ఇద్దరు భార్యల చేతిలో బుక్కైన భర్త! | Man Caught Red Handed Maintaining Two Wives In Tirupati | Sakshi
Sakshi News home page

ఇద్దరు భార్యల చేతిలో బుక్కైన భర్త!

Published Sat, Jul 25 2020 3:01 PM | Last Updated on Sun, Jul 26 2020 12:04 PM

Man Caught Red Handed Maintaining Two Wives In Tirupati - Sakshi

భర్తను వెంబడిస్తున్న మొదటి భార్య సరస్వతి

వెంకట చలపతి 13 ఏళ్ల క్రితం సరస్వతి అనే యువతికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక పాప. కొన్నాళ్ల తర్వాత గురుడు మరో యువతికి గాలం వేశాడు.

సాక్షి, తిరుపతి: దొంగచాటుగా ఇద్దరు భార్యలను మెయింటైన్‌ చేసిన ఓ భర్త గుట్టు రట్టయింది. భర్త రెండో పెళ్లి విషయం తెలుసుకున్న మొదటి భార్య ఫిర్యాదుతో అతనిపై కేసు నమోదైంది. అంతలోనే రెండో భార్య కూడా కేసు పెట్టడంతో తిరుపతికి చెందిన వెంకట చలపతి తల పట్టుకున్నాడు. వివరాలు.. వెంకట చలపతి 13 ఏళ్ల క్రితం సరస్వతి అనే యువతికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక పాప. కొన్నాళ్ల తర్వాత గురుడు మరో యువతికి గాలం వేశాడు. తాను బ్యాచిలర్‌ని అని నమ్మించి నెల్లూరుకు చెందిన మయూరిని పెళ్లి చేసుకున్నాడు.

అయితే, తన భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన మొదటి భార్య అతని బాగోతాలు తెలుసుకుంది. రెండో భార్యతో కలిసి వెళ్తున్న అతన్ని రెండు రోజుల క్రితం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో పట్టుకుందామని ప్రయత్నించింది. బైక్‌పై రెండో భార్య మయూరితో వెళ్తున్న చలపతి మొదటి భార్య, కూతురుని చూసి ఎస్కేప్‌ అయ్యాడు. వారు ఎంత పిలుస్తున్నా ఎవరో తెలియనట్టు మొహం చాటేశాడు. దీంతో సరస్వతి తన కుమార్తెతో కలిసి కన్నీరు మున్నీరుగా విలపించింది. తండ్రి ప్రవర్తన తెలిసిన వాళ్ల చిన్నారి కూతురు ‘అమ్మా.. డాడీని మర్చిపోమ్మా, విడాకులిచ్చేయ్‌’అని భోరుమంది. ఈ విషయం మీడియాలో రావడంతో హైలైట్‌ అయింది.
ఇక ఈ తల్లీ, కూతుళ్ల దీనగాధపై స్పందించిన మహిళా పోలీసులు సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో రెండో భార్య మయూరి రంగంలోకి వచ్చింది. వెంకట చలపతి తనను మోసం చేశాడని కేసు పెట్టింది. బ్యాచిలర్‌ అని నమ్మించి వివాహం చేసుకున్నాడని తెలిపింది. తానిప్పుడు గర్భవతిని అని భోరుమంది. నిండు గర్భిణిగా ఉన్న తన పరిస్థితి ఏంటని మయూరి వాపోయింది. ఒకరికి తెలియకుండా మరొకరిని ఏళ్ల నుంచి మెయింటైన్‌ చేస్తూ వచ్చిన వెంకట చలపతికి ఒకేసారి రెండు పోలీస్‌ కేసులు మెడకు చుట్టుకున్నాయి. (శ్రుతి లేదు.. భృతి లేదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement