Deepika-Raja Marriage: Actress Teju Venkatesh Reacts On Wedding - Sakshi
Sakshi News home page

బుల్లితెర నటీనటుల వివాహం.. ఆ నటిని మోసం చేశాడంటూ నటుడిపై మండిపాటు

May 22 2023 10:05 AM | Updated on May 22 2023 10:22 AM

Deepika, Raja Marriage: Actress Teja Venkatesh Reacts on Wedding - Sakshi

తేజును మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకున్నావంటూ కొందరు నెటిజన్లు రాజాపై మండిపడుతున్నారు. ఈ తేజు మరెవరో కాదు.. 'కన కానమ్‌ కాలంగళ్‌' సీరియల్‌లో అతడికి

ఆన్‌స్క్రీన్‌ మీద జోడీగా కనిపించినవాళ్లు నిజజీవితంలో కూడా జంటగా ఉండాలనేమీ లేదు. కొన్నిసార్లు వారు ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు, మరికొన్నిసార్లు పరిచయమే లేనట్లుగా కూడా ప్రవర్తించవచ్చు. కానీ తెరపై నటులను జంటగా చూసి ముచ్చటపడిన అభిమానులు రియల్‌ లైఫ్‌లో కూడా వారు ఒక్కటైతే బాగుండని కోరుకుంటారు. ఈ క్రమంలోనే సీరియల్స్‌లో జంటగా నటించేవారికి తరచూ పెళ్లి ప్రశ్నలు కూడా ఎదురవుతుంటాయి. 

తెరపై భాగస్వామిగా కనిపించినవారిని పెళ్లి చేసుకోకపోతే కొందరు అభిమానులు హర్ట్‌ అవుతారు కూడా! తమిళ నటుడు రాజా వేట్రి ప్రభు విషయంలో ఇదే నిజమైంది. అతడికి నటి దీపిక వెంకటాచలంతో నిశ్చితార్థం జరిగింది. ఈ శుభవార్తను వీరు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అప్పటినుంచి మొదలైంది అసలు సమస్య.. తేజను మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకున్నావంటూ కొందరు నెటిజన్లు రాజాపై మండిపడుతున్నారు. ఈ తేజ మరెవరో కాదు.. 'కన కానమ్‌ కాలంగళ్‌' సీరియల్‌లో అతడికి జంటగా నటించింది. ఇదే సీరియల్‌లో దీపిక కూడా నటించింది. కానీ ఈ సీరియల్‌లో రాజా- తేజల జోడీకి మంచి పేరొచ్చింది. ఈ రీల్‌ కపుల్‌ను రియల్‌ కపుల్‌గా చూడాలనుకున్న అభిమానుల ఆశలు ఆవిరి కావడంతో నటుడిపై ఫైర్‌ అవుతున్నారు.

శుభమా అని పెళ్లి చేసుకుంటే ఈ విమర్శల గోలేమిటి అనుకుందో ఏమో కానీ తేజ వెంటనే దీనిపై స్పందిస్తూ.. వారి పెళ్లికి, సీరియల్‌కు అసలు సంబంధమే లేదని స్పష్టం చేసింది. సీరియల్‌ వేరు, నిజ జీవితం వేరని, దయచేసి ఎవరూ రాజా, దీపికలను విమర్శించవద్దని కోరింది. వారి పెళ్లి తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొంది. ఇకపోతే రాజా- దీపికల పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. శుభాకార్యాలకు నలుపు రంగు దుస్తులను దూరం పెట్టే పద్ధతికి వీడ్కోలు చెప్తూ రిసెప్షన్‌లో బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసింది నటి.

చదవండి: తెలుగులో నటించడానికి రెడీ: దుషారా విజయన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement