
తమిళ సీరియల్స్‌తో కన్నా వివాదాలతోనే బాగా ఫేమసయ్యాడు నటుడు అర్ణవ్. సహనటి దివ్య శ్రీధర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడు ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో తనతో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఇటీవలే పండంటి పాపాయికి జన్మనిచ్చిన దివ్య తాజాగా మరోసారి అర్ణవ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అర్ణవ్ తనను తాను గేగా పరిచయం చేసుకుని ఓ పైలట్ నుంచి డబ్బులు గుంచి మోసం చేయడమే కాకుండా అతడి చావుకు కారణమయ్యాడని ఆరోపించింది.
10 ఏళ్ల క్రితమే ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి
ఎంతోమంది అమ్మాయిలను కూడా అర్ణవ్ మోసం చేశాడంది. ఈ మేరకు ఆడియో క్లిప్స్‌ను, అమ్మాయిలతో చాటింగ్ చేసిన స్క్రీన్‌షాట్లను ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఈ ఆడియో క్లిప్పింగ్స్‌లో ఓ ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.. అర్ణవ్ 10 ఏళ్ల క్రితమే తనను పెళ్లి చేసుకున్నాడని, కొన్నాళ్లపాటు సంతోషంగా ఉన్నామని చెప్పింది. తర్వాత మరో మహిళతో పరిచయం ఏర్పడటంతో తనను వేధించాడని, 8 ఏళ్లు అతడి వేధింపులు భరించానని చెప్పుకొచ్చింది.
మొదటి పెళ్లి విషయం దాచిన నటి
కాగా దివ్యకు 2013లో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. పాప కూడా ఉంది. మనస్పర్థల కారణంగా అతడికి విడాకులిచ్చింది. టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో సహనటుడు అర్ణవ్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారగా 2022 జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే ఆమెకు అంతకుముందే పెళ్లై, ఒక కూతురు కూడా ఉందన్న విషయం అర్ణవ్‌కు తెలిసింది. మరోవైపు చెల్లమ్మ సీరియల్ నటి అన్షితతో అర్ణవ్ ఎఫైర్ నడుపుతున్న విషయం దివ్యకు తెలిసింది.
ఒకరిపై మరొకరు నిందారోపణలు
దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తనకు తెలియకుండా వేరే వ్యక్తితో కలిసి దివ్య గర్భాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అర్ణవ్. అటు దివ్య కూడా తన భర్తకు వేరే నటితో సంబంధం ఉందని తెలిసి, షూటింగ్ స్పాట్‌కు వెళ్లి నిలదీస్తే కొట్టిందని, భర్త కూడా తనపై దాడి చేస్తూ చిత్రహింసలు పెడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేసినప్పటికీ బెయిల్‌పై బయటకు వచ్చాడు.
చదవండి: వైభవంగా శర్వానంద్ పెళ్లి, ఫోటోలు చూశారా?
గ్లామర్‌కు నో చెప్పను, కానీ వల్గారిటీ మాత్రం..
Comments
Please login to add a commentAdd a comment