miranandan
-
మన బాధ్యత
‘‘సామాజికంగా మన బాధ్యతలను, ఆదర్శవంతమైన విలువలను చూపించడంలో ‘హితుడు’ సినిమా విజయం సాధించిందని, ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించడం మన బాధ్యత’’ అని పాటల రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. జగపతిబాబు, మీరానందన్ జంటగా, విప్లవ్ దర్శకత్వంలో సుంకర మధు మురళి నిర్మించిన ఈ చిత్రానికి మేధావులు, సినీ పరిశ్రమ నుంచి మంచి స్పందన లభిస్తోంది. సీనియర్ సంపాదకుడు ఏబీకె ప్రసాద్, తెలంగాణా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి ఈ చిత్రాన్ని చూసి, నిర్మాతను అభినందించారు. -
తమిళ చిత్ర పరిశ్రమలో డబ్బు లేదు
‘‘తమిళ చిత్ర పరిశ్రమలో డబ్బు లేదు. ఇక్కడ రొటేషన్ మాత్రమే జరుగుతోంది అలాంటిది లేనిపోని దుమారాలు రేపి మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేయకండి’’ అని సీనియర్ నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి రాధారవి వ్యాఖ్యానించారు. ఆదివారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్ నాలుగు చిత్రాల కార్యక్రమాలకు వేదికైంది. అందులో ఒకటి నటుడు, శరత్‌కుమార్ నాయకుడిగా, ప్రతినాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన చండమారుతం చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం. నటుడు ధనుష్ నటిస్తున్న మారి, విక్రమ్ ప్రభు నటిస్తున్న ఇదు ఎన్న మాయం, వర్ధమాన నటుడు బాలు సింహ హీరోగా నటిస్తున్న పాంబుసట్టై తదితర మూడుచిత్రాల పరిచయ కార్యక్రమాలు జరిగారుు. చండమారుతం చిత్రంలో శరత్‌కుమార్ సరసన ఓవియ, మీరానందన్ నటిస్తున్నారు. ఎ.వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్‌కుమార్ కథ, కథనం, సమకూర్చడంతో పాటు రాధికా శరత్‌కుమార్ లిస్టింగ్ స్టీఫెన్‌తో కలిసి నిర్మాణ బాధ్యతలు చేపట్టడం విశేషం. జేమ్స్ వసంతన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియోను నిర్మాత ఆర్బి చౌదరి ఆవిష్కరించగా శరత్‌కుమార్, ధనుష్ తదితర చిత్ర యూనిట్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రాధారవి మాట్లాడుతూ కోట్లు వెచ్చించి రూపొందిస్తున్న చిత్రాలపై కొందరు విడుదలైన తొలిరోజునే దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్ నటించిన లింగా చిత్రంపై కూడా ఇలాంటి ప్రచారం జరుగుతోందన్నారు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి రూపొందించిన ఆ చిత్రంలో అది బాగోలేదు, ఇది సరిగా లేదు, ఇది మూడు గంటలు సాగే కథ అంటూ దుమారం రేపుతున్నారన్నారు. ఇలాంటివి సినిమా పరిశ్రమకు మేలు చేయదన్నారు. వందలమంది శ్రమను పైరసీలతో దోచుకుంటున్నారన్నారు. దయ చేసి పైరసీని ప్రోత్సహించకండి అని పేర్కొన్నారు. ఒక వేదికపై నిర్వహించిన ఈ నాలుగు చిత్రాలను మ్యాజిక్ ఫ్రేమ్స్ సంస్థలు నిర్మించడం విశేషం. -
తుది దశకు చేరిన చండమారుతం
చండమారుతం చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. శరత్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం చండమారుతం. విశేషమేమిటంటే ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. శరత్‌కుమార్ ద్విపాత్రాభినయం చేయడం కొత్తేమి కాకపోయినా ఈ చిత్రంలో నాయకుడు, ప్రతినాయకుడు ఆయనే కావడం విశేషం. ప్రతి నాయకుడంటే ఆషామాషి పాత్ర కాదట. క్రూరమైన విలన్‌గా నటిస్తున్నారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ పాత్ర అరాచకాలు తెరపై చూడాల్సిందే నంటున్నారు. సాధారణంగా ద్విపాత్రాభినయం అనగానే అన్నదమ్ములుగానో, తండ్రీకొడుకులుగానో నటిస్తుంటారు. ఈ చిత్రంలో అలాంటి సంబంధాలేవీ లేని రెండు విభిన్న పాత్రల్లో శరత్‌కుమార్ నటిస్తున్నారని తెలిపారు. నటి ఓవియా, మీరానందన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో దర్శకుడు సముద్రకని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో రాధారవి, తంబిరామయ్య, ఇమాన్ అన్నాచిచ, జార్జ్, నళిని, రామ్‌కుమార్, గానా ఉలగనాథన్, నరేన్, వెన్నిరాడై మూర్తి, ఆదవన్ శింగంపులి, ఢిల్లి గణేశన్ మొదలగు వారు నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ 80 శాతం పూర్తయిందని, మిగిలిన 20 శాతం పూర్తి చేసి త్వరలో చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి శరత్‌కుమార్‌నే కథను తయారు చేశారు. ఈ చిత్రాన్ని ఆయనతోపాటు రాధిక శరత్‌కుమార్, లిస్టిన్ స్టీఫెన్లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏ.వెంకటేష్ దర్శత్వం వహిస్తున్నారు.