Actress Surekha Vani Said She Wants to Have a Boyfriend - Sakshi
Sakshi News home page

Surekha Vani: అలాంటి బాయ్‌ఫ్రెండ్‌ కావాలంటున్న నటి సురేఖ వాణి

Published Tue, Aug 23 2022 8:28 PM | Last Updated on Tue, Aug 23 2022 9:04 PM

Actress Surekha Vani Said She Wants to Have a Boyfriend - Sakshi

టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సురేఖ వాణి. ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సురేఖవాణి సోషల్‌ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటోంది. ఇక కూతురు సుప్రీతాతో కలిసి నెట్టింట ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మోడ్రన్ డ్రస్సుల్లో కూతురితో పోటీపడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు ఆమె. ఈ క్రమంలో సురేఖ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

చదవండి: లైగర్‌ మూవీ ఫ్లాప్‌ అయితే? విలేకరి ప్రశ్నకు విజయ్‌ షాకింగ్‌ రియాక్షన్‌

ఇదిలా ఉంటే భర్త చనిపోవడంతో కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తోన్న సురేఖ రెండో వివాహంపై తరచూ ఆమెకు ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. అయితే తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఎప్పడూ చెప్పే సురేఖ ఈసారి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన ఆమె రెండో పెళ్లిపై స్పందించింది. ‘నాకు రెండో పెళ్లిపై పెద్దగా ఆసక్తిలేదు. కానీ నా కూతురు సుప్రీతా నన్ను మళ్లీ చేసుకోమంటుంది. ఇప్పుడైతే చేసుకునే ఆలోచన లేదు కానీ, భవిష్యత్తులో చేసుకుంటానేమో చూడాలి’ అని చెప్పిది.

చదవండి: నగరానికి దూరంగా చిరు బర్త్‌డే వేడుకలు, ఫొటోలు వైరల్‌

అలాగే మీకు నచ్చిన వ్యక్తి దొరికాడా? అని అడగ్గా.. ప్రస్తుతానికి ఎవరు లేరని సమాధానం ఇచ్చింది. కానీ తనకు బాయ్‌ఫ్రెండ్‌ కావాలనిపిస్తోందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.  అయితే అతను తనని బాగా అర్థం చేసుకునేవాడు కవాలని చెప్పింది. ‘మంచి హైట్‌, పర్సనాలిటి ఉన్న వ్యక్తి నాకు బాయ్‌ఫ్రెండ్‌గా కావాలి. లైట్‌గా గడ్డం ఉండాలి. అతనికి బాగా డబ్బులు ఉండాలి. ముఖ్యంగా నన్ను బాగా అర్థం చేసుకోవాలి. అలాంటి వాడు దొరికి నాకు నచ్చితే అతడినే పెళ్లి చేసుకుంటా’ అని తెలిపింది. ఇకపోతే సురేఖకు రెండో వివాహం చేయాలనుకుంటున్నానని ఆమె కూతురు సుప్రీతా ఇప్పటికే పలు ఇంటర్య్వూలో చెప్పిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement