కుర్చీ తాత.. రెండు మూడు రోజుల క్రితం అరెస్ట్ అయ్యాడు. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన ఇతడు.. 'గుంటూరు కారం'లోని ఓ పాట వల్ల మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ సడన్‌గా కుర్చీ తాతని అరెస్ట్ చేశారనే విషయం నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. ఓ యూట్యూబర్ కేసు పెట్టడంతోనే ఇలా జరిగింది. ఇప్పుడు సదరు యూట్యూబర్.. కుర్చీ తాత బండారం మొత్తం బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: దిగ్గజ హీరోయిన్ కన్నుమూత.. కారణం ఏంటంటే?)
హైదరాబాద్‌లోని కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో బిచ్చమెత్తుకుంటూ బతికే ఈ ముసలాయన.. ఓ ఇంటర్వ్యూలో 'కుర్చీ మడతపెట్టి..' అనే బూతు డైలాగ్ చెప్పి అలా ఫేమస్ అయిపోయాడు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ పదాన్ని 'గుంటూరు కారం' కోసం తమన్ ఉపయోగించుకున్నాడు. అందుకు గానూ సదరు కుర్చీ తాతకు డబ్బులు కూడా ఇచ్చాడు. అయితే ఈ తాతకి గత కొన్నాళ్ల నుంచి సాయం చేస్తున్న వైజాగ్ సత్యనే ఈయనపై కేసు పెట్టాడు. అలానే అసలేం జరిగిందో మొత్తం చెప్పాడు.
'ఈయన(కుర్చీ తాత) అన్నం పెట్టిన వాడికే సున్నం పెట్టే టైప్. 'గుంటూరు కారం' సినిమాలోని పాటలో ఆయన డైలాగ్ పెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దగ్గరికి నేనే తీసుకెళ్లాను. తమన్‌తో మాట్లాడిన తర్వాత ఈ డైలాగ్ సినిమాలో పెట్టుకున్నారు. కుర్చీ తాతకు రూ.20 వేలు సాయం కూడా చేశారు. తర్వాత 'గుంటూరు కారం' స్పూఫ్ కాన్సెప్ట్‌తో తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేయించాను. వాళ్లు రూ.5 వేలు ఇచ్చారు. అలా చిన్న చిన్న ఇంటర్వ్యూలు అవి చేసుకుంటూ బాగానే సంపాదించుకున్నాడు. అక్కడితో హ్యాపీగా ఉన్నాడని అనుకున్నాం. కానీ మహేశ్ బాబు దగ్గరికి నన్ను తీసుకెళ్లు.. నాకు ఇల్లు ఇప్పించు, ప్లాట్ ఇప్పించు అని నన్ను సతాయించాడు'
(ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్)
'అయితే మహేశ్‌బాబు నీకెందుకు ప్లాట్ ఇస్తాడని కుర్చీ తాతతో నేను అన్నాను. 'గుంటూరు కారం'తో ఆయన రూ.300 కోట్లు సంపాదించాడు. నాకు ప్లాట్ ఇప్పించు అని నన్ను ఒకటే ఇబ్బంది పెట్టాడు. ఆయనెందుకు నీకిస్తారు. ఒకవేళ డబ్బులొచ్చిన ప్రొడ్యూసర్‌కి వస్తాయి గానీ ఆయనకు వస్తాయా అని అడిగాను. దీంతో పగబట్టి.. నా మీద బ్యాడ్ వీడియోలు చేశాడు. సత్య ఓ దొంగ, నా మీద లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు. వాడి కాలు తీసేస్తా, చేయి తీసేస్తా, వాడిని మర్డర్ చేసేస్తా.. మా సొంత బావమరిదినే కుర్చీ మడతపెట్టి చంపేసా అని పిచ్చిపిచ్చిగా వీడియోలు చేశాడు'
'ఇక కుర్చీ తాత మీద నాకు చిరాకొచ్చింది. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాను. దీంతో పోలీసులు.. కుర్చీ తాతని మడతపెట్టేశారు. తీసుకెళ్లి బాగా కోటింగ్ ఇచ్చారు. అయితే స్టేట్‌మెంట్‌లో మాత్రం.. వైజాగ్ సత్య చాలా మంచోడు, నా గాడ్ ఫాదర్ లాంటోడు.. కాకపోతే యూట్యూబర్సే నాకు మందు ఇచ్చి సత్యని తిట్టించారని చెప్పాడు. ఈ రోజు నుంచి ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు' అని యూట్యూబర్ సత్య చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా చూస్తుంటే కుర్చీ తాతకి కాస్త ఫేమ్ వచ్చేసరికి ఇగో ఎక్కువైపోయింది. దీంతో ఇన్నాళ్లు తన పక్కనున్న వాళ్లే అరెస్ట్ చేయించారు. అలానే పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇతడికి ఇచ్చినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: రూపాయి తీసుకోకుండా సినిమా చేయనున్న మహేశ్! కారణం అదేనా?)
Comments
Please login to add a commentAdd a comment