Radha Ravi Comments About Kanal Movie And OTT Platforms, Deets Inside - Sakshi
Sakshi News home page

Radha Ravi: ఓటీటీలతో నిర్మాతలకు ఎప్పటికైనా చేటే

Jun 30 2022 9:56 AM | Updated on Jun 30 2022 10:25 AM

Radha Ravi Talk About Kanal Movie - Sakshi

తమిళసినిమా: కణల్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం రాత్రి చెన్నైలో ఘనంగా నిర్వహించారు. నైటింగేల్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై జయ్‌బాల నిర్మించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను సమయ మురళి నిర్వహించారు. నటి కావ్యా బెల్లు శ్రీధర్‌ మాస్టర్, స్వాతికృష్ణన్, జాన్‌ విజయ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తెన్భా, సతీష్‌ చక్రవర్తి ద్వయం సంగీతాన్ని అందించిన దీనికి భాస్కర్‌ ఛాయాగ్రహకుడిగా వ్యవహరించారు.

నటుడు రాధారవి ముఖ్య అతిథిగా హాజరైన చిత్ర ఆడియోను ఆవిష్కరించి మాట్లాడారు. చిత్ర కథను దర్శకుడు తనకు చెప్పారని చాలా బాగుందని పేర్కొన్నారు. నటి కావ్యా బెల్లు చాలా చక్కగా నటించారని ప్రశంసించారు. సినిమాలను థియేటర్లలో చూస్తేనే బాగుంటుందని, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పెరిగిపోతున్నాయని, వీటితో నిర్మాతలకు ఎప్పటికైనా చేటే అని అన్నారు. దర్శకుడు సమయ మురళి మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నదే ఈ చిత్ర ఇతివృత్తం అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement