మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేశ్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసింది. అయితే ఈ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌పై నెట్టింట రీల్స్ కూడా తెగ వైరలయ్యాయి. ఎందుకంటే ఈ డైలాగ్ ఓ తాత చెప్పింది కావడంతో సినిమాకు క్రేజ్‌ను తీసుకొచ్చింది. అలాగే ఈ డైలాగ్ సినిమాలో పెట్టినందుకు కుర్చీ తాతకు లక్ష రూపాయలు సాయం కూడా అందించారు.
గుంటూరు కారం సినిమాలో కుర్చీని మడతపెట్టి సాంగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన కుర్చీ తాత.. తాజాగా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నటి స్వాతి నాయుడు, వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు కుర్చీ తాతని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తమను బూతులు తిడుతూ వీడియోలు చేస్తున్నారని.. తన డబ్బులు కాజేసి వైజాగ్ పారిపోయానని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని వైజాగ్ సత్య పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా.. కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. హైదరాబాద్‌లో కృష్ణ కాంత్ పార్క్ వద్ద ఉంటాడు. ఇతనికి భార్య, కొడుకులు, కూతురు ఉన్నారు. అయితే ఇంట్లో వాళ్లని పట్టించుకోకుండా ఇలా రోడ్లపైనే తిరుగుతుంటారు. అయితే యూట్యూబ్ ఛానల్స్ అతన్ని వైరల్ చేయడంతో పాపులర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment