ఇప్పటికైతే సింగిల్‌గానే ఉన్నా.. | Actress Oviya Interact Fans With Her Twitter Account | Sakshi
Sakshi News home page

ఇప్పటికైతే సింగిల్‌గానే ఉన్నా..

Jul 13 2020 8:45 AM | Updated on Jul 13 2020 8:45 AM

Actress Oviya Interact Fans With Her Twitter Account - Sakshi

ఇక ముందు తాను నటించను అని అంటోంది నటి ఓవియా. కలవాని చిత్రంతో కోలీవుడ్‌కు కథానాయికగా పరిచయం అయిన మలయాళి కుట్టి ఈ బ్యూటీ. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా రాణించలేకపోయింది. ఆ మధ్య బిగ్‌ బాస్‌ రియాల్టీ గేమ్‌ షో పాల్గొని అందరినీ ఆకర్షించింది. ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు సినీ అవకాశాలు వచ్చాయి.  ప్రస్తుతం చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు. సామాజిక మాధ్యమాల్లో తన గ్లామర్‌ ఫొటోలను విడుదల చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండే ఓవియా ఈమధ్య వాటికి దూరంగా ఉంటూ వచ్చింది. అలాంటిది లాక్‌ డౌన్‌ కాలంలో మరోసారి తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించింది.

అభిమానులు సంధించిన ప్రశ్నలకు ఓవియా తనదైన స్టైల్‌లో బదులిచ్చింది. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు గురించి అడిగిన ప్రశ్నకు రెండు వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నట్లు చెప్పింది. ఎవరినైనా ప్రేమిస్తున్నారా..? అన్న ప్రశ్నకు లేదు తాను ఇప్పటికీ సింగిల్గానే ఉన్నట్టు చెప్పింది. అదేవిధంగా రాజకీయ వారసత్వం గురించి అడిగిన ప్రశ్నకు ఇప్పుడు రాజకీయం అన్ని రంగాల్లోనూ ఉందని పేర్కొంది. అదేవిధంగా ప్రస్తుత కరోనా కష్టాల గురించి మీరు ఎలా స్పందిస్తారు..?

ప్రశ్నకు మన కష్టాలు ఇతరులకు ఎదురైనప్పుడే ఆ బాధ వారికి అర్థమవుతుందని చెప్పింది. కాబట్టి మన కష్టాన్ని మనమే ఎదుర్కోవాలని అంది. ఎవరో వచ్చి మనల్ని కాపాడాలని ఎదురు చూడరాదని పేర్కొంది. ప్రస్తుత జరుగుతున్న ఘటనపై ఎలా స్పందిస్తారు అన్న ప్రశ్నకు బదులిస్తూ నిజమైన నేరస్తులను శిక్షించే అధికారం తనకు లేదని, అలా జీవితంలో తాను నటించనని పేర్కొంది. అదేవిధంగా పెళ్లెప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు తనకు ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదని స్పష్టంగా చెప్పింది.

(ప్రముఖ కమెడియన్‌కు లైంగిక వేధింపులు..)

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement