ఆయన నా లైఫ్‌లో ఉండాలి : ఓవియా | Oviya About Simbu In 90ML Promotions | Sakshi
Sakshi News home page

ఆయన నా లైఫ్‌లో ఉండాలి : ఓవియా

Published Wed, Feb 27 2019 10:26 AM | Last Updated on Wed, Feb 27 2019 1:06 PM

Oviya About Simbu In 90ML Promotions - Sakshi

తమిళ బిగ్‌బాస్‌ షో తో ఫేమస్‌ అయిన ఓవియా.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా 90ఎమ్‌ఎల్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో ఓవియా బోల్డ్‌గా నటించడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఓవియా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

హీరో శింబుతో కలిసి ఓవియా గతకొంతకాలంగా సన్నిహితంగా ఉంటోన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందిస్తూ.. ‘స్నేహానికి .. ప్రేమకి మధ్య చాలా తేడా వుంది. శింబు మంచి స్నేహితుడు .. నా వ్యక్తిగత విషయాలను నేను తనతో షేర్ చేసుకుంటాను. ఆయన సలహాలు .. సూచనలు తీసుకుంటాను. ఏ సాయం కోసమైనా .. ఏ సమయంలోనైనా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడేంత చనువు వుంది. ఎదుటివారి కష్ట సుఖాలను అర్థం చేసుకోగల మంచి మనసు శింబుకి వుంది. ఎదుటివారి సమస్యలకి తగిన పరిష్కారాలు సూచించగలగడంలో ఆయన ముందుటాడు. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఉండాలనే నేను కోరుకుంటున్నాను’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement