లక్నో: ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఉన్న యూట్యూబర్ తస్లీమ్ ఇంటిపై జరిపిన దాడిలో రూ. 24 లక్షలను అధికారులు గుర్తించారు. అతను దాదాపు రూ. 1 కోటి వరకు సంపాదించినట్లు సమాచారం. కొన్నేళ్లుగా తస్లీమ్ యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్నాడు. కాగా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లు ఐటీ శాఖ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను అతని కుటుంబం తోసిపుచ్చింది.
తస్లీమ్, షేర్ మార్కెట్‌కు సంబంధించిన వీడియోలతో సంపాదిస్తున్నాడు. తనకు వచ్చే ఆదాయం బట్టి అతను ఇన్‌కం ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నట్లు అతని సోదరుడు పేర్కొన్నాడు. 'ట్రేడింగ్ హబ్ 3.0' అనే యూట్యూబ్ అకౌంట్‌ను తన సోదరుడు నిర్వహిస్తున్నాడని ఫిరోజ్ తెలిపారు. అతని యూట్యూబ్ ఆదాయం రూ.1.2 కోట్లపైన ఉండగా అందుకు సంబంధించి ఇప్పటికే రూ. 4 లక్షల పన్నులు చెల్లించారని ఆయన పేర్కొన్నారు.
"మేము ఎటువంటి తప్పుడు పని చేయడం లేదు. యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతూ.. దాని నుంచి చట్ట ప్రకారమే ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం, ఇది నిజం. ఒక కుట్ర ప్రకారమే ఐటీ దాడులు జరిగినట్టు అనిపిస్తోందని’ ఫిరోజ్ చెప్పాడు. తస్లీమ్ తల్లి తన కొడుకును తప్పుగా ఇరికించారని ఈ ఆరోపణలను కొట్టి పారేసింది.
చదవండి: వామ్మో.. ఈ మ్యాగీ కంటే బిర్యానీ బెటర్.. ధర చూసి షాకైన యూట్యూబర్!
Comments
Please login to add a commentAdd a comment