బిగ్ బాస్ సెట్‌లో ఆరవ్, ఓవియా
తమిళసినిమా: నటి ఓవియ తనకు నచ్చడానికి కారణం అదే అంటున్నాడు నటుడు ఆరవ్. వీరిద్దరి గురించి ఆ మధ్య పెద్ద చర్చే జరిగిందన్నది తెలిసిన విషయమే. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న వారి లో ఆరమ్, ఓవియ కూడా ఉన్న విషయం తెలిసిందే. అంతే కాదు వీరిద్దరి మధ్య ఆ గే మ్ షోలోనే ప్రేమ వ్యవహారం సాగిందని, అయితే ఓవియ పెళ్లి ప్రపోజల్ చేయగా ఆరవ్ రివర్స్ గేర్ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అంతే కాదు ఆరమ్ తన ప్రేమను నిరాకరించడంతో మానసిక వేదనకు గురైన ఓవియ ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్లు ప్రచారం హోరెత్తింది.
దీంతో నటి ఓవియ మళ్లీ మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పట్టింది. అనంతరం ఆరవ్, ఓవియ సహజంగానే మసులుకోవడం మొదలెట్టారు. నటి ఓవియ ఆ గేమ్ షోలో గెలవకపోయినా, అంత కంటే ఎక్కువే ప్రాచుర్యం పొందింది. దీంతో కొత్తగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. అంతే కాదు వాణిజ్య ప్రకటనలు తలుపు తడుతున్నా యి. మొత్తం మీద ఓవియ సెలబ్రిటీ నటి అయిపోయింది.
అప్పుడు తన ప్రేమను నిరాకరించిన ఆరవ్ ఇప్పుడు ఓవియానే తనకు ఇష్టమైన నటి తను అని అంటున్నాడు. ఈయన ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన భేటీలో ఓవియ తనకు నచ్చడానికి కారణం ఏమంటంటే యథార్థంగా ఉండడం ప్రపంచంలోనే కష్టమైన విషయం అన్నారు. నిజజీవితంలోనూ ఏదో విధంగా నటిస్తూనే ఉంటామన్నారు. అయితే నటి ఓవియ ఎప్పుడూ తనలాగే ఉంటుందని అందుకే ఆమె తనతో పాటు అందరికీ నచ్చుతుందని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment