మంత్రిని ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ అరెస్టు! | YouTuber Questions UP Minister Day After Charged And Arrest | Sakshi
Sakshi News home page

మంత్రిని ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ అరెస్టు..పైగా నేరస్తుడిలా..

Published Wed, Mar 15 2023 9:07 PM | Last Updated on Fri, Mar 17 2023 4:43 PM

YouTuber Questions UP Minister Day After Charged And Arrest - Sakshi

రాష్ట్రమంత్రి గ్రామంలో పర్యటించడంతో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులు గురించి నిలదీశాడు ఓ యూట్యూబర్‌. అంతే మరుసటిరోజే నేరస్తుడి మాదిరిగి చేతులకు తాడుకట్టి మరీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. పైగా అతను శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడంటూ కేసులు సైతం నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..'మొరాదాబాద్‌ ఉజ్జల' అనే యూట్యూబ్‌ ఛానెల్‌ని నిర్వహిస్తున్న సంజయ్‌ రాణా అనే వ్యక్తి తమ గ్రామానికి వచ్చిన రాష్ట్రమంత్రిని అభివృద్ధి పనులు గురించి ప్రశ్నించాడు. వాస్తవానికి సంభాల్‌ జిల్లాలలో బుద్‌నగర్‌ ఖండూవా గ్రామంలోని చెక్‌డ్యామ్‌ శంకుస్థాపన కోసం స్థానిక ఎమ్మెల్యే తోపాటు సెకండరీ ఎడ్యుకేషన్‌ రాష్ట్ర మంత్రి గులాబ్‌ దేవిని గ్రామానికి వచ్చారు.

ఈ సందర్భంగా సంజయ్‌ వారిని ప్రశ్నించడమే గాక, అందుకు సంబంధించిన వీడియోని కూడా నెట్టింట పోస్ట్‌ చేశాడు. దీంతో మరుసటి రోజే అతనిపై స్థానిక బీజేపీ యువజన విభాగం నాయకుడు శుభం రాఘవ్ చందౌసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యూట్యూబ్‌ ఛానెల్‌ గుర్తింపు కార్డు, మైక్రోఫోన్‌ కలిగి ఉన్న నకిలీ జర్నలిస్ట్‌ అని, ప్రభుత్వ పనికి అంతరాయం కలిగించేలా దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగాడని ఆరోపణలు చేశాడు. అయితే ఆ వీడియోలో యూట్యూబర్‌ ఆ మంత్రిని మీరు రోడ్డు, గుడి బాగు చేస్తానని చెప్పారు. దీని గురించి ఏం చెబుతారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆలయంలో ప్రమాణం చేశారు. ఎన్నికల్లో గెలిపించమని సాయం కోరారని అడిగారంటూ మంత్రిని నిలదీశాడు.

దీంతో ఆ మంత్రి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని వీడియో చివరలో చెబుతున్నట్లు కూడా స్పష్టంగా  కనిపిస్తుంది. ఈ మేరకు ఈ సంఘటనను లక్ష్యంగా చేసుకుని సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. విదేశీ గడ్డపై కాంగ్రస్‌ నాయకుడు రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్నే యాదవ్‌ ప్రస్తావిస్తూ.. బీజేపీ దీనికి ఏం చెబుతుందని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఇలానే ఉంటుంది అనడానికి ఇదే ఉదహరణ అంటూ సదరు యూట్యూబర్‌ని అరెస్టు చేసిన వీడియోలను సైతం ట్వీట్‌ చేశారు అఖిలేష్‌ యాదవ్‌.  కాగా ఆ యూట్యూబర్‌కి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ బెయిల్‌ ఇవ్వడంతో అతన్ని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

(చదవండి: వేలాది మంది రైతులు ముంబై వైపుగా పాదయాత్ర..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement