questioning
-
అప్పుడేం చేశారు..? ఇప్పుడేం చేస్తారు? గల్లీ ప్రశ్నిస్తోంది..!
సాక్షి హైదరాబాద్: నగరంలో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ప్రధాన పార్టీలు సమరభేరి మోగించి కదన రంగంలో ప్రచారస్త్రలను సంధిస్తున్నాయి. సభలు, సమావేశాలు, భారీ ప్రదర్శనలు సమరోత్సాహంతో ఉన్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏళ్లకు ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి, సంక్షేమానికి నోచుకోని ఓటర్లు కూడా తమ వద్ద ఉన్న ఏకైక పాశుపతాస్త్రాన్ని సంధించేందుకు సన్నద్ధమవుతున్నారు. మౌలిక సమస్యలపై నిలదీసేందుకు, ప్రశ్నించేందుకు బస్తీ సంక్షేమ సంఘాలు సరికొత్త ప్రశ్నావళితో ముందుకొస్తున్నాయి. బస్తీలు, మురికివాడల్లో నివసించే ప్రజలను కేవలం ఓటు బ్యాంకులుగా భావించే పార్టీల ధోరణి మారాలంటున్నాయి. స్థానిక నాయకులు మొదలుకొని బరిలోకి దిగిన అభ్యర్థుల వరకు బస్తీల్లోకొచ్చే వారిపై ఈ ప్రశ్నిస్త్రాలను సంధించనున్నారు. బస్తీలపై వివక్ష ఎందుకు? బస్తీలు అంటే వెంటనే గుర్తుకొచ్చేది కంకర తేలిన సిమెంట్ రోడ్లు, ఇరుకు గల్లీలు. ఒకదానికొకటి అతికించినట్లుగా ఉండే అగ్గిపెట్టెల్టాంటి ఇళ్లు. వాటిని ఆనుకొని నురగలు కక్కుతూ ప్రవహించే నాలాలు. ముక్కుపుటాలదిరే దుర్గంధం గుర్తుకొస్తుంది. దోమల స్వైరవిహారం కళ్ల మందు కనిపిస్తుంది. ఫుట్‌పాత్‌లు, పేవ్మెంట్లను ఆశ్రయించుకొని జీవనం సాగించే చిరువ్యాపారులు కనిపిస్తారు. దశాబ్దాలుగా అనేకసార్లు ఎన్నికలొచ్చాయి. కానీ బస్తీ ముఖచిత్రం మారలేదు. మరోసారి ఎన్నికలు వచ్చాయి. అన్ని గల్లీల్లో ఇప్పుడు పార్టీల జెండాలు ఎగురుతున్నాయి. మైకుల్లో ప్రచారం హోరెత్తుతోంది. నాయకులు హామీలు గుప్పిస్తున్నారు. ఈ హామీలు అప్పుడు, ఇప్పుడు, భవిష్యత్‌లోనూ ఉంటాయని బస్తీవాసులకు తెలుసు. అందుకే ‘గత ఎన్నికల్లో ఓటేస్తే ఏం చేశారు. ఇప్పుడు ఓటెందుకు వేయాలి’ అనే మౌలికమైన ప్రశ్నతో వివిధ పార్టీల నాయకులను నిలదీసేందుకు బస్తీ సంఘాలు, కాలనీ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. గ్రేటర్లో సుమారు 1,500కు పైగా మురికి వాడలు, బస్తీలు ఉన్నాయి. లక్షలాది మంది నివసించే ఈ మురికివాడలే అన్ని రాకీయ పార్టీలకు ప్రధాన ఓటుబ్యాంకులు. బాధ్యతగా ఓటు వేసేది కూడా వాళ్లే. ఈ నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా బస్తీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి నివాస హక్కుల కోసం పోరాడుతున్న హైదరాబాద్ బస్తీ ప్రజల సమాఖ్య వివిధ పార్టీల అభ్యర్థులపై ఈ అ్రస్తాలను సంధిస్తోంది. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ఎమ్మెల్యే కావాలి? అని హైదరాబాద్ బస్తీ ప్రజల సమాఖ్య ప్రతినిధి బ్రదర్ వర్గీస్ అన్నారు. ఇప్పటి వరకు ఏం చేశారు? స్థానిక సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బస్తీసంఘాలు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కరపత్రాలను పంపిణీ చేస్తున్నాయి. ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు బస్తీల్లో పర్యటించారు. ఏయే సమస్యలను పరిష్కరించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలేంటి అనే అంశాలపై చర్చిస్తున్నారు. బస్తీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యేలకు ఏ మేరకు అవగాహన ఉందనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని బస్తీ సంఘాలు భావిస్తున్నాయి. డబుల్బెడ్రూం ఇళ్ల మంజూరుపైనా ప్రశ్నించనున్నారు. ఈ ప్రశ్నలకు బదులేదీ? బస్తీల్లో ప్రచారానికి వచ్చే నాయకులను, పార్టీలను నిలదీసేందుకు బస్తీ సంఘాలు సిద్ధం చేస్తున్న ప్రశ్నావళి ఇలా ఉంది. బస్తీ ప్రజల ఉపాధి కోసం ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు. ఎప్పటి వరకు ఇళ్లు కట్టించి ఇస్తారు. బ్యాంకుల నుంచి రుణసదుపాయం కల్పిస్తారా? వర్షాకాలంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి మీ వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి. బస్తీలు నీటమునగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? నగరంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పేదప్రజలకు ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు మీరు సిద్ధమేనా? బస్తీల్లోని యువతను నిర్విర్యం చేసేందుకు మోహరించి ఉన్న మాదకద్రవ్యాల అమ్మకాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నాలాలను కబ్జా చేసిన వాళ్లను, బస్తీల్లో ప్రజలపై దౌర్జన్యం చేసే వారిని కట్టడి చేయగలరా? వరదల నివారణకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తారు? వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మంజూరు చేసే నిధులను పారదర్శకంగా ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? గత ఎన్నికల్లో మీ పార్టీ ఇచ్చిన హామీలు గుర్తున్నాయా? ఇప్పుడు కొత్తగా ఎలాంటి హామీలు ఇస్తున్నారు? హామీలను నిలబెట్టుకోలేని పార్టీలకు ఓటెందుకు వేయాలి? -
MLC Kavitha: మూడో రోజు ముగిసిన కవిత ఈడీ విచారణ
మూడో రోజు ముగిసిన విచారణ ► లిక్కర్ స్కాంలో భాగంగా కల్వకుంట్ల కవితపై ఈడీ నిర్వహించిన మూడోరోజు విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 9:40 గంటల వరకు కొనసాగింది. ► లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. ఉదయం 11.30 నుంచి ఆమెను ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఈ తరుణంలో ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి కేంద్ర బలగాలు వెనుదిరిగాయి. మరోవైపు ఈడీ ఆఫీస్ వద్దకు కవిత ఎస్కార్ట్ వాహనం చేరుకుంది. ఇక.. అరగంట నుంచి కవిత లీగల్ టీంలోని అడ్వొకేట్ సోమాభరత్ కుమార్, ఈడీ ఆఫీస్‌లోనే ఉన్నారు. ► ఎనిమిది గంటలుగా కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఢిల్లీ ఈడీ ఆఫీస్‌లోని మూడో ఫ్లోర్లో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే.. కాసేపటి కిందట కవిత లీగల్ టీం ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ఈడీ పిలుపు మేరకు లీగల్ టీం అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. సోమాభరత్ కుమార్‌తో పాటు బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. ఈడీ అడిగిన పత్రాలను వాళ్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ► వరుసగా రెండోరోజూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ సుదీర్ఘంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఐదు గంటలకు పైగా కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించగా.. పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. ► ఈడీ కార్యాలయంలో మూడో రోజు(వరుసగా రెండో రోజు) విచారణకు హాజరయ్యారు కవిత. అంతకుముందు ఆమె అధికారులకు లేఖ రాశారు. రాజకీయ కోణంలోనే తనను విచారిస్తున్నారని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్లు ధ్వంసం చేశానని చెబుతున్నారని, అందుకే తన పాత ఫోన్లన్నీ ఈడీకి ఇచ్చేస్తున్నట్లు చెప్పారు. ఫోన్ల విషయంలో తనకు కనీసం సమన్లు కూడా ఇవ్వలేదని కవిత పేర్కొన్నారు. కానీ నవంబర్ నుంచే తాను ఫోన్లు ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పారు. ► ఈడీ విచారణకు హాజరయ్యేందుకు కవిత ఢిల్లీలోని కేసీఆర్ ఇంటి నుంచి బయల్దేరారు. కారు ఎక్కేముందు మీడియాకు తన ఫోన్లను చూపించారు. కవిత 10 ఫోన్లను ధ్వంసం చేశారని, వాటి వివరాలు చెప్పడం లేదని ఈడీ ఆరోపిస్తున్న తరుణంలో ఆమె ఇలా చేయడం గమనార్హం. వీటిని ఆమె ఈడీ అధికారులకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ► ఎమ్మెల్సీ కవిత మరికాసేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకోనున్నారు. మొత్తంగా మూడో రోజు విచారణకు హాజరుకానున్నారు. ఈడీ కార్యాలయానికి వెెళ్లే ముందు ఆమె ఢిల్లీలో న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత 10 ఫోన్లు వాడి, వాటిని ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. దీంతో ఆమె ఫోన్లను మీడియాకు చూపించే అవకాశం ఉంది. కాగా.. కవితను ఈనెల 11న 9 గంటల పాటు, 20న 11 గంటల పాటు ఈడీ విచారించింది. ఇవాళ కూడా గంటలపాటు ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. అరెస్టు చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. ► ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు మంగళవారం ఉదయం మళ్లీ విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించి తొలిసారిగా ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు, రెండోసారి సోమవారం సుదీర్ఘంగా 11 గంటల పాటు ప్రశ్నించారు. 11న జరిగిన విచారణకు కొనసాగింపుగా పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ముఖ్యంగా సౌత్ గ్రూపు లావాదేవీలు, ఈ కేసులో నిందితులుగా ఉన్న వారితో హైదరాబాద్, ఢిల్లీ హోటళ్లలో సమావేశమయ్యారనే ఆరోపణలపై ప్రశ్నించినట్లు తెలిసింది. కవిత ఒక్కరినే..! ఉదయం కవిత బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ పిళ్లైతో కలిపి, ఆ తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ కమ్యూనికేషన్ల ఇన్చార్జి విజయ్ నాయర్లతో కలిపి విచారించారనే వార్తలు వచ్చినప్పటికీ.. కవిత ఒక్కరినే ప్రశ్నించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అరుణ్ పిళ్లైనుంచి పదిసార్లకు పైగా వాంగ్మూలాలు సేకరించిన ఈడీ.. ఆయా వాంగ్మూలాల్లో కవిత ప్రస్తావన ఉన్న అంశాలపై ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. మద్యం వ్యాపారంలో పిళ్లై వాటా 32.5 శాతానికి గానూ ఎంత పెట్టుబడి పెట్టారు? కిక్ బ్యాక్‌ల రూపంలో వెనక్కి ఏ మేరకు వచ్చింది? పిళ్లైతో కలిసి ఇతర రాష్ట్రాల్లోనూ వ్యాపారం విస్తరించాలనుకోవడం? తదితర ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీఎం కేజ్రీవాల్, నాటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలతో ఏయే అంశాలు చర్చించారని కూడా అడిగినట్లు సమాచారం. ఢిల్లీ, హైదరాబాద్ హోటళ్ల నుంచి తెప్పించిన పలు రికార్డులు ముందుపెట్టి, ఆయా సమావేశాల్లో ఏమేం మాట్లాడారని ప్రశ్నించినట్లు తెలిసింది. -
మంత్రిని ప్రశ్నించినందుకు యూట్యూబర్ అరెస్టు!
రాష్ట్రమంత్రి గ్రామంలో పర్యటించడంతో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులు గురించి నిలదీశాడు ఓ యూట్యూబర్. అంతే మరుసటిరోజే నేరస్తుడి మాదిరిగి చేతులకు తాడుకట్టి మరీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. పైగా అతను శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడంటూ కేసులు సైతం నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..'మొరాదాబాద్ ఉజ్జల' అనే యూట్యూబ్ ఛానెల్‌ని నిర్వహిస్తున్న సంజయ్ రాణా అనే వ్యక్తి తమ గ్రామానికి వచ్చిన రాష్ట్రమంత్రిని అభివృద్ధి పనులు గురించి ప్రశ్నించాడు. వాస్తవానికి సంభాల్ జిల్లాలలో బుద్‌నగర్ ఖండూవా గ్రామంలోని చెక్‌డ్యామ్ శంకుస్థాపన కోసం స్థానిక ఎమ్మెల్యే తోపాటు సెకండరీ ఎడ్యుకేషన్ రాష్ట్ర మంత్రి గులాబ్ దేవిని గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా సంజయ్ వారిని ప్రశ్నించడమే గాక, అందుకు సంబంధించిన వీడియోని కూడా నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో మరుసటి రోజే అతనిపై స్థానిక బీజేపీ యువజన విభాగం నాయకుడు శుభం రాఘవ్ చందౌసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యూట్యూబ్ ఛానెల్ గుర్తింపు కార్డు, మైక్రోఫోన్ కలిగి ఉన్న నకిలీ జర్నలిస్ట్ అని, ప్రభుత్వ పనికి అంతరాయం కలిగించేలా దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగాడని ఆరోపణలు చేశాడు. అయితే ఆ వీడియోలో యూట్యూబర్ ఆ మంత్రిని మీరు రోడ్డు, గుడి బాగు చేస్తానని చెప్పారు. దీని గురించి ఏం చెబుతారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆలయంలో ప్రమాణం చేశారు. ఎన్నికల్లో గెలిపించమని సాయం కోరారని అడిగారంటూ మంత్రిని నిలదీశాడు. यूपी के संभल में पत्रकार संजय राणा ने मंत्री गुलाब देवी से तीखे सवाल पूछे, जवाब में पहले FIR फिर गिरफ्तारी हो गई. जिस किसी को श्री राहुल गांधी के लोकतंत्र के कमज़ोर होने वाले वक्तव्य पर आपत्ति है - पढ़िए यह खबरpic.twitter.com/jsnkH6zWle — Supriya Shrinate (@SupriyaShrinate) March 13, 2023 దీంతో ఆ మంత్రి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని వీడియో చివరలో చెబుతున్నట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మేరకు ఈ సంఘటనను లక్ష్యంగా చేసుకుని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. విదేశీ గడ్డపై కాంగ్రస్ నాయకుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్నే యాదవ్ ప్రస్తావిస్తూ.. బీజేపీ దీనికి ఏం చెబుతుందని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఇలానే ఉంటుంది అనడానికి ఇదే ఉదహరణ అంటూ సదరు యూట్యూబర్‌ని అరెస్టు చేసిన వీడియోలను సైతం ట్వీట్ చేశారు అఖిలేష్ యాదవ్. కాగా ఆ యూట్యూబర్‌కి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వడంతో అతన్ని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. विदेशी धरती पर भारत में लोकतंत्र की स्थिति पर बयान देने पर बवाल मचाने वाली भाजपा उप्र के संभल में इस पत्रकार की हालत भी देख ले, जिसे विकास कार्यों पर भाजपाई मंत्री से पूछे गए सवाल के कारण हिरासत में ले लिया गया है। ये है भाजपा सरकार में लोकतंत्र व अभिव्यक्ति की आज़ादी की तस्वीर। pic.twitter.com/smhanrvILb — Akhilesh Yadav (@yadavakhilesh) March 14, 2023 (చదవండి: వేలాది మంది రైతులు ముంబై వైపుగా పాదయాత్ర..) -
లాలూను ప్రశ్నించనున్న సీబీఐ
ఢిల్లీ: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ను నేడు సీబీఐ ప్రశ్నించనుంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థ ఇదివరకే ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. సోమవారం ఆయన సతీమణి రబ్రీదేవిని సీబీఐ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్నంతా పాట్నాలో ఆర్జేడీ వర్గాలు ధర్నాకు దిగగా.. ఇవాళ ఆ ఆందోళనలను కొనసాగించాలని నిర్ణయించాయి. 2008-09 మధ్య రైల్వే బోర్డు రిక్రూట్మెంట్లకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఐఆర్సీటీసీలో గ్రూప్ డీ సంబంధిత పోస్టులను దొడ్డిదోవన కొందరికి కట్టబెట్టినట్లు తేల్చింది. ఆ సమయంలో రైల్వే మంత్రిగా లాలూ ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పించినందుకుగానూ.. కొంతమంది అభ్యర్థుల నుంచి కారుచౌక ధరకే భూములు పొందారన్న అభియోగాలు లాలూ కుటుంబ సభ్యులపైనా నమోదు అయ్యాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కిందటి ఏడాది మే నెలలో సీబీఐ కేసు నమోదు చేసి.. అక్టోబర్ నెలలో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మీసా, హేమలతో పాటు మరికొందరి పేర్లను చేర్చింది. మరోవైపు భూములు అప్పజెప్పి.. ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న 12 మంది పేర్లను సైతం ఎఫ్ఐఆర్లో సీబీఐ చేర్చింది. ఈ మేరకు సోమవారం రబ్రీ దేవిని సుమారు ఐదు గంటలపాటు ప్రశ్నించి, ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు సీబీఐ అధికారులు. ఆ సమయంలో బయట ఆర్జేడీ వర్గాలు ఆందోళన చేపట్టాయి. ఇక ఈ స్కాంకు సంబంధించి గతంలో లాలూకు ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పని చేసిన భోళా యాదవ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే లాలూ కుటుంబాన్ని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి పొందింది సీబీఐ. ఇదిలా ఉంటే.. వారం కిందట ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం ఢిల్లీ కోర్టులో లాలూ, ఇతరులు హాజరయ్యారు కూడా. గత కొంతకాలంగా లాలూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్ది నెలల క్రితం సింగపూర్‌లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. -
టికెట్ ఎందుకు బుక్ చేశారు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సిట్ పలువురికి 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమీప బంధువు, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్ సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరయ్యారు. సిట్ సభ్యులైన సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) కళ్మేశ్వర్, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ వేర్వేరుగా సాయంత్రం 6:30 గంటల వరకూ ఆయనను సుమారు 8 గంటలపాటు విచారించారు. శ్రీనివాస్ ఫోన్ కాల్‌డేటాతోపాటు, ఆయన బ్యాంక్ ఖాతా వివరాలను పరిశీలించి, వాటిపై పలు సందేహాలు లేవనెత్తినట్లు సమాచారం. గత నెల 26న నలుగురు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలతో హరియాణాకు చెందిన రామచంద్రభారతి, హైదరాబాద్ వ్యాపారి నందుకుమార్, తిరుపతి స్వామి సింహయాజీలు రహస్య మంతనాలు జరుపుతుండగా.. పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. అదేరోజు మధ్యాహ్నానికి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ ఇండియా విమాన టికెట్‌ను బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అసలు సింహయాజీతో మీకున్న సంబంధం ఏంటని అధికారులు శ్రీనివాస్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. సింహయాజీతో పూజలు చేయించడం కోసమే ప్రత్యేకంగా టికెట్ బుక్ చేశానని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అలాగే శ్రీనివాస్ ఫోన్లోని యూపీఐ లావాదేవీల జాబితాను ముందు పెట్టి విచారించారు. కాగా, విచారణలో శ్రీనివాస్ ఓ జాతీయ పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లు వెల్లడించినట్టు సమాచారం. దీంతో వారికీ 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. అరగంట ఫోన్లో ఏం మాట్లాడారు? తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ మొదటిది కానుంది. నోటీసులు జారీ చేసిన నలుగురిని విచారించేందుకు 16, 17 అంతస్తుల్లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. విచారణకు హాజరయ్యే వారి ప్రతి కదలిక, హావభావాలు, విచారణ సమయంలో సిట్ ప్రశ్నలు, రాబట్టే సమాధానాలు, వారి స్పందన.. ఇలా అన్ని అంశాలూ స్పష్టంగా రికార్డయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు నందుకుమార్ ఫోన్‌ను విశ్లేషించగా.. గత నెల 26 కంటే ముందు అరగంట సేపు సెల్ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. ఆ సమయంలో ఏం మాట్లాడారు? 26న టికెట్లు బుక్ చేయాలని ఎవరైనా కోరారా? అని లోతుగా విచారించినట్లు సమాచారం. ఇదిలాఉండగా.. శ్రీనివాస్ నుంచి సంతృప్తికర సమాధానాలు రాబట్టలేని అధికారులు.. మంగళవారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇదీ చదవండి: సామాన్యుడి కోసం ధర్మపీఠం -
గృహహింస కేసు.. విచారణకు గడువు కోరిన నటుడు
తమిళసినిమా: బుల్లితెర నటుడు అర్ణవ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావడానికి గడువు కోరాడు. వివరాల్లోకి వెళితే.. బుల్లితెర జంట అర్ణవ్, దివ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల తన భర్త తనని కొట్టి, చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ స్థానిక పోరర్ మహిళా పోలీసుస్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో గృహహింస, హత్య బెదిరింపులు విభాగాల్లో కేసు నవెదు చేసి, విచారణ చేపట్టారు. అందులో భాగంగా నటుడు అర్ణవ్‌ను విచారణకు రావాల్సిందిగా పలుమార్లు సమన్లు పంపినా అతను హాజరు కాలేదు. చివరిగా శుక్రవారం హాజరు కావాలని లేని పక్షంలో అరెస్టు చేయాల్సి ఉంటుందని సమన్లు జారీ చేశారు. అయితే అర్ణవ్ పరారీలో ఉన్నట్లు, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కంటికి గాయం కారణంగా తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని, అందువలన విచారణకు హాజరు కావడానికి గడువు కావాలని, ఈ నెల 18వ తేదీన హాజరవుతానని తన న్యాయవాది ద్వారా ఓ లేఖను పోలీసులకు పంపారు. దీంతో అతనిపై చర్యలు తీసుకునే విషయమై పోలీసులు అధికారులు చర్చలు జరుపు తున్నారు. -
అనన్యపాండే మొబైల్, ల్యాప్‌టాప్ సీజ్
Ananya Pandays Mobile, Laptop Seized : బాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు కుదిపేస్తుంది. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ అనన్య పాండే ఎన్సీబీ ఎదుట హాజరయ్యింది. తండ్రి, నటుడు చంకీ పాండేతో కలిసి ఆమె ఎన్సీబీ కార్యాలయానికి చేరుకుంది. ఈరోజు ఉదయం అనన్య ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు ఆమె ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు. ఈనెల 2న జరిగిన క్రూయిజ్ రేవ్ పార్టీలో డ్రగ్స్ కావాలని ఆర్యన్.. అనన్యకు వాట్సప్ చాట్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చాట్‌లో లైగర్ భామ అనన్యతో పాటు ఆర్యన్ సోదరి సుహానా ఖాన్ కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా స్టార్ హీరోల పిల్లలు కావడంతో అందరికి ఓ కామన్ వాట్సాప్ గ్రూప్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే అనన్య బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతుంది. తెలుగులోనూ విజయ్ దేవరకొండ సరసన లైగర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది. చదవండి: నన్ను క్షమించండి డాడీ.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్! బెస్ట్‌ఫ్రెండ్‌తో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన సమంత -
ప్రశ్నను చంపేవాడే దేశద్రోహి
హత్యకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపడం. రేప్ కన్నా ప్రజలను భజనపరులుగా మార్చడం, లించింగ్ అనే మూకుమ్మడిహత్యలకన్నా ప్రశ్నించే తత్వాన్ని హత్య చేయడం తీవ్రమైన నేరాలు. పరస్పర ద్వేషాలను రగిలించే విధానాలు అనుసరిస్తూ లించింగ్ సరైనదే అని పరోక్షంగా నేర్పే రాజకీయులు, రాజకీయాలే అసలైన నేరగాళ్లు. రాజకీయ పార్టీలను ప్రశ్నించడం ప్రజాస్వామిక బాధ్యత. కాళోజీ అన్నట్టు అప్పుడే అతను పౌరుడవుతాడు లేకపోతే పోరడు. కానీ అదే అడిగితే? అడిగిన వాడిపై దాడి చేయడం, వేటాడడం, దొంగకేసులు పెట్టడం, పాతకేసులు తవ్వడం, లేదా చెత్తకేసుల్లో ఇరికించడం దారుణాలు. కనిపిం చని హంతకులు చేసే అదృశ్య హత్యలు ఇవి. న్యాయంగా కేసులు నిర్ధారించిన జడ్జీలను కూడా వేధించడం, విభేదించిన వాడిని బాధించడం, నేరవిచారణ అధికారులమీదే నేరాలు బనాయించడం, కిందిస్థాయి అవినీతి పరులను కలుపుకుని తిరుగుబాట్లు చేయించి, వ్యవస్థలను ధ్వంసంచేయడం, మూకుమ్మడి అత్యాచారాలే. కాకతీయ యూనివర్సిటీలో ప్రజాకవి పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు ఎండోమెంట్ ప్రసంగం చేయాలని పిలిచారు. కాళోజీ వ్యక్తిత్వానికి సరిపోయే చర్చనీయాంశం ఏదంటే ‘ప్రజాస్వామ్యం, ప్రశ్నించే తత్వం’ కాక మరేది. ‘ప్రజలను చంపే అధికారం ఎవరిచ్చార్రా వెంగళ్రావ్’ అంటూ నినదించిన గొంతు ఆయనది. అదీ ఎక్కడ.. వెంగళరావు సీఎం హోదాలో సత్తుపల్లిలో అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న చోట. ముఖ్యమంత్రిగా కొనసాగడం కోసం వెంగళ్రావ్ పోటీ చేస్తే, కాళోజీ కేవలం ప్రశ్నించడం కోసం పోటీచేసినాడు. గెలిచింది సీఎంయే కానీ ప్రజాప్రతినిధి కావలసిన వ్యక్తి కాదు. ఓడింది ప్రజాస్వామ్యమేగాని కాళోజీ కాదు. బూటకపు ఎన్కౌంటర్లు జరిపించిన తొలి ఎమ ర్జెన్సీ సీఎం అని గొంతెత్తి చెప్పడమే విజయం. తిడితే తిట్టనీ, అడిగితే అడగనీ అని జలగం వెంగళరావు అడిగేవాడిని అడగనిచ్చాడు. జవాబు ఇవ్వలేకపోయినా. పోటీచేస్తే చేయనీ, అని పోటీ చేయనిచ్చాడు. రాజును రోజూ తిడుతున్నా రాజద్రోహం కేసు పెట్టించలేదు. జలగం ఎంత గొప్పవాడు? కాళోజీ ఇప్పుడు బతికి ఉంటే, అప్పుడెప్పుడో సత్తుపల్లిలో ప్రశ్న వేసినందుకు 2019లో రాజద్రోహం కేసు కింద అరెస్టయి పుణే ఎరవాడ జైల్లో వరవరరావుతోపాటు ఉండేవాడేమో?. కాళోజీ వంటి సెలబ్రిటీ వ్యక్తులు 49 మంది ఈమధ్య చేసిన నేరం ఏమంటే ప్రశ్నించడం. గుంపు హత్యలు ఈ దేశ పరువును ప్రతిష్ఠను ధ్వంసం చేస్తున్నాయని వారు విమర్శించారు. లించింగ్‌లు జరగకుండా చూడలేరా అని అడిగితే దేశ ద్రోహం ఏ విధంగా అవుతుందో చెప్పగలరా ఎవరైనా? గతవారం ముజఫ్ఫర్ పూర్ చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ గారికి 49 మంది కళాకారులు మేధావులు ప్రధానికి రాసిన ఈ లేఖలో దేశద్రోహపు రంగులు, కాంతులు, పొగలు, పగలు కనిపించడం ఆశ్చర్యకరం. దేశ ద్రోహం కేసు రిజిస్టర్ చేయాలని ఆదేశించిన ఆ న్యాయాధికారిగారి దృక్పథం ఇదా అని దేశం మ్రాన్పడిపోయింది. మరో 185 మంది సమాజశ్రేయోభిలాషులు అక్టోబర్ 8న ఆ ఉత్తరాన్ని సమర్థిస్తూ మరోలేఖ వ్రాసారు. వారిమీద కూడా దేశద్రోహం కేసు పెడతారా? అయితే ఈ అవివేకపు కారు చీకటిలోనూ కొంత వెలుగు కనిపించింది. బిహార్ స్పెషల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ కుమార్ దేశద్రోహపు ఆరోపణ చేసే ఈ ఫిర్యాదును బుట్టదాఖలుచేయాల్సిందే అని నిర్ణయించడంలో వివేకం విజ్ఞత ఇంకా బతికున్నాయనే ఆశాభావం కన్నుతెరిచింది. న్యాయాధికారి చూడలేకుండాపోయిన నిజాలు పోలీసు అధికారికి సులువుగా కనిపించాయి. ఇది దురుద్దేశపూరితంగా చేసిన తప్పుడు ఫిర్యాదు, దేశద్రోహం ఆరోపణ పైన విచారించడానికి అణుమాత్రం ఆధారంకూడా లేదు అని మనోజ్ కుమార్ వివరించారు. ఈ ఫిర్యాదు చేసిన ఓఝా అనే వ్యక్తి పిటిషన్ పైన జడ్జిగారు జారీ చేసిన ఆదేశం మేరకు కేసు రిజిస్టర్ చేయవలసి వచ్చిందని మరో ఉన్నతాధికారి చెప్పాడు. ‘‘ఒరేయ్ ప్రశ్నించేవానికి, ప్రశ్నకు కూడా ద్రోహం చేస్తావ్ రా ఎన్ని గుండెలు నీకు? అయితే నువ్వేరా దేశద్రోహివి, ఇది తెలిసినోడేరా అసలైన దేశభక్తుడు’’ అని కాళోజీ ఇప్పుడు ఉంటే అనేవాడేమో. - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
లండన్‌లో ఆస్తులు లేవన్న వాద్రా
సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ విచారణకు హాజరైన ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తనకు లండన్‌లో ఎలాంటి ఆస్తులూ లేవని దర్యాప్తు సంస్థకు తెలిపారు. లండన్‌లో వాద్రా స్ధిరాస్తుల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు, ఆస్తుల వివరాలపై బుధవారం ఆయనను ప్రశ్నించిన ఈడీ మనీల్యాండరింగ్ చట్టం కింద వాద్రా స్టేట్మెంట్ను రికార్డు చేసింది. లండన్‌లో తన తరపున ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు చక్కబెట్టిన మనోజ్ అరోరా గురించి ఈడీ ప్రశ్నించగా అరోరా గతంలో తన వద్ద పనిచేసిన ఉద్యోగిగా తెలుసని, ఆయన తన తరపున ఎలాంటి ఈమెయిల్స్ రాయలేదని ఈడీ అధికారులతో తెలిపారు. వాద్రాకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన అరోరా వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ఎల్ఎల్పీ ఉద్యోగి. కాగా ఆర్థిక అవకతవకల ఆరోపణలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బావ, ప్రియాంక భర్త వాద్రా దర్యాప్తు సంస్ధల ఎదుట హాజరవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా అంతకుముందు వాద్రాను ప్రియాంక గాంధీ ఈడీ కార్యాలయం వద్ద డ్రాప్ చేసి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టేందుకు నేరుగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. టొయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనంలో ఎస్పీజీ భద్రత నడుమ వాద్రా దంపతులు మధ్య ఢిల్లీలోని జామ్‌నగర్ హౌస్‌లోని ఈడీ కార్యాలయం చేరుకున్నారు. -
ప్రశ్నించడం మంచి కల్చర్ కాదా?
న్యూఢిల్లీ: ప్రశ్న...ప్రశ్న...ప్రశ్న నుంచే ప్రపంచం ఇంతగా అభివద్ధి చెందిందని, ప్రశ్నతోనే మానవ వికాసం ప్రారంభమైందని కారల్ మార్క్స్ నుంచి ఖగోళశాస్త్రవేత్తల వరకు చెప్పారు. నేటి విజ్ఞాన సర్వస్వానికి ప్రశ్ననే ప్రాతిపదికని విజ్ఞులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. మరి మన కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి కిరణ్ రిజీజుకు మాత్రం ప్రశ్నించడమంటే అదో చెడ్డ అలవాటన్నది అభిప్రాయం. ‘తొలుత మనమంతా సందేహించడం, అధికారులను, పోలీసులను ప్రశ్నించడం మానుకోవాలి. ఇది ఎంతమాత్రం మంచి సంస్కతి కాదు. ఎప్పటి నుంచో మన భారతీయులు అనవసరంగా సందేహించడం, ప్రశ్నించడం అలవాటు చేసుకున్నారు’ అని రిజీజు మంగళవారం ఏర్పాటు చేసిన ఓ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. భోపాల్‌లో జరిగిన ఎనిమిది మంది సిమీ కార్యకర్తల ఎన్‌కౌంటర్‌పై నెలకొన్న సందేహాలను నివత్తి చేసుకోవడానికి విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన ఇలా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించడం ప్రాథమిక హక్కనే విషయాన్ని కూడా ఆయన విస్మరించారు. సోమవారం నాడు జరిగిన సిమీ కార్యకర్తల ఎన్కౌంటర్ వివాదాస్పదం అవడం, రాజకీయ నాయకులు, అధికారులు చెబుతున్న కథనాలకు మధ్య పొంతన ఉండకపోవడం, నిర్జీవులపైకి కాల్పులు జరపుతున్న దశ్యాలు, లొంగిపోతామని చేతులూపుతున్న నిరాయుధులపై పోలీసులు కాల్పులు జరుపుతున్న వీడియో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో పలు సందేహాలు, పలు ప్రశ్నలు తలెత్తిన విషయం తెల్సిందే. ప్రశ్నించడం ద్వారానే పత్రికా రంగంలో రాణించిన జర్నలిస్టులకు ప్రతి ఏటా ఇస్తున్న గోయెంకా ఎక్స్‌లెన్స్ అవార్డులు బుధవారం ప్రదానం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తన కేబినెట్లోనే ప్రశ్నించడం మంచి అలవాటుకాదన్న మంత్రి ఉన్నారన్న విషయం తెలుసా? -
ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి
వినియోగదారుల రక్షణ మండలి సమావేశంలో కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్ : వినియోగదారులు హక్కులతో పాటు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలñ క్టర్ మాట్లాడుతూ ప్రజలు వినియోగదారుల పాత్ర పోషిస్తున్నప్పుడు తాము కొనుగోలు చేస్తున్న వస్తువుల నాణ్యతను పరిశీలించాలన్నారు. వస్తువు నాణ్యతాప్రమాణాలు, వస్తువుకు సంబంధించిన బిల్లును పరిశీలించినప్పుడే విక్రయదారుడిని ప్రశ్నించగలుగుతామని చెప్పారు. వినియోగపు వస్తువుల్లో నాసిరకం, కల్తీ వస్తువులు, తూకంలో తగ్గుదల వంటి ఫిర్యాదులను వినియోగదారుల ఫోరం బాధ్యులు సంబంధిత శాఖల అధికారులకు అందిస్తే విక్రయదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రతిరోజు ఉపయోగించే పాలు, వంటనూనెలు, పెట్రోల్, ఆహార ధాన్యాల్లో కల్తీ, నాసిరకం వస్తువులను పూర్తి అరికట్టేందుకు వినియోగదారులు ప్రమాణాలను పాటించాలని పేర్కొన్నారు. ఆర్టీసీ సేవలపై స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పిచ్చయ్య పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై స్పందిస్తూ బస్సుల్లో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో కూర్చునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆర్ఎంను కలెక్టర్ ఆదేశించారు. బస్టాండ్లలో ఏటీఎంల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, సిటీ బస్సుల ఏర్పాటు, పారిశుద్ధ్య పనులు, తాగునీరు, విలీన గ్రామాల్లో లైటింగ్ తదితర సమస్యలను సభ్యులు కలెక్టర్‌కు వివరించారు. జేసీ దివ్య మాట్లాడుతూ పౌరసరపరాలశాఖ వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హోటళ్లలో నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేలా తరచూ అధికారిక బృందాలు తనిఖీ చేస్తున్నాయని చెప్పారు. వంటనూనెలు, పెట్రోల్‌లో జరిగే కల్తీని అరికట్టేందుకు లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించి బాధ్యులపై కేసులు నమోదు చేస్తారని వివరించారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని వినియోగదారులు అమ్ముకుంటున్నారని, దీని ద్వారా సబ్సిడీకి నష్టం కలుగుతుందని, ప్రజలను చైతన్యం చేయాలని వినియోగదారుల ఫోరం సభ్యులు కోరారు. మినరల్ వాటర్ పేరుతో నడుస్తున్న అక్రమ వాటర్‌ప్లాంట్లపై దాడులు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు. సమావేశంలో డీఎస్ఓ ఉషారాణి, డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండలరావు, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. -
వారిని అరెస్టు చేయడం అంత కష్టమా?
ఇసుక మాఫియాపై ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్న అధికారులపై దాడులకు పాల్పడటం.. వారి వాహనాలను తగలపెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్న వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంపై హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. వివిధ ఘటనల్లో అధికారులపై దాడులు చేసిన వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించింది. వారిని అరెస్ట్ చేయడం అంత కష్టమా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని, ఇందుకు గాను స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమ భూముల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండటాన్ని ప్రశ్నిస్తున్న రైతులను ఇసుక మాఫియా హతమారుస్తోందని, అడ్డుకున్న అధికారులపై దాడులకు పాల్పడుతోందని, దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదని మహబూబ్‌నగర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్, హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ధర్మాసనం విచారించింది. -
స్టీఫెన్‌సన్‌తో మీరు మాట్లాడారా? లేదా?
-
’మద్యం ఆదాయం ’మత్తులా చంద్రబాబుని ఆకర్షిస్తోంది