంది. స్త్రీలు ఈ రంగంలో రాణించడం తక్కువ. కాని నందిని భౌమిక్ పట్టుదలగా ఈ రంగంలోకి వచ్చారు. వృత్తిరీత్యా జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో సంస్కృత శాఖ అధ్యాపకురాలుగా పని చేస్తున్న భౌమిక్ తనలాంటి భావాలు కలిగిన ఇద్దరు ముగ్గురు స్త్రీలతో కలిసి ఒక బృందంగా ఏర్పాటయ్యారు. రుమా రాయ్, సీమంతి బెనర్జీ, పైలమీ చక్రవర్తి... అనే ఈ ముగ్గురితో కలిసి నందిని నిర్వహించే పౌరహిత్య కార్యక్రమాలు ఫేమస్ అయ్యాయి. ఇటీవల ఈమె నిర్వహించిన ఒక వివాహం కూడా వార్తలకు ఎక్కింది. కలకత్తాకు చెందిన అన్వితా జనార్దన్, అర్కా భట్టాచార్య ఫిబ్రవరి 24న వివాహం చేసుకున్నారు. నందిని పౌరోహిత్యం వహించారు. వరుడు భట్టాచార్యకు నందిని బృందమంటే అపారమైన గౌరవం. వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు. తన పెళ్లి జరిపించమని కోరాడు. పెళ్లి జరిపిస్తున్న నందిని సంస్కృతంలో ఉన్న వివాహ మంత్రాలకు ఆంగ్ల, బెంగాలీ భాషలలో అర్థవివరణ ఇవ్వడం ఆహూతులను ఆకర్షించింది. అయితే ఈ పెళ్లిలో ‘కన్యాదానం’ తంతును తాను నిర్వహించబోవడం లేదని నందిని ప్రకటించి అందరినీ ఆలోచనలో పడేశారు. పురాతన హిందూ గ్రంథాలలో కన్యాదానం లేకుండానే వివాహ క్రతువు నడిచేదని ముఖ్యంగా ఋగ్వేదం ఈ విషయం రూఢీ పరిచిందని ఆమె తెలిపారు. స్త్రీ వస్తువు కాదని ఇంత ఆధునిక సమాజంలో ఆమెను దానంగా ఇవ్వడం, దానంగా తీసుకోవడం వెనుకబాటుతనానికి చిహ్నం అని చెప్పారు. వధువరులు నందిని మాటలకు సమ్మతించి కన్యాదానం తంతు లేకుండానే వివాహం చేసుకోవడం వార్తగా మారింది. స్త్రీలు పౌరహిత్యం చేయడం ఏమిటని కలకత్తాలో కొంతమంది నొసలు చిట్లించినా ఆడవారు పౌరోహిత్యం వహించడం దోషం కాదని మరికొందరు పండితులు సమర్థన తెలిపారు. మహిళల పౌరోహిత్యం గురించి వేదాలలో చాలా పెద్ద వేదాంత చర్చ జరిగిందని కూడా వారు తెలియచేశారు. మొత్తానికి నందిని బృందం స్త్రీల తరఫున ఆలోచిస్తూ స్త్రీలకు అపసవ్యమైన తంతులను పరిహరిస్తూ శుభకార్యాలు నిర్వర్తించడం అందరినీ ఆకర్షిస్తోంది. -
సల్మాన్ ఖాన్ కన్యాదానం!
బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ కన్యాదానం చేయబోతున్నాడు. వెండితెరపై కాదు నిజజీవితంలోనే అతడీ క్రతువు నిర్వహించబోతున్నాడు. ఆశర్చర్యమనిపించినా ఇది నిజం. పెళ్లికాని ఈ కండలవీరుడు కన్యాదానం ఎలా చేస్తాడని అనుకుంటున్నారా? నటుడు పులకిత్ సామ్రాట్ కు సల్మాన్ ఖాన్ కన్యాదానం చేయనున్నాడు. పులకిత్ పెళ్లాడబోయే అమ్మాయి శ్వేత రొహిరా- సల్మాన్ కు రాఖీ కట్టిన సోదరి. ప్రతి సంవత్సరం సల్మాన్ కు ఆమె రాఖీ కడుతుంది. కాగా, పులకిత్, శ్వేత వచ్చే ఏడాది గోవాలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే శ్వేత తండ్రి ఆమె చిన్నతనంలోనే మరణించారు. దీంతో కన్యాదానం చేసే బాధ్యతను సల్మాన్ ఖాన్ తీసుకున్నారు. సోదర ప్రేమంటే ఇదేనేమో!