పాప్ సురేష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇరవిన్ కన్‌గళ్. ప్రతాప్ నిర్మించిన ఈ మూవీలో డాలీ ఐశ్వర్య హీరోయిన్‌గా నటించారు. చార్లెస్ ధనా సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్‌వీ.ఉదయకుమార్, కార్యదర్శి పేరరసు, నటుడు ప్రజన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఇరవిన్ కన్‌గళ్‌ఆడియో లాంచ్
దర్శకులు కథ సరిగా చెప్పట్లేదు
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, కథానాయకుడు పాప్ సురేష్ మాట్లాడుతూ చిన్న చిత్రంగా ప్రారంభించిన ఈ చిత్రం విడుదలవుతుందా? అనే సందేహం కలిగిందన్నారు. అలాంటిది ఇప్పుడీ స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన చిత్రమని పేర్కొన్నారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శకుడు పాప్ సురేష్ కథను చాలా బాగా చెబుతారని, నటుడు ప్రజన్ చెప్పారని.. నిజానికి ఇప్పుడు దర్శకులు కథను చెప్పడం లేదన్నారు. ఇంతకు ముందు కథ చెప్పగానే చిత్రం చూసినట్లు ఉండేదన్నారు. కొందరైతే చెప్పిన కథను అలానే తెరకెక్కించలేకపోతున్నారని, అక్కడే సమస్య తలెత్తుతుందన్నారు.
తిరుపాచ్చి సినిమాలో ఓ స్టిల్
టాప్ 5లో ఉన్నా..
తాను తిరుపాచ్చి చిత్రానికిగానూ విజయ్‌కు కథ చెప్పి తెరకెక్కించానని, అయితే చిత్రం పూర్తి అయిన తరువాత ప్రసాద్ ల్యాబ్‌లో తానూ, విజయ్ కలిసి చిత్రాన్ని చూశామని అనంతరం విజయ్ ఏమంటారోనని బిక్కు బిక్కుగా ఉన్నానన్నారు. అయితే ఆయన మీరు కథ చెప్పిన దాని కంటే మూడు రెట్లు బాగా చిత్రం వచ్చిందని చెప్పారన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది టాప్ 10 దర్శకుల్లో మీరు ఉంటారని చెప్పారన్నారు. అయితే ఆ ఏడాది టాప్ ఐదుగురి దర్శకుల్లో తాను ఉన్నానని చెప్పారు. కాగా ఇరవిన్ కన్‌గళ్ చిత్రాన్ని ఏఐ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారని, ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేరరసు పేర్కొన్నారు.
చదవండి: తిరుమలలో రామ్ చరణ్ కూతురు 'క్లీంకార' ఫేస్ రివీల్
Comments
Please login to add a commentAdd a comment