తుది దశకు చేరిన చండమారుతం | sarath kumar movie shooting comes to end | Sakshi
Sakshi News home page

తుది దశకు చేరిన చండమారుతం

Published Sat, Aug 23 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

తుది దశకు చేరిన  చండమారుతం

తుది దశకు చేరిన చండమారుతం

చండమారుతం చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. శరత్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం చండమారుతం. విశేషమేమిటంటే ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. శరత్‌కుమార్ ద్విపాత్రాభినయం చేయడం కొత్తేమి కాకపోయినా ఈ చిత్రంలో నాయకుడు, ప్రతినాయకుడు ఆయనే కావడం విశేషం. ప్రతి నాయకుడంటే ఆషామాషి పాత్ర కాదట. క్రూరమైన విలన్‌గా నటిస్తున్నారని చిత్ర వర్గాలు వెల్లడించాయి.
 
ఈ పాత్ర అరాచకాలు తెరపై చూడాల్సిందే నంటున్నారు. సాధారణంగా ద్విపాత్రాభినయం అనగానే అన్నదమ్ములుగానో, తండ్రీకొడుకులుగానో నటిస్తుంటారు. ఈ చిత్రంలో అలాంటి సంబంధాలేవీ లేని రెండు విభిన్న పాత్రల్లో శరత్‌కుమార్ నటిస్తున్నారని తెలిపారు. నటి ఓవియా, మీరానందన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో దర్శకుడు సముద్రకని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో రాధారవి, తంబిరామయ్య, ఇమాన్ అన్నాచిచ, జార్జ్, నళిని, రామ్‌కుమార్, గానా ఉలగనాథన్, నరేన్, వెన్నిరాడై మూర్తి, ఆదవన్ శింగంపులి, ఢిల్లి గణేశన్ మొదలగు వారు నటిస్తున్నారు.
 
చిత్ర షూటింగ్ 80 శాతం పూర్తయిందని, మిగిలిన 20 శాతం పూర్తి చేసి త్వరలో చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి శరత్‌కుమార్‌నే కథను తయారు చేశారు. ఈ చిత్రాన్ని ఆయనతోపాటు రాధిక శరత్‌కుమార్, లిస్టిన్ స్టీఫెన్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏ.వెంకటేష్ దర్శత్వం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement