సుమారు 12 ఏళ్ల గ్యాప్ తరువాత నటుడు రామరాజన్ హీరోగా నటిస్తున్న చిత్రం సామాన్యన్. ఆర్.రాకేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేత వి.మదియళగన్ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు రామరాజన్, ఇళయరాజా కాంబోలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా సుమారు 23 ఏళ్ల తరువాత మళ్లీ వీరి కాంబోలో రూపొందుతున్న చిత్రం సామాన్యన్. నటి నక్సాచరణ్, స్మృతి వెంకట్, అపర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో రాధారవి, ఎంఎస్.భాస్కర్, లియో శివకుమార్, రాజారాణి పాండియన్, మైమ్ గోపి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
రజనీకాంతే భయపడ్డారు
శుక్రవారం సాయంత్రం చైన్నెలో ఆడియో లాంచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఆర్‌వీ ఉదయకుమార్, పేరరసు, కేఎస్.రవికుమార్, శరణసుబ్బయ్య తదితర సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కేఎస్.రవికుమార్ మాట్లాడుతూ.. సహయ దర్శకుడిగా 9 ఏళ్లు కష్టపడ్డప్పటికీ.. తనను దర్శకుడిని చేసింది రామరాజన్‌నేనని చెప్పారు. ఈయన నటించిన చిత్రాలన్నీ విజయాన్ని సాధించాయని, ఒక సమయంలో రామరాజన్ గురించి నటుడు రజనీకాంత్ తనతో మాట్లాడుతూ రామరాజన్ మాస్ ఫాలోయింగ్, వసూళ్లను చూస్తుంటే తనను మించి పోతారేమోనని భయంగా ఉందని అన్నారన్నారు.
23 ఏళ్ల తర్వాత..
దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. వనవాసం ముగించుకుని వచ్చిన రామరాజన్‌కు ఇక పట్టాభిషేకమేనని పేర్కొన్నారు. ఆయన పరిగెత్తే గుర్రం కాదని, పలు గుర్రాలను పరిగెత్తించిన నటుడన్నారు. రామరాజన్ చిన్న మక్కళ్ తిలగం అని దర్శకుడు ఆర్‌వీ ఉదయకుమార్ పేర్కొన్నారు. 23 ఏళ్ల తర్వాత ఇళయరాజా, రామరాజన్ కలిసి పని చేస్తున్న ఈ చిత్రానికి తాను దర్శకత్వం వహించడం భాగ్యంగా భావిస్తున్నానని చిత్ర దర్శకుడు రాకేశ్ అన్నారు. నటుడు రామరాజన్ మాట్లాడుతూ 2010లో పార్టీ మీటింగ్ ముగించుకుని వస్తున్న సమయంలో ఘోర ప్రమాదానికి గురయ్యానని, వెంట్రుక వాసిలో బతికి బయట పడ్డానని, ఇప్పుడు ఈ చిత్రంలో నటించడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. అభిమానుల ప్రార్థనల వల్లే తాను మళ్లీ ప్రాణాలతో బయట పడ్డానన్నారు.
చదవండి: కలెక్షన్స్‌తో మోత మోగిస్తున్న టిల్లుగాడు.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే
Comments
Please login to add a commentAdd a comment