సినిమా: నా పేరును ప్రచారానికి వాడుకుంటున్నారని నటి ఓవియ ఆరోపిస్తోంది. కలవాని చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన మాలీవుడ్ అమ్మడీమె. ఆ చిత్రం సక్సెస్‌తో వరుసగా పలు చిత్రాల అవకాశాలు టపటపా వచ్చేసినా వాటిలో ఏవీ పెద్దగా విజయం సాధించకపోవడంతో మంచి మార్కెట్‌ను సంపాదించుకోలేకపోయింది. అయితే బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో–1లో పాల్గొన్న ఓవియకు పిచ్చ పిచ్చగా క్రేజ్ వచ్చేసింది. అంతే ఆ తరువాత సినిమా అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం కలవాని 2, 9 ఎంఎల్, కాంచన–3 చిత్రాల్లో నటిస్తోంది. ఈ అమ్మడితో చిన్న ఇంటర్వ్యూ.
ప్ర: ఓవియ ఎలాంటి అమ్మాయి?
జ: చిన్న తనం నుంచి చాలా స్వేచ్ఛగా ఉండాలని అనుకునే అమ్మాయిని నేను. ఎవరిని ఎలాంటి సహాయం అడగను. నా చేతి కర్చులకు కూడా నేను సంపాదించుకునేదాన్ని. అలా ఆ వయసులో డబ్బు ఎలా సంపాదించాలన్న ఆలోచిస్తున్న సమయంలోనే మోడలింగ్ రంగంలో అవకాశం వచ్చింది. మోడలింగ్ నుంచే చిన్న చిన్న వాణిజ్య ప్రకటనల్లో నటించడం ప్రారంభించాను. ఆ సంపాదన నా పాకెట్ మనీకి సరిపోయేది. అలా నా మోడలింగ్ ఫొటోలను చూసిన దర్శకుడు సర్గుణం కలవాని చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం కల్పించారు. ఆ చిత్రంతో హెలెన్ అయిన నేను ఓవియగా మారాను.
ప్ర: మీ జీవితాన్ని బిగ్‌బాస్ గేమ్ షోకు ముందు, ఆ తరువాత అని విడదీసి చూడవచ్చా?
జ: చాలా మంది నేను రాత్రికి రాత్తే నటిగా పాపులర్ అయ్యాననుకుంటున్నారు. అది ఒక రకంగా నిజమే అయినా బిగ్‌బాస్ గేమ్ షో తరువాతనే నాకింత పేరు వచ్చింది. అయితే చాలా కష్టాలు, శ్రమ తరువాతనే నేనీ స్థాయికి చేరుకున్నాను. చాలా ఏళ్ల క్రితమే నటిగా పరిచయం అయ్యాను. అయితే మొదట్లో ఇంత పేరు రాలేదు. చాలా కాలం పోరాడాను. బిగ్‌బాస్ గేమ్ షో పూర్తి అయ్యి ఏడాది గడిచినా ప్రేక్షకులు నన్ను మరచిపోకపోవడం సంతోషంగా ఉంది. వెండితెర, బుల్లితెర ప్రేక్షకులు తనను వారి కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావిస్తున్నారు. ఇది నేను జీవితంలో మరచిపోలేని అనుభవం. అయితే కొందరు తన అభిమానుల్ని తప్పుదారి పటిస్తున్నారు. నేను చిన్న పాత్రల్లో నటించిన చిత్రాలకు కూడా నా పేరును ప్రచారానికి వాడుకుంటున్నారు. ఇదే వేదనకు గురిచేస్తోంది.
ప్ర: హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించాలన్న ఆశ ఉందా?
జ: కచ్చితంగా ఉంది. అయితే నయనతార నటించిన అరమ్ లాంటి కథా చిత్రాలు కాకుండా, నేను నేనుగా ఉండే చిత్రాలనే నా అభిమానులు కోరుకుంటారు. కాబట్టి నేను చేసే చిత్రాలు భిన్నంగా ఉండాలి. సందేశాలిచ్చేవిగా ఉండరాదు.
ప్ర: న్యూ ఇయర్ వేడుకలు ఎలా జరుపుకుంటారు?
జ: నేనెప్పుడూ స్నేహితురాళ్లతోనే జరుపుకుంటాను. అదే విధంగా ఈ సారి కూడా. అయితే ఆ తరువాత నాకు నచ్చిన ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నాను. అది హిమాలయాలు కూడా కావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment