perarasu
-
ఈ హీరో క్రేజ్, కలెక్షన్స్ చూసి రజనీకాంతే భయపడ్డారు!
సుమారు 12 ఏళ్ల గ్యాప్ తరువాత నటుడు రామరాజన్ హీరోగా నటిస్తున్న చిత్రం సామాన్యన్. ఆర్.రాకేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత వి.మదియళగన్ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు రామరాజన్, ఇళయరాజా కాంబోలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా సుమారు 23 ఏళ్ల తరువాత మళ్లీ వీరి కాంబోలో రూపొందుతున్న చిత్రం సామాన్యన్. నటి నక్సాచరణ్, స్మృతి వెంకట్, అపర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో రాధారవి, ఎంఎస్.భాస్కర్, లియో శివకుమార్, రాజారాణి పాండియన్, మైమ్ గోపి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంతే భయపడ్డారు శుక్రవారం సాయంత్రం చైన్నెలో ఆడియో లాంచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, కేఎస్.రవికుమార్, శరణసుబ్బయ్య తదితర సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కేఎస్.రవికుమార్ మాట్లాడుతూ.. సహయ దర్శకుడిగా 9 ఏళ్లు కష్టపడ్డప్పటికీ.. తనను దర్శకుడిని చేసింది రామరాజన్నేనని చెప్పారు. ఈయన నటించిన చిత్రాలన్నీ విజయాన్ని సాధించాయని, ఒక సమయంలో రామరాజన్ గురించి నటుడు రజనీకాంత్ తనతో మాట్లాడుతూ రామరాజన్ మాస్ ఫాలోయింగ్, వసూళ్లను చూస్తుంటే తనను మించి పోతారేమోనని భయంగా ఉందని అన్నారన్నారు. 23 ఏళ్ల తర్వాత.. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. వనవాసం ముగించుకుని వచ్చిన రామరాజన్‌కు ఇక పట్టాభిషేకమేనని పేర్కొన్నారు. ఆయన పరిగెత్తే గుర్రం కాదని, పలు గుర్రాలను పరిగెత్తించిన నటుడన్నారు. రామరాజన్ చిన్న మక్కళ్ తిలగం అని దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్ పేర్కొన్నారు. 23 ఏళ్ల తర్వాత ఇళయరాజా, రామరాజన్ కలిసి పని చేస్తున్న ఈ చిత్రానికి తాను దర్శకత్వం వహించడం భాగ్యంగా భావిస్తున్నానని చిత్ర దర్శకుడు రాకేశ్ అన్నారు. నటుడు రామరాజన్ మాట్లాడుతూ 2010లో పార్టీ మీటింగ్ ముగించుకుని వస్తున్న సమయంలో ఘోర ప్రమాదానికి గురయ్యానని, వెంట్రుక వాసిలో బతికి బయట పడ్డానని, ఇప్పుడు ఈ చిత్రంలో నటించడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. అభిమానుల ప్రార్థనల వల్లే తాను మళ్లీ ప్రాణాలతో బయట పడ్డానన్నారు. చదవండి: కలెక్షన్స్‌తో మోత మోగిస్తున్న టిల్లుగాడు.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే -
విజయ్ ఏమంటాడోనని తెగ భయపడిపోయా..: డైరెక్టర్
పాప్ సురేష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇరవిన్ కన్గళ్. ప్రతాప్ నిర్మించిన ఈ మూవీలో డాలీ ఐశ్వర్య హీరోయిన్గా నటించారు. చార్లెస్ ధనా సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ.ఉదయకుమార్, కార్యదర్శి పేరరసు, నటుడు ప్రజన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇరవిన్ కన్గళ్ఆడియో లాంచ్ దర్శకులు కథ సరిగా చెప్పట్లేదు ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, కథానాయకుడు పాప్ సురేష్ మాట్లాడుతూ చిన్న చిత్రంగా ప్రారంభించిన ఈ చిత్రం విడుదలవుతుందా? అనే సందేహం కలిగిందన్నారు. అలాంటిది ఇప్పుడీ స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన చిత్రమని పేర్కొన్నారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శకుడు పాప్ సురేష్ కథను చాలా బాగా చెబుతారని, నటుడు ప్రజన్ చెప్పారని.. నిజానికి ఇప్పుడు దర్శకులు కథను చెప్పడం లేదన్నారు. ఇంతకు ముందు కథ చెప్పగానే చిత్రం చూసినట్లు ఉండేదన్నారు. కొందరైతే చెప్పిన కథను అలానే తెరకెక్కించలేకపోతున్నారని, అక్కడే సమస్య తలెత్తుతుందన్నారు. తిరుపాచ్చి సినిమాలో ఓ స్టిల్ టాప్ 5లో ఉన్నా.. తాను తిరుపాచ్చి చిత్రానికిగానూ విజయ్‌కు కథ చెప్పి తెరకెక్కించానని, అయితే చిత్రం పూర్తి అయిన తరువాత ప్రసాద్ ల్యాబ్‌లో తానూ, విజయ్ కలిసి చిత్రాన్ని చూశామని అనంతరం విజయ్ ఏమంటారోనని బిక్కు బిక్కుగా ఉన్నానన్నారు. అయితే ఆయన మీరు కథ చెప్పిన దాని కంటే మూడు రెట్లు బాగా చిత్రం వచ్చిందని చెప్పారన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది టాప్ 10 దర్శకుల్లో మీరు ఉంటారని చెప్పారన్నారు. అయితే ఆ ఏడాది టాప్ ఐదుగురి దర్శకుల్లో తాను ఉన్నానని చెప్పారు. కాగా ఇరవిన్ కన్గళ్ చిత్రాన్ని ఏఐ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారని, ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేరరసు పేర్కొన్నారు. చదవండి: తిరుమలలో రామ్ చరణ్ కూతురు 'క్లీంకార' ఫేస్ రివీల్ -
మా ముఖ్యమంత్రిని ఎవరేం అన్న సహించేది లేదు: దర్శకుడు
తమిళ సినిమా: మహిళ నిర్మాత శ్యామల రమేష్ నిర్మించిన చిత్రం కటాక్షం. పట్టుకోట్టై శివ దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కార్తీక్ చరణ్, మహాన అనే నవ జంట హీరో హీరోయిన్గా నటిస్తున్నారు. దర్శకుడు కె. భాగ్యరాజ్ కీలకపాత్రలో పోషించిన ఈ చిత్రానికి సంగీత దర్శకుడు చార్లీ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో కె. భాగ్యరాజ్, ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, జాగ్వర్ తంగం తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కె. భాగ్యరాజ్ ఆడియోను ఆవిష్కరించగా పేరరసు, ఆర్వీ ఉదయ్ కుమార్ తదితరులు తొలి ప్రతిని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్వీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఈ చిత్ర కథానాయకి తమిళ భాషలో చాలా చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. నిర్మాత శ్యామల రమేష్ షూటింగ్ స్పాట్లో ఉదయం ఐదు గంటలకే అందరినీ నిద్రలేపి రెడీ చేయించడం అన్నది అభినందనీయం అన్నారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ప్రస్తుతం కర్ణాటకలో కొన్ని సంఘాలు చేస్తున్న ఆందోళన వివాదంగా మారుతుందని వాళ్లు మన ముఖ్యమంత్రి స్టాలిన్‌ను దూషించడం సరికాదన్నారు. తమిళనాడులో అనేక పార్టీలు ఉండవచ్చునని భేదాభిప్రాయాలు ఉండవచ్చునని, అయితే మనం తమిళనాడు దాటితే మనం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఎవరేమన్నా సహించేది లేదని పేర్కొన్నారు. కె.భాగ్యరాజ్ మాట్లాడుతూ చిన్న చిత్రాలు లేనిదే చిత్రపరిశ్రమ లేదని పేర్కొన్నారు. కాబట్టి ప్రతి థియేటర్లోనూ చిన్నచిత్రాలను ఒక్క షో అయినా ప్రదర్శించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిన్న బడ్జెట్లో చిత్రాలు చేయడానికి నిర్మాతలు రావద్దని ఎవరు అన్నారని, అలా అనే హక్కు వారికీ లేదని చిత్త నిర్మాత రమేష్ పేర్కొన్నారు. తమ చిత్ర షూటింగ్ సమయంలో ఎందరో కళాకారులు, సాంకేతిక వర్గం జీవిస్తున్నారని తాను కళ్లారా చూశానని తమలాంటి చిన్న చిత్రాల నిర్మాతలు రాకపోతే అలాంటి వారికి జీవనోపాధి ఎవరు కల్పిస్తారని ప్రశ్నించారు. తను వారి కోసం అయినా మరో చిత్రం చేస్తానని ఆయన అన్నారు.