Cheating husband
-
మరో నటితో భర్త వివాహేతర సంబంధం, పోలీసులను ఆశ్రయించిన నటి దివ్య
భర్త తనని మోసం చేశాడంటూ ప్రోలీసులను ఆశ్రయించింది బుల్లితెర నటి దివ్వ శ్రీధర్. మరో నటితో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని కూడా తెలిపింది. పోలీసుల సమాచారం ప్రకారం.. సన్‌టీవీలో ప్రసారమయ్యే తమిళ సీరియల్ సెవ్వంధీతో దివ్వ శ్రీధర్ నటిగా గుర్తింపు పొందింది. చదవండి: ‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల తల్లిపై కేసు ఆ తర్వాత కేలడి కన్మణి సీరియల్లో తన సహానటుడైన ఆర్నవ్తో ప్రేమలో పడింది. వీరిద్దరు కొద్ది రోజులు రిలేషన్షిప్ ఉన్న అనంతరం సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. అయితే తమ వివాహన్ని అధికారికంగా ప్రకటించవద్దని ఆర్నావ్ దివ్యను కోరిటన్లు ఆమె పోలీసులకు పేర్కొంది. అదే సమయంలో అతడు మరో నటితో ప్రేమలో ఉన్నాడని, దీంతో తాను భర్తను నిలదీసి అందరి సమక్షంలో తనని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో కాంచీపురంలోని ఓ ఆలయంలో మళ్లీ పెళ్లి చేసుకున్నామని ఫిర్యాదులో పేర్కొంది. చదవండి: మాల్దీవులకు చెక్కేసిన విజయ్, రష్మిక? ఫోటోలు వైరల్ ప్రస్తుతం తాను గర్భవతి అని, అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. తనతోపాటు పుట్టబోయే బిడ్డకు ఆర్నావ్ వల్ల ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. అంతేకాదు ఆర్నవ్ బలవంతంగా తనకు అబార్షన్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. తనకి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. అంతేకాదు ఈ విషయమై ఆమె కమిషనర్‌ను కూడా ఆశ్రయించినట్లు చెప్పింది. -
నిత్యపెళ్లికొడుకు మామూలోడు కాదు.. 13 మందిని శారీరకంగా వాడుకొని..
-
నిత్యపెళ్లికొడుకు మామూలోడు కాదు.. 13 మందిని పెళ్లి చేసుకొని..
ప్రేమ, పెళ్లి పేరుతో యువతులకు గాలం వేసి.. వారిని మోసం చేస్తున్న నిత్యపెళ్లికొడుకు అడప శివశంకర్ బాబును గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. శివశంకర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 మంది యువతులను పెళ్లిచేసుకున్నట్టు విచారణలో తేలింది. కాగా, హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడలో పలు సెక్షన్ల కింద పోలీసు స్టేషన్లలో శివశంకర్‌పై కేసులు నమోదయ్యాయి. అయితే, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన శివశంకర్‌బాబు(33) మ్యాట్రిమోనీ ద్వారా యువతులను టార్గెట్ చేస్తాడు. అనంతరం, వారికి ఏదో రకంగా తన బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుంటాడు. ఇలా పెళ్లి చేసుకుని వారిని శారీరకంగా, ఆర్థికంగా మోసం చేసి వారిని వదిలేస్తాడు. తర్వాత మరో మహిళకు గాలం వేసి పెళ్లి చేసుకుంటాడు. ఇలా దాదాపు 13 మంది యువతులను పెళ్లిచేసుకున్నాడు. కాగా, ఇటీవల హైదరాబాద్‌లో ఓ యువతిని పెళ్లిచేసుకున్నాడు. తర్వాత తనకు అమెరికా ఉద్యోగం వచ్చిందని వెంటనే అక్కడికి వెళ్లాలని భార్యను డబ్బుల కోసం వేధించాడు. ఈ క్రమంలో ఆమె.. భర్తకు రూ. 32 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత, శివశంకర్ బాబు మళ్లీ అమెరికా ఊసే ఎత్తలేదు. దీంతో, అనుమానం వచ్చిన.. భార్య అతడి గురించి ఆరా తీయగా ఇప్పటికే పెళ్లిళ్లు అయినట్టు గుర్తించింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఓ బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. నిత్యపెళ్లికొడుకు శివశంకర్ బాబును అరెస్ట్ చేసినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. అతడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. పరువు పోతుందనే భయంతో చాలా మంది మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. డబ్బుల కోసమే మహిళలను ట్రాప్ చేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. మహిళల జీవితాలతో ఆడుకుంటున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
నిద్రపోతున్న ప్రియుడిపై ప్రియురాలి దారుణం
తైపీ: తనతో సహజీవనం చేస్తున్న ప్రియుడు వేరే మహిళతో సంబంధంపెట్టుకోవడాన్ని ఆ మహిళ భరించలేకపోయింది. ప్రియుడికి ఎలాగైన బుద్ధి చెప్పాలనుకుంది. మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడి అంగాన్ని కోసేసి తన కోపాన్ని తీర్చుకొంది. ఈ ఘటన తైవాన్‌లోని చాంఘువా కౌంటీలోని జిహుటౌన్‌షిప్‌లో చోటుచేసుకుంది. 52 ఏళ్ల హువాంగ్ తన ప్రియురాలు పూంగ్తో కలిసి సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు. అయితే పుంగ్‌కు తన ప్రియుడు మరో మహిళతో సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో అతను రోజులాగే తాగి నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే పుంగ్ వంట గదిలోకి వెళ్లి ఒక పదునైన కత్తి తీసుకొని వచ్చి ప్రియుడి అంగాన్ని కొసేసింది. మత్తులో ఉన్న అతనికి నొప్పి తెలియలేదు. ఆ తర్వాత ఆమె దాన్ని బాత్రూంలో పడేసి ఫ్లష్ చేసింది. ఉదయాన్నే నిద్రనుంచి లేచిన హువాంగ్ అంగం వద్ద నొప్పిగా ఉండటంతో చూశాడు. ఆ తర్వాత బెడ్‌షిట్ అంతా రక్తపు మరకలే ఉన్నాయి. వెంటనే భయపడిపోయాడు. తన ప్రియురాలు కోసం అరిచాడు. ఆమె కనిపించలేదు. కాసేపు చుట్టుపక్కల తెగిపడిన అంగం కోసం వేతికాడు.. దొరకలేదు. వెంటనే ఆసుపత్రికి ఫోన్ చేశాడు. అంబులెన్స్ వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడికి డాక్టర్లు అత్యవసర చికిత్సను అందించారు. మూత్రం మార్గంలో ప్రత్యేకంగా సర్జరీ చేశారు. ఆ వ్యక్తికి మొదట ఈ పని ఎవరు చేశారో తెలియలేదు. అయితే, కొన్ని రోజులకు ఈ పనిచేసింది తన ప్రియురాలే అని తెలిసి ఆశ్చర్యపోయాడు. ‘తాను మద్యం మత్తులో ఉన్నప్పుడు తనపై అనుమానంతోనే ప్రియురాలు ఈ పని చేసిందని తెలుసుకొని షాక్‌కు గురయ్యాడు. ఆ ఘటన తర్వాత పుంగ్నేరుగా పోలీసులు దగ్గరికి వెళ్లి లొంగిపొయింది. తను తన ప్రియుడిపై అనుమానంతోనే ఈ పనిచేసినట్లు ఒప్పుకొంది. కేసు నమోదుచేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమన్నాడు.. పెళ్లాడాడు... పొమ్మన్నాడు...
నేలకొండపల్లి: అతడొక ఆర్ఎంపీ. ఆ ఊరు, ఈ ఊరు తిరుగుతూ వైద్యం చేస్తుంటాడు. ఓ విద్యార్థినిపై కన్నేశాడు. ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. ఆ తరువాత, ప్రేమిస్తున్నానన్నాడు. చాలా ‘దగ్గర’య్యాడు. గుడిలో రహస్యంగా పెళ్లాడాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత... వద్దు పొమ్మన్నాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆమె... అతడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. నేలకొండపల్లి మండలం రాయగూడెం గ్రామ యువకుడైన బొయిన చైతన్య, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం బలుసుపాడులో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వృత్తిరీత్యా అతనితో అందరూ చనువుగా ఉండేవాడు. మూడేళ్ల క్రితం, అదే గ్రామంలోని డిగ్రీ విద్యార్థిని గొడుగు సంధ్యపై కన్నేశాడు. ఆమెతో చనువు పెంచుకున్నాడు. ‘మనిద్దరం స్నేహితులమ’న్నాడు. ఆమె తలూపింది. ఆ తరువాత, ప్రేమిస్తున్నానన్నాడు. ఆమె నమ్మింది. ఇద్దరూ ‘దగ్గర’య్యారు. గత ఏడాది, ఖమ్మంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. తన ఫోన్ లో వేద మంత్రాల ఆడియో ఆన్ చేసి తాళి కట్టాడు. ఆమె గర్భవతయింది. అతడే అబార్షన్ చేశాడు. ఆ తరువాత ఇద్దరూ చెట్టపట్టాలేసుకసుని, పట్టపగ్గాల్లేకుండా తిరిగారు.గత నెల 21న బైక్‌పై జగ్గయ్యపేట వెళుతున్న వీరిద్దరిని ఆమె బంధువులు చూశారు. ఆమె ఇంటోళ్లకు తెలిసింది. వారు అతడిని నిలదీశారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు. అప్పటి నుంచి అతడు బలుసుపాడులో ప్రాక్టీస్ మానేశాడు. ఆమెను పట్టించుకోవడం లేదు. ‘నీ దారిన నువ్వు వెళ్లు. నాతో ఉండొద్దు. వెళ్లిపో...’ అంటున్నాడు. దీంతో, ఆమె ఆదివారం సాయంత్రం తన కుటుంబీకులతో కలిసి చైతన్య ఇంటికి వచ్చింది. ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనను భార్యగా స్వీకరించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించింది. చైతన్య, అతడి కుటుంబీకులు తమ ఇంటికి తాళం వేసుకుని ఎటో వెళ్లిపోయారు. ఆమె నుంచి వివరాలను ఎస్సై ఎన్.గౌతమ్ తెలుసుకున్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాడతా... ... అంటోంది సంధ్య. ‘‘నన్ను నమ్మించి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు, మనిద్దరికి ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు. నా జీవితాన్ని నాశనం చేశాడు. నాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాను. చైతన్యకు, నాకు.. పెద్దల సమక్షంలో మళ్లీ పెళ్లి చేయించాలి’’ అని డిమాండ్ చేస్తోంది. -
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
-
పరువు పోయింది.. రూ.334 కోట్లు కట్టాల్సిందే!
పారిస్: షికారుకు వెళ్లేందుకు భార్య ఫోన్ నుంచి ఓసారి క్యాబ్ బుక్ చేసిన పాపానికి అది విడాకులకు దారితీసిందని ఫ్రెంచి వ్యాపారవేత్త లబోదిబో మంటున్నాడు. ఇందుకు కారణమైన ఉబర్ క్యాబ్ సంస్థ తనకు నష్టపరిహారంగా 40 మిలియన్ పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు 335 కోట్ల రూపాయలు) నష్టపరిహారం చెల్లించాలని దావా వేశాడు. అసలు ఏం జరిగిందంటే.. దక్షిణ ఫ్రాన్స్ లోని కోట్ డీ అజర్ కు చెందిన ఓ వ్యాపారవేత్త ఓరోజు షికారుకు వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. భార్య మొబైల్ లో ఉన్న యాప్ తో ఓ ఈవెంట్ కి వెళ్లారు. ఆ తర్వాత భార్య మొబైల్ నెంబర్ నుంచి లాగ్ ఔట్ అయ్యాడు. అప్పటినుంచి ఆ బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నా.. అతడి భార్య మొబైల్స్ కు అప్ డేట్స్ వెళ్తున్నాయి. కొన్ని రోజుల వరకు భార్య ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ బిజినెస్ పని మీద ఉండే భర్త తరచుగా కొన్ని ప్రదేశాలకు వెళ్తున్నాడని గ్రహించింది. ఉబర్ క్యాబ్ అప్లికేషన్ సాంకేతిక లోపం వల్ల భార్య తనను అనుమానిస్తోందని ఆరోపించాడు. చివరికి ఇద్దరి మధ్య అంతరం పెరిగిపోయి విడాకులు ఇచ్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన పరువు పోయిందని, ఇందుకు కారణమైన ఉబెర్ సంస్థ తనకు 335 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆ వ్యాపారవేత్త కోర్టుకెక్కాడు. తొలిసారి లాగిన్ డాటాతో తాను ఎక్కడ యాప్ వాడినా తన భార్య మొబైల్ కు మెస్సేజ్ వెళ్లడమే తమ మధ్య గొడవలకు కారణమైందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉబర్ మాత్రం ఈ విషయంపై ఏ విధంగానూ స్పందించలేదు. -
ప్రియుడు మాట వినలేదని.. కోసిపారేసింది!
తనతో సరదాగా గడిపే ప్రియుడు తనకు మాత్రమే పరిమితం అవ్వాలని ఆమె అనుకుంది. కానీ, అతడు ఇంట్లో ఇల్లాలితోను, హోటల్లో ప్రియురాలితోను ఇద్దరితో సంబంధాలు నడిపిస్తున్నాడు. ఈ విషయమై ప్రియురాలికి కోపం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా పెళ్లాన్ని విడిచిపెట్టకుండా అలాగే ఉంటావా అంటూ.. ఓ కత్తెర తీసుకుని.. అతడి మర్మాంగాన్ని కోసిపారేసింది. ఈ ఘటన చైనాలో జరిగింది. లియు (50) అనే ఆ వ్యక్తి ఓ హోటల్ రూం బుక్ చేసుకుని, అక్కడ ఎప్పటిలాగే తన ప్రియురాలితో కలిసి ఉన్నాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ ఎలా మొదలైందో తెలియదు గానీ.. కాసేపటికే ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారని హోటల్ సిబ్బంది చెప్పారు. ఇంకొంచెం సేపు అయిన తర్వాత.. సదరు ప్రియుడు అండర్వేర్ వేసుకునే గగ్గోలు పెడుతూ.. డాక్టర్.. డాక్టర్ అని అరుస్తూ రోడ్డు మీదకు పరుగు లంకించుకున్నాడు. తీరా విషయం ఏంటని చూస్తే, ఆమె కత్తెర తీసుకుని అతడి మర్మాంగాన్ని కట్ చేసేసింది. తాను తన భార్యను వదిలే ప్రసక్తి లేదని అతడు చెప్పడం వల్లే ఇలా జరిగిందని ఆ తర్వాత తెలిసింది. ఇంతపని చేసిన ప్రియురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
భర్తను చెప్పుతో చితక్కొట్టిన భార్య
-
మొగుడిని రెడ్ హ్యాండడ్‌గా పట్టుకుంది