
తమిళసినిమా: బుల్లితెర నటుడు అర్ణవ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావడానికి గడువు కోరాడు. వివరాల్లోకి వెళితే.. బుల్లితెర జంట అర్ణవ్, దివ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల తన భర్త తనని కొట్టి, చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ స్థానిక పోరర్ మహిళా పోలీసుస్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో గృహహింస, హత్య బెదిరింపులు విభాగాల్లో కేసు నవెదు చేసి, విచారణ చేపట్టారు.
అందులో భాగంగా నటుడు అర్ణవ్‌ను విచారణకు రావాల్సిందిగా పలుమార్లు సమన్లు పంపినా అతను హాజరు కాలేదు. చివరిగా శుక్రవారం హాజరు కావాలని లేని పక్షంలో అరెస్టు చేయాల్సి ఉంటుందని సమన్లు జారీ చేశారు. అయితే అర్ణవ్ పరారీలో ఉన్నట్లు, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా కంటికి గాయం కారణంగా తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని, అందువలన విచారణకు హాజరు కావడానికి గడువు కావాలని, ఈ నెల 18వ తేదీన హాజరవుతానని తన న్యాయవాది ద్వారా ఓ లేఖను పోలీసులకు పంపారు. దీంతో అతనిపై చర్యలు తీసుకునే విషయమై పోలీసులు అధికారులు చర్చలు జరుపు తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment