
భర్త తనని మోసం చేశాడంటూ ప్రోలీసులను ఆశ్రయించింది బుల్లితెర నటి దివ్వ శ్రీధర్. మరో నటితో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని కూడా తెలిపింది. పోలీసుల సమాచారం ప్రకారం.. సన్‌టీవీలో ప్రసారమయ్యే తమిళ సీరియల్ సెవ్వంధీతో దివ్వ శ్రీధర్ నటిగా గుర్తింపు పొందింది.
చదవండి: ‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల తల్లిపై కేసు
ఆ తర్వాత కేలడి కన్మణి సీరియల్లో తన సహానటుడైన ఆర్నవ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరు కొద్ది రోజులు రిలేషన్‌షిప్ ఉన్న అనంతరం సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. అయితే తమ వివాహన్ని అధికారికంగా ప్రకటించవద్దని ఆర్నావ్ దివ్యను కోరిటన్లు ఆమె పోలీసులకు పేర్కొంది. అదే సమయంలో అతడు మరో నటితో ప్రేమలో ఉన్నాడని, దీంతో తాను భర్తను నిలదీసి అందరి సమక్షంలో తనని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో కాంచీపురంలోని ఓ ఆలయంలో మళ్లీ పెళ్లి చేసుకున్నామని ఫిర్యాదులో పేర్కొంది.
చదవండి: మాల్దీవులకు చెక్కేసిన విజయ్, రష్మిక? ఫోటోలు వైరల్
ప్రస్తుతం తాను గర్భవతి అని, అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. తనతోపాటు పుట్టబోయే బిడ్డకు ఆర్నావ్ వల్ల ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. అంతేకాదు ఆర్నవ్ బలవంతంగా తనకు అబార్షన్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. తనకి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. అంతేకాదు ఈ విషయమై ఆమె కమిషనర్‌ను కూడా ఆశ్రయించినట్లు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment