Tamil Actor Arnav Marry Transgender Before Divya And Cheated Her Too, Details Inside - Sakshi
Sakshi News home page

Actress Divya-Arnav Case: దివ్య కంటే ముందు ట్రాన్స్‌జెండర్‌తో అర్నవ్‌ ప్రేమ, పెళ్లి.. బయటకొచ్చిన ఆడియో

Published Mon, Oct 17 2022 4:32 PM | Last Updated on Mon, Oct 17 2022 7:15 PM

Tamil Actor Arnav Marry Transgender Before Divya And Cheated Her Too - Sakshi

బుల్లితెర నటులు దివ్య, అర్నవ్‌ కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. తన భర్తకు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని, తనని మోసం చేశాడంటూ అర్నవ్‌పై దివ్య ఇటీవల ఆరోపణలు చేయగా.. తన భార్యకు మతిస్థిమితం సరిగా లేదంటూ అతడు షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. అయితే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండంతో ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా దివ్య కంటే ముందు అర్నవ్‌ తనని పెళ్లి చేసుకున్నాడంటూ ప్రియదర్శిని అనే ట్రాన్స్‌జెండర్‌ సంచలన ఆరోపణలు చేసింది.

చదవండి: భర్త జయంతి.. ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన నటి మేఘన

ఈ మేరకు ఆమె ఓ ఆడియో రికార్డ్‌ను రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఆడియో రికార్డ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మలయాళంలో ఉన్న ఈ ఆడియోలో ప్రియాంక ఏం చెప్పుకొచ్చిందంటే.. ‘నాకు, అర్నవ్‌తో టీ నగర్‌లో పరిచయం ఏర్పడింది. మా పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారింది. దీంతో ఇద్దరం ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ల పాటు ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం.

మా వైవాహిక జీవితం చాలా హ్యాపీగా సాగింది. అయితే ఉన్నట్టుండి అర్నవ్‌లో సడెన్‌గా మార్పు వచ్చింది. తరచూ నన్ను వేధించడం మొదలు పెట్టాడు. అయితే అతడికి మరో మహిళతో పరిచయం వల్లే నన్ను వేధించడం స్టార్ట్‌ చేశాడు. నన్ను తీవ్రంగా హింసించాడు. ఎనిమిదేళ్లు అతడి వేధింపులు భరించాను. అర్నవ్‌ ఓ సైకో’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
చదవండి: విష్ణు నన్ను అలా అనడంతో షాకయ్యా: మంచు మోహన్‌ బాబు

ఇక అతడి వేధింపులు తట్టుకోలేక తాను అర్నవ్‌ నుంచి విడిపోయానంటూ ప్రియదర్శిని తెలిపింది. ఇదిలా ఉంటే కేలాడి కన్మణి అనే సీరియల్‌ షూటింగ్‌లో సమయంలో నటి దివ్య, అర్నవ్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో 2022 జూన్‌ 29న హిందూ సాంప్రదాయం ప్రకారం వారు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భంగా దాల్చింది. ఇప్పుడు అర్నవ్‌ తనని వదిలేసి మరో నటితో క్లోజ్‌గా ఉంటున్నాడంటూ దివ్య ఇటీవల పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement