Actress Divya Loges Complaint Against Actor Arnav - Sakshi

Divya-Arnav: నాకు తెలియకుండా వేరే వ్యక్తితో కలిసి గర్భాన్ని తీసే ప్రయత్నం చేసింది: అర్ణవ్‌

Oct 8 2022 7:22 AM | Updated on Oct 8 2022 9:17 AM

Actress Divya loges Complaint Against Actor Arnav - Sakshi

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తపై బుల్లితెర నటి చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన దివ్య (35) చెన్నైలో నివసిస్తోంది. ఈమెకు 2012లో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. పాప కూడా ఉంది. అయితే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది.

టీవీ సీరియళ్లలో నటిస్తున్న క్రమంలో సహనటుడు అర్ణవ్‌తో పరిచయం ఏర్పడింది. దివ్య ఇస్లాం మతం తీసుకుని ఈ ఏడాది జూన్‌లో ఇద్దరూ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే ఆమెకు అంతకుముందే పెళ్లయిందని, ఒక కూతురు కూడా ఉందన్న విషయం అర్ణవ్‌కు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.

దివ్య తమ పెళ్లి ఫొటోలు, వీడియోలను పోస్టు చేసింది. వాటిని డిలీట్‌ చేయమని అర్ణవ్‌ ఆమెపై ఒత్తిడి చేశాడు. అందుకు దివ్య నిరాకరించడంతో ఆమెపై ఆవడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్య తనకు తెలియకుండానే వేరే వ్యక్తితో కలిసి గర్భాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి దివ్య గురువారం రాత్రి చెన్నై కమిషనర్‌ కార్యాలయంలో తన భర్తపై ఫిర్యాదు చేసింది.

అందులో తాము చట్ట ప్రకారం భార్యభర్తలుగా కాపురం చేస్తున్నామని అయితే తన భర్తకు వేరే నటితో సంబంధం ఉన్న విషయం తెలిసి తాను ఆమె నటిస్తున్న షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లి నిలదీశానని, దీంతో ఆమె తనను వాటర్‌ బాటిల్‌తో కొట్టిందని పేర్కొంది. తన భర్త కూడా తనపై దాడిచేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆరోపించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement