సాక్షి, చెన్నై : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా హాట్ బ్యూటీ ఒవియా హెలెన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆమెపై వెంటనే పోలీసు కేసు నమోదు చేయాలని తమిళనాడు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ చీఫ్ డీ అలెక్స్ సుధాకర్ స్థానిక పోలీసుకు ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తమిళనాడు పర్యటించిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూ.3,770 కోట్లతో పూర్తయిన చెన్నై వాషర్‌మెన్ పేట–విమ్కోనగర్ మధ్య మెట్రో రైలు, రూ.293 కోట్లతో పూర్తి చేసిన చెన్నై బీచ్–అత్తిపట్టు మధ్య 4వ ట్రాక్‌లో, రూ.423 కోట్లతో విద్యుద్దీకరించిన విల్లుపురం–తంజావూరు – తిరువారూర్ మార్గంలో రైలు సేవలకు జెండా ఊపారు. చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్ని ప్రసంగించారు.
ఈ క్రమంలో మోదీ రాకను నిరశిస్తూ నటి ఒవియా హెలెన్ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. గో బ్యాక్ మోదీ అనే హ్యాష్ ట్యాగ్‌తో చేసిన పోస్టు వివాదాస్పదంగా మారింది. ఈమె తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దేశద్రోహం, ఐటీ చట్టం కింద ఆమెపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇండియన్ మోడల్ అయిన ఒవియా పేరు అందరికీ తెలియకపోయినా తమిళ, మలయాళ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితురాలే.. విలక్షణ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యతగా వచ్చిన తమిళ బిగ్‌బాస్ సీజన్ 1లో ఈ కేరళ కుట్టి పాల్గొంది. బిగ్‌బాస్ షోతో ఒవియా కోలీవుడ్‌లో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో 40కి పైగా చిత్రాల్లో ఒవియా నటించారు. వరసగా కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ కూడా చేస్తుంటుంది.
మోదీపై ట్వీట్.. హాట్ బ్యూటీపై ఫిర్యాదు
Published Mon, Feb 15 2021 2:12 PM | Last Updated on Mon, Feb 15 2021 2:55 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment