ముంబై: బాలీవుడ్ నటీ దియా మిర్జా ముంబై వ్యాపారవేత్త వైభవ్ రేఖీని ఈ నెల 15న పెళ్లాడిని సంగతి తెలిసిందే. అయితే పురోహితురాలి చేతిలో తన వివాహ వేడుకను జరుపుకుని నయా ట్రెండ్‌ను సెట్ చేశారామె. అంతేగాక తన పెళ్లిలో ముఖ్యమైన రెండు తంతులు లేకుండానే పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహా వేడుకల్లో జీలకర్ర బెల్లం, ఏడడుగులు, తలంబ్రాలు, తాళి, కన్యాదానం, అప్పగింతలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఇక కన్యాదానం, అప్పగింతలు అనేవి పెళ్లిలో ముఖ్యమైన భాగాలు కదా. అయితే దియా మాత్రం ఈ రెండు తంతులు లేకుండానే తన వివాహం జరుపుకున్నారు. కావాలనే తన పెళ్లిలో అవి లేకుండా చూసుకున్నారు. అయితే ఈ విషయం తెలియక చాలా మంది పెళ్లిలో అవి లేవెంటని అయోమయంలో పడ్డారంట.
తాజాగా దియా దీనిపై స్పందిస్తూ తన పెళ్లిలో అవి లేకపోవడానికి గల కారణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మహిళలు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం. పుట్టుక కొత్తది. అందుకే పాత విషయాలను కొత్తగా నిర్వచించే ప్రయత్నం చేశాను. పెళ్లిలో అతి ముఖ్యమైన రెండు తంతులు కన్యాదానం, అప్పగింతలు. అవి రెండు నా పెళ్లిలో లేవు. నా దృష్టిలో ఆడ మగ ఇద్దరూ సమానమే. వారి మధ్య తేడాను నిర్వచించే ఈ రెండు తంతులను నా పెళ్లిలో వద్దనుకున్నాను. మార్పు అనేది మన ఎంపికతోనే మొదలవుతుంది’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఇక పర్యావరణ వేత్త అయిన దియా తన పెళ్లిలో అస్సలు ప్లాస్టిక్ వాడలేదని వెల్లడించారు. 19 ఏళ్లుగా రోజూ పొద్దున్నే తాను సమయం గడిపే తోటలోనే నిరాడంబరంగా పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు.
అయితే ఈ పెళ్లిలో ప్లాస్టిక్ అస్సలు వాడలేదని, పర్యావరణ హితంగానే తన పెళ్లి జరిగిందన్నారు. సహజసిద్ధమైన జీవవిచ్ఛిన్న సామగ్రినే అలంకరణకు వాడామని స్పష్టం చేశారు. ఇక మహిళా పూజారి తమ పెళ్లి జరిపించించడంపై మాట్లాడుతూ.. తన పెళ్లిలో ఇది మరోక సర్‌ప్రైజ్ అన్నారు. వేద సంప్రదాయం ప్రకారమే పురోహితురాలు తన వివాహ వేడుకను నిర్వహించిందని చెప్పారు. అయితే పెళ్లికి వెళ్లే ముందు వరకు ఓ మహిళ తన పెళ్లి చేయిస్తుందన్న విషయం తెలియదన్నారు. ఆమె తన చిన్ననాటి స్నేహితురాలైన అనన్య ఏర్పాటు చేశారని, ఆమె ఎవరో కాదు అనన్య వాల్ల ఆంటీ షీలా అని చెప్పారు. తన పెళ్లికీ ఆమెను పంపించి అనన్య మంచి కానుక ఇచ్చిందన్నారు. అంతకు మించి గొప్ప గౌరవం ఏముంటుందంటూ దియా ఆనందం వ్యక్తం చేశారు.
(చదవండి: రెండో వివాహం.. ట్రెండ్ సెట్ చేసిన నటి)
(ప్రియుడితో నటి రెండో పెళ్లి.. ఫోటోలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment