Arnav
-
ఏకే ఫ్లవర్ కాదు ఫైర్ బోల్ట్!
అర్నవ్ కిశోర్‌కు ఆటలు అంటే ప్రాణం. స్పోర్ట్స్‌మెన్, ఫిట్నెస్ ప్రేమికులకు ఉపయోగపడే గాడ్జెట్లను సృష్టించాలనేది తన భవిష్యత్ లక్ష్యంగా ఉండేది. వేరబుల్ టెక్ కంపెనీ ‘ఫైర్–బోల్ట్’తో తన కలను నిజం చేసుకున్నాడు కిశోర్. స్మార్ట్ వేరబుల్ మార్కెట్‌ను తగిన అధ్యయనం చేసిన తరువాత మార్కెట్ వ్యూహాలు రచించుకున్నాడు. అప్పటికే చైనాలోని దిగ్గజ టెక్ కంపెనీలు మన మార్కెట్లోకి వచ్చాయి. వాటితో పోటీ పడడం అంత సులభం ఏమీ కాదు. మంచి టైమ్ రావాలంటే ఆ టైమ్ ఎప్పుడు వస్తుందో ఓపిగ్గా ఎదురుచూడాలి. అర్నవ్ కిశోర్ అదే చేశాడు. సరిౖయెన సమయం చూసి మార్కెట్లోకి దిగి విజయం సాధించాడు. తొలి సంవత్సరం....‘మన టైమ్ వచ్చేసింది’ అనుకున్నాడు. రెండో సంవత్సరం....‘ఈ ఫైర్ ఇలాగే కొనసాగాలి’ అనుకున్నాడు. గత సంవత్సరం ఫైర్–బోల్ట్ నాయిస్ మన దేశంలోనే అతి పెద్ద స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌గా అవతరించింది. ఆన్లైన్లోనే కాదు ఆఫ్‌లైన్ లోనూ సరసమైన ధరల్లో అందుబాటులో ఉండేలా చేయడమే కాదు, ఇన్నోవెటివ్, మార్కెట్–ఫస్ట్ ఫీచర్స్ కూడా కంపెనీ ఉత్పత్తులు విజయం సాధించడానికి ప్రధాన కారణం. కంపెనీ ప్రాడక్ట్ లైన్లోనికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటి) డివైజ్‌లు, వైర్లెస్ ఇయర్ ఫోన్లు...మొదలైనవి వచ్చి చేరాయి. ఇండియన్ మార్కెట్లో విజయం సాధించిన అర్నవ్ అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. వ్యాపారవేత్త అయిన తండ్రి నుంచి కిశోర్ నేర్చుకున్న పాఠం... ‘నిరాశతో ప్రయాణాన్ని ఆపవద్దు. పరుగెత్తక పోయినా సరే, నడిస్తే చాలు. ప్రయాణంలోనే ఎన్నో విషయాలను నేర్చుకుంటాం. మంచి,చెడులను తెలుసుకుంటాం’. నిజానికి ప్రయాణ ప్రారంభంలోనే అర్నవ్ కిశోర్‌కి కోవిడ్ హాయ్ చెప్పి భయపెట్టింది. సంక్షోభ సమయంలో వ్యాపారవేత్త డీలా పడకూడదు. కిశోర్ ఆ సమయంలోనూ అధైర్య పడలేదు. వెనకడుగు వేయలేదు. ‘ట్రెండ్స్ ఆఫ్ బ్యాండ్’ ఏమిటి? ‘పాపులారిటీ కోల్పోయిన బ్యాండ్స్ ఏమిటి?’ అనే అంశంపై అవగాహన ఉన్న కిశోర్ 2021లో కొత్త స్ట్రాటజీతో ముందుకు వచ్చాడు. టెంప్టింగ్ ట్యాగ్‌తో నింజా సిరీస్ స్మార్ట్ వాచ్‌లను తీసుకువచ్చి విజయం సాధించాడు. ‘రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్ అండ్ డీ), డిజైన్ మార్కెట్లో మాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగించాయి’ అంటాడు కిశోర్. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్లు అందుకున్నాడు అర్నవ్ కిశోర్. సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అర్నవ్ కిశోర్ ఇప్పుడు చేయాల్సింది....ఎప్పటిలాగే ఆట తెలివిగా ఆడటం. అతి ఆత్మవిశ్వాసం ఉంటే ఆట తారు మారు అవుతుంది. ఇలాంటి విషయాలు అర్నవ్ కిశోర్‌కు తెలియనివేమీ కాదు. ఎందుకంటే ఈ యువ వ్యాపారవేత్త తండ్రి నుంచి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాడు. టెక్నాలజీ, ఫిట్నెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్పోర్ట్స్...అనేవి అర్నవ్ కిశోర్(ఏకే) కలల ప్రపంచం. వాటిని మిళితం చేసి ‘ఫైర్–బోల్ట్’ స్టార్టప్ సృష్టించాడు. ఇది మన దేశంలోనే అతి పెద్ద వేరబుల్ టెక్ బ్రాండ్‌గా అవతరించింది. అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతుంది. ‘మంచి టైమ్ సెట్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది’ అంటాడు ఏకే... (చదవండి: బీర్ వ్యర్థాలతో..బిస్కెట్లు, చిక్కిలు, లడ్డులా..) -
తన భర్త నుంచి కాపాడాలంటూ సీఎం స్టాలిన్‌ని కోరిన నటి
కోలీవుడ్‌లో ప్రముఖ బుల్లితెర నటి దివ్య.. తన భర్త అర్ణవ్ నుంచి కాపాడాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అభ్యర్థించింది. అక్కడ ప్రసారం అయ్యే 'సెవ్వంతి' సీరియల్‌తో నటి దివ్య ఫేమస్ అయింది. గతేడాది బుల్లితెర నటుడు అయిన అర్ణవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గర్భందాల్చిన సమయంలో తన కడుపుపై అర్ణవ్ తన్నాడని, మానసికంగా హింసించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అర్ణవ్ బెయిల్‌పై విడుదల అయ్యాడు. మరో ఇద్దరు మహిళలను ఆర్నవ్ మోసం చేశాడు? అర్ణవ్ ఇద్దరు మహిళలను మోసం చేశాడంటూ దివ్య ఆడియో విడుదల చేసింది. వారిద్దరిని కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది. బెయిల్‌పై విడుదల అయిన అర్ణవ్ తన మనుషులు, లాయర్లతో వచ్చి గొడవ పడ్డాడని దివ్య సంచలన ఆరోపణ చేసింది. అర్దరాత్రి ఒక్కసారిగా 15 మందితో తన ఇంటి తలుపు తట్టాడని తెలిపింది. వారందరూ తనను తోసుకుంటూ ఇంట్లోకి చొరబడ్డారని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?) అతను బెయిల్‌పై ఉన్నాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆమె ఇలా ఫిర్యాదు చేసింది. 'ప్రస్తుతం అర్ణవ్ షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నాడు. ఈ సమయంలో అతను నా ఇంటికి రాకూడదు. నన్ను బెదిరించి, నా పాపను చంపడానికి ప్రయత్నించాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో అతనికి అన్నీ తెలుసు.. అందుకోసం ఒక వ్యక్తిని గూఢచారిగా పెట్టుకున్నాడు. ఎప్పటికైనా నన్ను చంపేస్తాడు. నా ఇంట్లో ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వచ్చి బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఆయనపై చర్యలు తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను’ అని దివ్య కన్నీరు పెట్టుకుంది. (ఇదీ చదవండి: Drugs Case: కేపీ చౌదరి ఫోన్ లిస్ట్‌లో సినీ ప్రముఖల లిస్ట్) -
నా మాజీ భర్త ఎంతోమంది అమ్మాయిలను మోసం చేశాడు: నటి
తమిళ సీరియల్స్‌తో కన్నా వివాదాలతోనే బాగా ఫేమసయ్యాడు నటుడు అర్ణవ్. సహనటి దివ్య శ్రీధర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడు ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో తనతో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఇటీవలే పండంటి పాపాయికి జన్మనిచ్చిన దివ్య తాజాగా మరోసారి అర్ణవ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అర్ణవ్ తనను తాను గేగా పరిచయం చేసుకుని ఓ పైలట్ నుంచి డబ్బులు గుంచి మోసం చేయడమే కాకుండా అతడి చావుకు కారణమయ్యాడని ఆరోపించింది. 10 ఏళ్ల క్రితమే ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి ఎంతోమంది అమ్మాయిలను కూడా అర్ణవ్ మోసం చేశాడంది. ఈ మేరకు ఆడియో క్లిప్స్‌ను, అమ్మాయిలతో చాటింగ్ చేసిన స్క్రీన్షాట్లను ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఈ ఆడియో క్లిప్పింగ్స్‌లో ఓ ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.. అర్ణవ్ 10 ఏళ్ల క్రితమే తనను పెళ్లి చేసుకున్నాడని, కొన్నాళ్లపాటు సంతోషంగా ఉన్నామని చెప్పింది. తర్వాత మరో మహిళతో పరిచయం ఏర్పడటంతో తనను వేధించాడని, 8 ఏళ్లు అతడి వేధింపులు భరించానని చెప్పుకొచ్చింది. మొదటి పెళ్లి విషయం దాచిన నటి కాగా దివ్యకు 2013లో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. పాప కూడా ఉంది. మనస్పర్థల కారణంగా అతడికి విడాకులిచ్చింది. టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో సహనటుడు అర్ణవ్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారగా 2022 జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే ఆమెకు అంతకుముందే పెళ్లై, ఒక కూతురు కూడా ఉందన్న విషయం అర్ణవ్‌కు తెలిసింది. మరోవైపు చెల్లమ్మ సీరియల్ నటి అన్షితతో అర్ణవ్ ఎఫైర్ నడుపుతున్న విషయం దివ్యకు తెలిసింది. ఒకరిపై మరొకరు నిందారోపణలు దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తనకు తెలియకుండా వేరే వ్యక్తితో కలిసి దివ్య గర్భాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అర్ణవ్. అటు దివ్య కూడా తన భర్తకు వేరే నటితో సంబంధం ఉందని తెలిసి, షూటింగ్ స్పాట్‌కు వెళ్లి నిలదీస్తే కొట్టిందని, భర్త కూడా తనపై దాడి చేస్తూ చిత్రహింసలు పెడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేసినప్పటికీ బెయిల్‌పై బయటకు వచ్చాడు. చదవండి: వైభవంగా శర్వానంద్ పెళ్లి, ఫోటోలు చూశారా? గ్లామర్‌కు నో చెప్పను, కానీ వల్గారిటీ మాత్రం.. -
భర్తకు విడాకులు.. పాపకు జన్మనిచ్చిన బుల్లితెర నటి
కోలీవుడ్ బుల్లితెర జంట అర్ణవ్-దివ్యలు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే! ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తాను గర్భం దాల్చగానే మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ అర్ణవ్‌ను అరెస్ట్ చేయించింది దివ్య. గర్భంతో ఉండగా తన కడుపుపై తన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఈ నటి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేసింది. 'ఈ ఎదురుచూపులు ఎంతో ప్రత్యేకమైనవి. గతంలో ఏం జరిగిందనేదానికంటే ఇకమీదట ఎలా ఉండబోతుందనేది నాకు ముఖ్యం. నువ్వు నాకిచ్చిన ప్రేమ, బలం, సపోర్ట్.. అన్నీ అడగకముందే ఇచ్చావు. నాలో భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎప్పటికీ నేను నీదాన్నేనని మాటిస్తున్నాను. ఎన్నటికీ నీవెంటే ఉంటాను. నా అందమైన చిట్టిత్లలి.. లవ్యూ డార్లింగ్. నా ప్రయాణంలో నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు' అని రాసుకొచ్చింది. కాగా సెవ్వంధీ అనే తమిళ సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టింది దివ్య శ్రీధర్. తొలి సీరియల్‌తోనే బోలెడంత పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ముందు 2012లోనే దివ్యకు పెళ్లై, పాప కూడా ఉంది. కానీ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో అర్ణవ్‌తో ప్రేమలో పడింది. అతడి కోసం మతం కూడా మార్చుకుంది. వీరిద్దరూ గతేడాది జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే ఆమెకు గతంలో పెళ్లై, పాప కూడా ఉందన్న అర్ణవ్‌కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. మరోపక్క అర్ణవ్ సహనటితో సంబంధం వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు చేసింది దివ్య. ఇందుకు సంబంధించిన ఆడియోకాల్ కూడా లీకవగా అది సోషల్ మీడియాలో వైరలయింది. View this post on Instagram A post shared by Divya Shridhar (@divya_shridhar_1112) -
నటి దివ్య కేసులో కొత్త ట్విస్ట్, ఆమె కంటే ముందు ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమ, పెళ్లి
బుల్లితెర నటులు దివ్య, అర్నవ్ కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. తన భర్తకు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని, తనని మోసం చేశాడంటూ అర్నవ్‌పై దివ్య ఇటీవల ఆరోపణలు చేయగా.. తన భార్యకు మతిస్థిమితం సరిగా లేదంటూ అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండంతో ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా దివ్య కంటే ముందు అర్నవ్ తనని పెళ్లి చేసుకున్నాడంటూ ప్రియదర్శిని అనే ట్రాన్స్‌జెండర్ సంచలన ఆరోపణలు చేసింది. చదవండి: భర్త జయంతి.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన నటి మేఘన ఈ మేరకు ఆమె ఓ ఆడియో రికార్డ్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మలయాళంలో ఉన్న ఈ ఆడియోలో ప్రియాంక ఏం చెప్పుకొచ్చిందంటే.. ‘నాకు, అర్నవ్‌తో టీ నగర్లో పరిచయం ఏర్పడింది. మా పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారింది. దీంతో ఇద్దరం ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ల పాటు ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. మా వైవాహిక జీవితం చాలా హ్యాపీగా సాగింది. అయితే ఉన్నట్టుండి అర్నవ్లో సడెన్‌గా మార్పు వచ్చింది. తరచూ నన్ను వేధించడం మొదలు పెట్టాడు. అయితే అతడికి మరో మహిళతో పరిచయం వల్లే నన్ను వేధించడం స్టార్ట్ చేశాడు. నన్ను తీవ్రంగా హింసించాడు. ఎనిమిదేళ్లు అతడి వేధింపులు భరించాను. అర్నవ్ ఓ సైకో’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చదవండి: విష్ణు నన్ను అలా అనడంతో షాకయ్యా: మంచు మోహన్ బాబు ఇక అతడి వేధింపులు తట్టుకోలేక తాను అర్నవ్ నుంచి విడిపోయానంటూ ప్రియదర్శిని తెలిపింది. ఇదిలా ఉంటే కేలాడి కన్మణి అనే సీరియల్ షూటింగ్లో సమయంలో నటి దివ్య, అర్నవ్ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో 2022 జూన్ 29న హిందూ సాంప్రదాయం ప్రకారం వారు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భంగా దాల్చింది. ఇప్పుడు అర్నవ్ తనని వదిలేసి మరో నటితో క్లోజ్‌గా ఉంటున్నాడంటూ దివ్య ఇటీవల పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
గృహహింస కేసు.. విచారణకు గడువు కోరిన నటుడు
తమిళసినిమా: బుల్లితెర నటుడు అర్ణవ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావడానికి గడువు కోరాడు. వివరాల్లోకి వెళితే.. బుల్లితెర జంట అర్ణవ్, దివ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల తన భర్త తనని కొట్టి, చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ స్థానిక పోరర్ మహిళా పోలీసుస్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో గృహహింస, హత్య బెదిరింపులు విభాగాల్లో కేసు నవెదు చేసి, విచారణ చేపట్టారు. అందులో భాగంగా నటుడు అర్ణవ్‌ను విచారణకు రావాల్సిందిగా పలుమార్లు సమన్లు పంపినా అతను హాజరు కాలేదు. చివరిగా శుక్రవారం హాజరు కావాలని లేని పక్షంలో అరెస్టు చేయాల్సి ఉంటుందని సమన్లు జారీ చేశారు. అయితే అర్ణవ్ పరారీలో ఉన్నట్లు, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కంటికి గాయం కారణంగా తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని, అందువలన విచారణకు హాజరు కావడానికి గడువు కావాలని, ఈ నెల 18వ తేదీన హాజరవుతానని తన న్యాయవాది ద్వారా ఓ లేఖను పోలీసులకు పంపారు. దీంతో అతనిపై చర్యలు తీసుకునే విషయమై పోలీసులు అధికారులు చర్చలు జరుపు తున్నారు. -
దివ్య భర్తపై ముద్దుల వర్షం.. నటి అన్షిత ఆడియో కాల్ లీక్
కోలీవుడ్ బుల్లితెర జంట అర్ణవ్- దివ్యల వివాదం మరింత ముదురుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తను గర్భం దాల్చగానే మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ దివ్య శ్రీధర్.. అర్ణవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే కదా! ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఆడియో కాల్ వైరల్‌గా మారింది. 'చెల్లమ్మ' సీరియల్ నటి అన్షిత.. దివ్యపై ఫైర్ అయిన ఆడియో కాల్ నెట్టింట లీక్ అయింది. ఇందులో దివ్యను రెచ్చగొట్టేలా ఆమె అర్ణవ్‌కు ప్రపోజ్ చేస్తూ ముద్దులు పెట్టింది. ఆ ఆడియో కాల్లో అన్షిత మాట్లాడుతూ.. నాకేం చేయాలనిపిస్తే అదే చేస్తా. మీ జీవితాల్లోకి నేను రావాలనుకుంటున్నావా? అని అడిగింది. అందుకు దివ్య.. నువ్వొక ఆడదానివేనా? ఇంకో ఆడదాని జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? అని ప్రశ్నించగా.. నిన్ను కొట్టి చంపాలన్నంత కోపం ఉందని బదులిచ్చింది అన్షిత. నీవల్ల నా భర్త జీవితం ఇబ్బందుల్లో పడుతుందని తెలిసినప్పుడు ఒక స్నేహితురాలిగానైనా అతడి లైఫ్ నుంచి పక్కకు తప్పుకోవచ్చు కదా అని కోరింది దివ్య. అలా ఇద్దరూ వాదులాడుకుంటున్న సమయంలో కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న అర్ణవ్‌కు అన్షిత ఏకంగా ప్రపోజ్ చేసింది. అర్ణవ్, ఐ లవ్ యూ సో మచ్.. అంటూ అతడికి ఫోన్లోనే ముద్దుల వర్షం కురిపించింది. నీ ముందే నీ భర్తకు ముద్దు పెట్టా, ఇప్పుడేం చేస్తావ్? అని రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ ఆడియోకాల్ వైరల్‌గా మారింది. కాగా దివ్యకు 2012లోనే ఓ వ్యక్తితో పెళ్లై పాప కూడా ఉంది. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆమె సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో సహనటుడు అర్ణవ్‌తో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. అతడి కోసం మతం కూడా మార్చుకుంది. వీరిద్దరూ ఈ ఏడాది జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. ఆ సమయంలో ఆమెకు గతంలో పెళ్లై పాప కూడా ఉందన్న విషయం అర్ణవ్‌కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. మరోవైపు అర్ణవ్ వేరే నటితో సంబంధం పెట్టుకున్నాడని దివ్య ఆరోపిస్తోంది. ఈ విషయంపై దివ్య అటు పోలీసులకు ఇటు కమిషనర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసింది. చదవండి: జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం, హీరో అరెస్ట్ బిగ్‌బాస్ షో నుంచి అతన్ని తీసేయండి -
వేరే వ్యక్తితో కలిసి గర్భాన్ని తీసే ప్రయత్నం చేసింది: అర్ణవ్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తపై బుల్లితెర నటి చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన దివ్య (35) చెన్నైలో నివసిస్తోంది. ఈమెకు 2012లో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. పాప కూడా ఉంది. అయితే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది. టీవీ సీరియళ్లలో నటిస్తున్న క్రమంలో సహనటుడు అర్ణవ్‌తో పరిచయం ఏర్పడింది. దివ్య ఇస్లాం మతం తీసుకుని ఈ ఏడాది జూన్‌లో ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే ఆమెకు అంతకుముందే పెళ్లయిందని, ఒక కూతురు కూడా ఉందన్న విషయం అర్ణవ్‌కు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దివ్య తమ పెళ్లి ఫొటోలు, వీడియోలను పోస్టు చేసింది. వాటిని డిలీట్ చేయమని అర్ణవ్ ఆమెపై ఒత్తిడి చేశాడు. అందుకు దివ్య నిరాకరించడంతో ఆమెపై ఆవడి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య తనకు తెలియకుండానే వేరే వ్యక్తితో కలిసి గర్భాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి దివ్య గురువారం రాత్రి చెన్నై కమిషనర్ కార్యాలయంలో తన భర్తపై ఫిర్యాదు చేసింది. అందులో తాము చట్ట ప్రకారం భార్యభర్తలుగా కాపురం చేస్తున్నామని అయితే తన భర్తకు వేరే నటితో సంబంధం ఉన్న విషయం తెలిసి తాను ఆమె నటిస్తున్న షూటింగ్ స్పాట్‌కి వెళ్లి నిలదీశానని, దీంతో ఆమె తనను వాటర్ బాటిల్‌తో కొట్టిందని పేర్కొంది. తన భర్త కూడా తనపై దాడిచేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. -
కడతేరిన కుటుంబం
అగ్రరాజ్యంలో ఓ ప్రవాస భారతీయ జంట అనుమానాస్పద పరిస్థితుల్లో కడతేరిపోయింది. కొడుకు పోయిన విషాదం నుంచి తేరుకోకముందే భార్యాభర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరి మరణానికి గల కారణాలు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ హృదయ విదారక ఘటన టెక్సాస్ లోని ఫ్రిస్కోలో చోటుచేసుకుంది. సుమీత్ ధావన్(43), పల్లవి(39) భార్యాభర్తలు. వీరికి అర్నవ్ అనే పదేళ్ల కొడుకు ఉండేవాడు. అనారోగ్య సమస్యలతో బాధపడే అర్నవ్ ను ఎప్పుడు ఒక మనిషి కనిపెట్టుకుని చూడాల్సివచ్చేది. ఈ ఏడాది జనవరిలో ఆర్నావ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నానాల గదిలో బాత్ టబ్‌లో ఐస్ గడ్డలతో కప్పబడిన అతడి మృతదేహం వెలుగుచూసింది. అర్నవ్ అనారోగ్యం కారణంగానే చనిపోయాడని, విదేశాలకు వెళ్లిన సుమీత్ తిరిగివచ్చే వరకు ఉంచాలన్న ఉద్దేశంతో అర్నవ్ మృతదేహాన్ని ఐస్ లో పెట్టానని పల్లవి పేర్కొంది. హిందూ ధర్మం ప్రకారం అతడి కర్మకాండలు జరిపించాలన్న ఉద్దేశంతో తానీ పనిచేసినట్టు పేర్కొంది. అయితే టెక్సాస్ లో ఉంటున్న సుమీత్ తోబుట్టువులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్న ప్రశ్నకు పల్లవి వద్ద సమాధానం లేదు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి ప్రశ్నించారు. అర్నవ్ హత్య చేశారా అన్న ప్రశ్నకు పల్లవి అవును అన్నట్టుగా తలవూపిందని పోలీసులు పేర్కొన్నారు. తమ ఒక్కగానొక్క కొడుకుని ఎప్పుడు చిన్నదెబ్బ కూడా వేయని పల్లవి హత్య చేసిందంటే తనకు నమ్మశక్యంగా లేదని సుమీత్ వాపోయాడు. ఈ కేసు విచారణ నడుస్తుండగానే సుమీత్, పల్లవి తమ నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్విమ్మింగ్ పూల్ లో పల్లవి శవమై తేలగా, సుమీత్ తలపై గాయంతో తన గదిలో నిర్జీవ స్థితిలో కనిపించాడు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా, మరేదైన కారణం ఉందా అనేది ఇంకా తేలలేదు. వీరి ఇంట్లో దొరికిన నోట్ లో ఏముందో వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. ఏదేమైనా ఓ విషాదం ప్రవాస కుటుంబాన్ని కడతేర్చింది.