కర్నూలు(సెంట్రల్): తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న తన భర్త రాకేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని సచివాలయంలో వెల్ఫేర్, ఎడ్యుకేషన్ కార్యదర్శిగా పని చేస్తున్న ఏ.గాయత్రి సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆమె కలెక్టర్ డాక్టర్ జి. సృజనకు వినతిపత్రం ఇచ్చారు.
ఈ అర్జీపై సత్వరంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓను కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం గాయత్రి కర్నూలు మండలం గార్గేయపురం సచివాలయంలో పనిచేస్తున్నారు. ఆమె గతంలో హాలహర్విలో పనిచేస్తున్న సమయంలో అక్కడే ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాకేష్‌బాబుతో వివాహమైంది. వీరికి ఒక పాప కూడా పుట్టింది. తరువాత రాకేష్‌బాబు లక్ష్మీ అనే మరో ఉద్యోగిని వివాహం చేసుకున్నారు. దీంతో ఆమె కర్నూలు త్రీటౌన్‌లో ఆరు నెలల కింద కేసు పెట్టారు. తరువాత ఆమె తన బిడ్డ పోషణపై హైకోర్టుకు కూడా వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment