తమిళ చిత్ర పరిశ్రమలో డబ్బు లేదు | Radha Ravi for making indecent comments on actors | Sakshi
Sakshi News home page

తమిళ చిత్ర పరిశ్రమలో డబ్బు లేదు

Published Mon, Dec 15 2014 2:16 AM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

తమిళ చిత్ర పరిశ్రమలో డబ్బు లేదు - Sakshi

తమిళ చిత్ర పరిశ్రమలో డబ్బు లేదు

‘‘తమిళ చిత్ర పరిశ్రమలో డబ్బు లేదు. ఇక్కడ రొటేషన్ మాత్రమే జరుగుతోంది అలాంటిది లేనిపోని దుమారాలు రేపి మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేయకండి’’ అని సీనియర్ నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి రాధారవి వ్యాఖ్యానించారు. ఆదివారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్ నాలుగు చిత్రాల కార్యక్రమాలకు వేదికైంది. అందులో ఒకటి నటుడు, శరత్‌కుమార్ నాయకుడిగా, ప్రతినాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన చండమారుతం చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం. నటుడు ధనుష్ నటిస్తున్న మారి, విక్రమ్ ప్రభు నటిస్తున్న ఇదు ఎన్న మాయం, వర్ధమాన నటుడు బాలు సింహ హీరోగా నటిస్తున్న పాంబుసట్టై తదితర మూడుచిత్రాల పరిచయ కార్యక్రమాలు జరిగారుు.
 
 చండమారుతం చిత్రంలో శరత్‌కుమార్ సరసన ఓవియ, మీరానందన్ నటిస్తున్నారు. ఎ.వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్‌కుమార్ కథ, కథనం, సమకూర్చడంతో పాటు రాధికా శరత్‌కుమార్ లిస్టింగ్ స్టీఫెన్‌తో కలిసి నిర్మాణ బాధ్యతలు చేపట్టడం విశేషం. జేమ్స్ వసంతన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియోను నిర్మాత ఆర్‌బి చౌదరి ఆవిష్కరించగా శరత్‌కుమార్, ధనుష్ తదితర చిత్ర యూనిట్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రాధారవి మాట్లాడుతూ కోట్లు వెచ్చించి రూపొందిస్తున్న చిత్రాలపై కొందరు విడుదలైన తొలిరోజునే దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్ నటించిన లింగా చిత్రంపై కూడా ఇలాంటి ప్రచారం జరుగుతోందన్నారు.
 
 అన్ని కోట్లు ఖర్చు పెట్టి రూపొందించిన ఆ చిత్రంలో అది బాగోలేదు, ఇది సరిగా లేదు, ఇది మూడు గంటలు సాగే కథ అంటూ దుమారం రేపుతున్నారన్నారు. ఇలాంటివి సినిమా పరిశ్రమకు మేలు చేయదన్నారు.  వందలమంది శ్రమను పైరసీలతో దోచుకుంటున్నారన్నారు. దయ చేసి పైరసీని ప్రోత్సహించకండి అని పేర్కొన్నారు. ఒక వేదికపై నిర్వహించిన ఈ నాలుగు చిత్రాలను మ్యాజిక్ ఫ్రేమ్స్ సంస్థలు నిర్మించడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement