Actress Arya Parvathi responds on her 47 years old mom pregnant - Sakshi
Sakshi News home page

Actress Arya Parvathi: 47 ఏళ్ల వయసులో తల్లి ప్రెగ్నెంట్‌.. స్పందించిన నటి.. ‘అమ్మను పట్టుకుని ఏడ్చాను’

Published Wed, Mar 22 2023 11:39 AM | Last Updated on Wed, Mar 22 2023 12:11 PM

Actress Arya Parvathy Respond On Her 47 Years Old Mom Pregnant - Sakshi

తన తల్లి కారణంగా మలయాళ నటి ఆర్య పార్వతి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. 47 ఏళ్ల వయసులో ఆమె తల్లి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. అంతేకాదు తాను అక్కను అయ్యానంటూ తన బుల్లి చెల్లి ఫొటో షేర్‌ చేస్తూ మురిసిపోయింది. అయితే లేటు వయసులో తన తల్లి బిడ్డకు జన్మనివ్వడంపై తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆర్య పార్వతి స్పందించింది. ఇది వినడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా.. అందులో సిగ్గుపడాల్సింది ఏముందని అభిప్రాయపడింది.

చదవండి: రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన సంచలన వ్యాఖ్యలు

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా అమ్మ ప్రెగ్నెన్సీ విషయం మా నాన్న ద్వారా తెలిసింది. అప్పటికే ఆమె 8నెలల గర్భవతి. ఆ సమయంలో ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. అవును.. 23 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల నుంచి ఇలాంటి వార్త వినాల్సి రావడంతో.. నాకు ఎలా రియాక్ట్‌ అవ్వాలో అర్థం కాలేదు. షాక్‌ అయ్యాను అనేకంటే ఆశ్చర్యపోయాను అని చెప్పాలి. 47 ఏళ్ల వయసులో తల్లి గర్భవతి అయ్యిందంటే అది ఇబ్బంది పెట్టే విషయమే అని తెలుసు. కానీ, నాకు తెలిసే సమయానికి అమ్మ 8 నెలల గర్భవతిగా ఉంది. తనకే ఈ విషయం 7వ నెలలో తెలిసింది’ అంటూ ఆర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

చదవండి: టాలీవుడ్‌లో మరో విషాదం, పాపులర్‌ నటుడు కన్నుమూత

‘అయితే నాతో ఈ విషయం చెప్పేందుకు అమ్మ-నాన్న ఇబ్బంది పడ్డారట. ఇది చెప్పగానే నేను ఎలా రియాక్ట్‌ అవుతానోనని భయపడ్డారట. అందుకే కొంతకాలం ఈ విషయాన్ని నా దగ్గర దాచారు’ అని పేర్కొంది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నాన్న ఈ విషయం చెప్పిన తర్వాత తాను వెళ్లి తన అమ్మ ఒడిలో పడుకుని ఏడ్చానని చెప్పింది. ‘నిజానికి నేను ఎంతోకాలం దీనికోసమే ఎదురు చూశాను. నేనెందుకు సిగ్గుపడతాను’ అని అమ్మతో చెప్పానని ఆర్య పార్వతి చెప్పుకొచ్చింది. కాగా సోషల్‌ మీడియాలో ఆమె ఈ గుడ్‌న్యూస్‌ షేర్‌ చేయడంతో నెటిజన్లు, ఫ్యాన్స్‌ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement