23 Years Old South Actress Arya Parvathi Mother Welcome Baby Girl, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Actress Arya Parvathi Mother: 47 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌ తల్లి

Published Wed, Mar 1 2023 3:29 PM | Last Updated on Wed, Mar 1 2023 4:07 PM

23 Years Old South Actress Arya Parvathi Mother Welcome Baby Girl - Sakshi

ఇండస్ట్రీలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సినిమాలో ఓ కల్పిత కథ.. నిజ జీవితంలో చోటు చేసుకుంది. ప్రముఖ సీరియన్‌ నటి, బుల్లితెర హీరోయిన్‌ తల్లి 23 ఏళ్ల తర్వాత గర్భవతి అయి ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో ఈ వార్త ఇండస్ట్రలో, సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. వివరాలు.. కేరళకు చెందిన 23 ఏళ్ల ఆర్య పార్వతి మలయాళంలో పాపులర్‌ నటి. ఆమె పలు టీవీ సీరియల్స్‌లో లీడ్‌ రోల్స్‌ చేస్తూ బుల్లితెర హీరోయిన్‌గా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది.

చదవండి: కృష్ణవంశీకి పిచ్చా.. ఈమె హీరోయిన్‌ ఏంటీ? అని హేళన చేశారు: నటి సంగీత

‘చెంబట్టు’ ‘ఇలయవళ్ గాయత్రి’ వంటి సీరియల్స్‌ ఆమె గుర్తింపు పొందింది. ఆమె నటి మాత్రమే కాదు క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా. నటిగా, డ్యాన్సర్‌గా ఆమె ఎంత బిజీగా ఉన్న సోషల్‌ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన వ్యక్తిగత విషయాలను, లేటెస్ట్‌ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో గతంలో తన తల్లి గర్భవతి అయినట్లు ప్రకటించి షాకిచ్చింది. 47 ఏ‍ళ్ల ఆమె తల్లి 23 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రెగ్నెంట్‌ అయ్యిందని తెలిసి అంతా అవాక్కాయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తల్లి పండంటి ఆడబిడ్డకు జన్మననిచ్చింది.

చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

ఈ విషయాన్ని నటి ఆర్య పార్వతి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు తన బుల్లి చెల్లి ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ మురిసిపోతుంది. కాగా అచ్చం ఇలాంటి సంఘటన ఆధారంగా ఇటీవల తమిళంలో ఓ సినిమా తెరకెక్కింది. ఆర్‌జే బాలాజీ లీడ్‌ రోల్లో ‘వీట్ల విశేషం’ అనే సినిమా వచ్చింది. ఇందులో సత్యరాజ్‌, ఊర్వశీలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో హీరో తల్లిగా కనిపించిన ఊర్వశీ మధ్య వయసులో తల్లవుతుంది. ఇప్పుడు అలాంటి సంఘటనే నిజ జీవితంలో జరగడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement