TV Couple Divya Sridhar And Arnav Blessed With A Baby Girl - Sakshi
Sakshi News home page

Divya Sridhar: మరో నటితో వివాహేతర సంబంధం, భర్తకు విడాకులు.. పాపకు జన్మనిచ్చిన నటి

Published Sat, Apr 8 2023 9:33 PM | Last Updated on Sun, Apr 9 2023 10:50 AM

Actress Divya Sridhar Welcome Baby Girl - Sakshi

కోలీవుడ్‌ బుల్లితెర జంట అర్ణవ్‌-దివ్యలు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే! ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తాను గర్భం దాల్చగానే మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ అర్ణవ్‌ను అరెస్ట్‌ చేయించింది దివ్య. గర్భంతో ఉండగా తన కడుపుపై తన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఈ నటి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఓ ఫోటో షేర్‌ చేసింది.

'ఈ ఎదురుచూపులు ఎంతో ప్రత్యేకమైనవి.  గతంలో ఏం జరిగిందనేదానికంటే ఇకమీదట ఎలా ఉండబోతుందనేది నాకు ముఖ్యం. నువ్వు నాకిచ్చిన ప్రేమ, బలం, సపోర్ట్‌.. అన్నీ అడగకముందే ఇచ్చావు. నాలో భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎప్పటికీ నేను నీదాన్నేనని మాటిస్తున్నాను. ఎన్నటికీ నీవెంటే ఉంటాను. నా అందమైన చిట్టిత్లలి.. లవ్‌యూ డార్లింగ్‌. నా ప్రయాణంలో నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు' అని రాసుకొచ్చింది.

కాగా సెవ్వంధీ అనే తమిళ సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టింది దివ్య శ్రీధర్‌. తొలి సీరియల్‌తోనే బోలెడంత పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ముందు 2012లోనే దివ్యకు పెళ్లై, పాప కూడా ఉంది. కానీ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో అర్ణవ్‌తో ప్రేమలో పడింది. అతడి కోసం మతం కూడా మార్చుకుంది. 

వీరిద్దరూ గతేడాది జూన్‌లో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే ఆమెకు గతంలో పెళ్లై, పాప కూడా ఉందన్న అర్ణవ్‌కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. మరోపక్క అర్ణవ్‌ సహనటితో సంబంధం వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు చేసింది దివ్య. ఇందుకు సంబంధించిన ఆడియోకాల్‌ కూడా లీకవగా అది సోషల్‌ మీడియాలో వైరలయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement