
6ఐటం గర్ల్‌గా ఓవియ
తమిళసినిమా: కథానాయికలు ఐటం సాంగ్స్‌లో నటించడం ఇప్పుడు పరిపాటిగా మారింది. అయితే ఐటం గర్ల్‌గా మారడం అన్నది అరుదే. కాగా విమల్‌కు జంటగా కళవాణి చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయమైన కేరళాకుట్టి ఓవియ. తొలి చిత్రమే మంచి విజయాన్ని అందుకోవడంతో తన భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఓవియ కలలు కంది. అనుకున్నట్లుగానే అమ్మడికి వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి.
ప్రముఖ దర్శకుడు సుందర్.సీ తెరకెక్కించిన కలగలపు చిత్రంలో కథానాయకిగా నటించిన ఓవియ ఆ చిత్రంలో మరోనాయకి అంజిలితో ఒక సాంగ్‌లో పోటీ పడి అందాలారబోసింది. అయితే అలా అందాలొలక బోసిన అంజలి ఆ ముద్ర నుంచి బయట పడగలిగింది కానీ, ఓవియ మాత్రం తప్పించుకోలేక పోయింది. అందుకు కారణం తను నటించిన చిత్రాలు వరుసగా అపజయాలను చవి చూడడం కావచ్చు.
తాజాగా అరుళ్‌నిధి హీరోగా నటిస్తున్న ఇరవుక్కు ఆయిరం కన్‌గళ్ చిత్రంలో సింగిల్ సాంగ్‌తో పాటు, కొన్ని సన్నివేశాల్లో నటిస్తోంది. అదేవిధంగా విష్ణువిశాల్ కథానాయకుడిగా నటిస్తున్న సిలుక్కువార్‌పట్టి సింగం చిత్రంలో రెజీనా కథానాయకిగా నటిస్తుండగా ఓవియ ఐటమ్ సాంగ్‌లో నర్తించిందట.ఈ చిత్రాల విడుదల తరువాత ఓవియను ఐటమ్ గర్ల్ లిస్ట్‌లో పెట్టేసినా ఆశ్చర్యపడనక్కరేదు అంటున్నారు కోలీవుడ్ వర్గాలు.