
తమిళసినిమా: కళవాణి చిత్రంతో నాయకిగా మంచి గుర్తింపు పొందిన నటి ఓవియ. ఆ చిత్రంతో మరిన్ని అవకాశాలు వచ్చినా అవన్నీ ఆశించిన విజయాలను సాధించకపోవడంతో వెనుకపడి పోయింది. అలాంటిది బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో ఈ జాణను ఒక్కసారిగా పాపులర్ చేసేసింది. ఆ గేమ్ షోలో నటుడు ఆరవ్‌తో ప్రేమ వ్యవహారం. అతను నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు దుమారం లాంటి సంఘటనలు ఆమెకు మైనస్ అవుతాయనుకున్న వాళ్లే షాక్ అయ్యేలా కథ రివర్స్ అయ్యింది. అలాంటి సంఘటనలు ఓవియకు బోలెడంత సింపతీని తెచ్చిపెట్టాయి. దీంతో అవకాశాలు వరస కడుతున్నాయి. ఇప్పటికే సిలుక్కువారుపట్టి సింగం, తెలుగులో ఇది నా లవ్‌స్టోరీ చిత్రాల్లో నటిస్తున్న ఓవియ తాజాగా లారెన్స్‌కు జంటగా కాంచన–3లో నటించే లక్కీచాన్స్‌ను కొట్టేసింది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇక ఓవియ విట్టయారు చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఓవియకు ఇలయదళపతి విజయ్‌తో నటించే మరో పెద్ద అవకాశం తలుపు తడితే దాన్ని నిరాకరించినట్లు తాజా సమాచారం. విజయ్ తన 62వ చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించనుండగా సన్ ఫిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో విజయ్‌కు జంటగా నటి రకుల్‌ప్రీత్‌సింగ్ నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఇదే చిత్రంలో మరో ముఖ్యపాత్రకు నటి ఓవియను నటింపజేసే ప్రయత్నం చిత్ర వర్గాలు చేసినట్లు, అందుకు ఓవియ సారీ చెప్పినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. కథానాయకిగా బిజీగా ఉన్న సమయంలో సపోర్టింగ్ పాత్ర చేయడం ఇష్టం లేకే ఈ బ్యూటీ విజయ్‌తో నటించే అవకాశాన్ని వదులుకున్నట్లు సమాచారం. ఆ అవకాశాన్ని ఓవియతో పాటు బిగ్‌బాస్ గేమ్ షోలో పాల్గొన్న నటి రైసా అందుకున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.
Comments
Please login to add a commentAdd a comment