
మాస్ ఫైటింగ్స్.. హీరోయిన్‌తో డ్యూయెట్స్.. ఇవేవీ లేకుండా సినిమా తీయొచ్చు.. హిట్టు కొట్టనూవచ్చు అని నిరూపించాడు తలైవా. తను స్లోమోషన్‌లో నడుచుకుంటూ వస్తే చాలు రికార్డులు వాటంతటవే తన ముందు మోకరిల్లుతాయని జైలర్‌తో చెప్పకనే చెప్పాడు. ఇప్పటికీ జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయవంతంంగా దూసుకుపోతూనే ఉంది. ఈ చిత్రంలో నటించిన అందరికీ మంచి గుర్తింపు వచ్చింది. అందులో జాఫర్ సాదిఖ్ కూడా ఒకరు!
ఈయన తమిళనాడులో ఫేమస్ కొరియోగ్రాఫర్. విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేసిన పావ కథైగల్ సిరీస్‌లో తొలిసారి నటించాడు. ఈ సిరీస్‌లోని ఓ ఎపిసోడ్‌లో మాత్రమే ఆయన నటించాడు. తర్వాత అతడు వేందు తనైంతాతు కాదు అనే చిత్రంలో నెగెటివ్ రోల్‌లో మెరిశాడు. కానీ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్టర్ పీస్ విక్రమ్ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బ్లాక్‌బస్టర్ హిట్ జైలర్‌లో నటించి మరిన్ని మార్కులు కొట్టేశాడు.
జైలర్ సినిమాలో జాఫర్ రజనీకాంత్‌ను కత్తితో భయపెట్టాలని చూస్తాడు.. అందుకుకానీ శివరాజ్‌కుమార్.. అతడిని ఫ్యాన్‌కు కట్టేసి తిప్పుతాడు. ఈ సీన్ చూసి నవ్వని ప్రేక్షకుడు ఉండడు. ఇకపోతే త్వరలో ఇతడు పెళ్లిపీటలెక్కబోతున్నాడట. జాఫర్ కొంతకాలంగా తన కో డ్యాన్సర్ షెరిన్‌తో ప్రేమలో ఉన్నాడు. తనతో కలిసి అప్పుడప్పుడు రీల్స్ కూడా చేస్తుంటాడు. జైలర్ షూటింగ్ సమయంలో జాఫర్ తన ప్రియురాలిని రజనీకి పరిచయం చేశాడట. త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నామంటూ రజనీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారట. మరి తన పెళ్లి తేదీ ఎప్పుడు ఉండబోతుందో చూడాలి! ఇకపోతే సైతాన్ వెబ్ సిరీస్‌లోనూ నటించిన జాఫర్ ప్రస్తుతం జవాన్ సినిమాలో నటిస్తున్నాడు.
చదవండి: క్రికెటర్‌తో కూతురి ప్రేమాయణం.. దగ్గరుండి పెళ్లి చేసిన ప్రముఖ నటుడు
400కు పైగా సినిమాలు, మోసం చేసిన కూతురు.. చితికి డబ్బుల్లేని దుస్థితి.. ఈ కష్టం ఎవరికీ రాకూడదు!
Comments
Please login to add a commentAdd a comment