పెళ్లి అనగానే.. కన్యాదానం, అప్పగింతలు, కన్నీళ్లు. ఎక్కడైనా ఇవే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే తండ్రి మాత్రం చస్తే కన్యాదానం చేయనన్నాడు. ఇది చూసి వెంటనే ఎంత కసాయి తండ్రి అని మాత్రం అనుకోకండి. కన్యాదానం చేయననడానికి ఆ తండ్రి చెప్పిన కారణం వింటే మీరు కూడా అతన్ని మెచ్చుకుంటారు. అస్మిత అనే నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఈ పెళ్లి తంతు విశేషాలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి.
‘ఈ పెళ్లికి నేను కూడా హాజరయ్యాను. మహిళా పురోహితులు ఈ వేడుకను జరిపారు. అంతేకాక పెళ్లి కూతుర్ని తల్లి పేరుతో పరిచయం చేశారు. ఆ తర్వాతే తండ్రి పేరు చెప్పారు. అన్నింటికంటే విశేషం ఏంటంటే.. పెళ్లి కుమార్తె తండ్రి తాను కన్యాదానం చేయనన్నాడు. ‘నా కుమార్తె ఆస్తి కాదు దానం చేయడానికి’ అని అతను చెప్పిన మాటలు నన్ను చాలా ఆలోచింపజేశాయి’ అంటూ ట్వీట్ చేశారు అస్మిత. ఈ పోస్ట్‌ను ఇప్పటికే 2300 మంది లైక్ చేయగా.. ‘మీ ప్రగతిశీల భావజాలానికి హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
I'm at a wedding with female pandits. They introduce the bride as the daughter of
— Asmita (@asmitaghosh18) February 4, 2019and (mom first!!!). The bride's dad gave a speech saying he wasn't doing kanyadaan because his daughter wasn't property to give away. 🔥🔥🔥 I'm so impressed. pic.twitter.com/JXqHdbap9D
Comments
Please login to add a commentAdd a comment